తెలకపల్లి రవి : కాంగ్రెస్ నిజంగా ఇళ్లు చక్కదిద్దుకుంటుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అయిదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో మరోసారి దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ ఆలస్యంగా సమీక్ష ప్రారంభించింది. తాత్కాలిక అద్యక్షురాలు సోనియా గాంధీ ఆద్యక్షతన జరిగిన వర్కింగ్ కమిటీ వర్చువల్ సమావేశం మొక్కుబడిగా తప్ప లోతుగా పరిశీలన జరిపిందా అంటే లేదనే చెప్పాలి. ఈ ఎన్నికలో తమ పార్టీకి వచ్చిన పలితాలు చాలా నిరుత్సాహకరంగా వున్నాయని సోనియాగాంధీ వ్యాఖ్యానించడం మినహా మరే విధమైన ఆత్మ విమర్శ కనిపించలేదు. కేరళలో అస్సాంలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ కోరుకున్నది. పశ్చిమ బెంగాల్లో వామపక్షంతో కలసి పోటీ చేసి ప్రభావం చూపాలనుకున్నది. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఫిరాయింపులతో చేజారిన ప్రభుత్వాన్ని మళ్లీ తెచ్చుకోవలసింది. తీరా ఇందులో ఒక్క లక్ష్యాన్ని కూడా సాధించలేకపోయింది. తమిళనాడులో మాత్రమే అది కూడా స్టాలిన్ నాయకత్వంలోని డిఎంకె కూటమిలో భాగంగా వున్నందున పోటీ చేసిన 25లో 18 స్థానాలు తెచ్చుకోగలిగింది. అస్సాంలో ఇతర పార్టీలతో కలసి పోటీ చేసి గట్టిపోటీ ఇచ్చినా సీట్లలో బిజెపిని అందుకోలేకపోయింది. కేరళలో ఎల్డిఎఫ్ యుడిఎప్ లు ఒకదాని తర్వాత ఒకటి వచ్చే సంప్రదాయం వున్నా సరే ఈ దఫా చతికిలపడింది, పినరాయి విజయన్ నాయకత్వంలో ఎల్‌డిఎప్ అసాధారణంగా మళ్లీ విజయం సాధించితే కాంగ్రెస్ ఒకస్థానం గతం కన్నా తక్కువగా తెచ్చుకుంది. బెంగాల్లోనైతే తృణమూల్ బిజెపిల ద్విముఖ పోరుగా మారిన ఎన్నికల్లో వామపక్షాలు గాని వాటితో పొత్తుపెట్టుకున్న కాంగ్రెస్ గాని ఒక్కటంటే ఒక్క సీటు పొందలేకపోయాయి. పుదుచ్చేరిలోనూ బిజెపి ఎన్నార్ కాంగ్రెస్‌తో కలసి మొదటి సారి అధికారంలో భాగం పొందగలిగింది. ఇక్కడా కాంగ్రెస్ నుంచి ఫిరాయించిన వారే బిజెపిగా పోటీ చేసి గెలిచారు. కాంగ్రెస్ బలహీనపడటం వల్లనే బిజెపి పెరుగుతున్నదనే అభిప్రాయం నానాట బలపడుతున్నది.
ఈ పూర్వరంగంలో తాజా దెబ్బల తర్వాత కాంగ్రెస్ అధిష్టానం సోనియా రాహుల్‌గాంధీలు సూటిగా జరిగిన పొరబాట్లను గుర్తిస్తారని చాలామంది చూశారు. వాస్తవానికి గత ఆగష్టులోనే గులాంనబీ ఆజాద్ కపిల్‌సిబాల్, ఆనంద్ శర్మ, శశిథరూర్ తదితరులు 23 మంది పార్టీని ప్రక్షాళన చేయాలని బహిరంగ చర్చ లేవనెత్తారు. రాహుల్‌గాంధీ రాజీనామా తర్వాత ఇంతవరకూ పూర్తిస్థాయి అద్యక్షుడిని ఎన్నుకోలేకపోవడాన్ని కూడావారు విమర్శించారు. దానిపై దేశమంతటా పార్టీలో దుమారం రేగాక జనవరిలో సోనియాగాంధీ వర్కింగ్ కమిటీ సమావేశం జరిపారు. జూన్ 23కు సంస్థాగత ఎన్నికలు పూర్తిచేయాలని నిర్ణయించారు. కాని ఆ ప్రక్రియ పెద్దగా జరిగింది లేదు. కోవిడ్ కారణంగా దాన్ని వాయిదా వేయాలని సమావేశంలో అధికారికంగా నిర్ణయించారు.
Also Read
- OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్‌తో రాజీ ఎలా కుదిరింది?
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Off The Record: అవనిగడ్డ కూటమి పరిణామాలతోబుద్ధప్రసాద్ మధనపడుతున్నారా?
శాసనసభ ఎన్నికలో మన ఫలితాలు అంచనాల కన్నాచాలా దిగువన వుండిపోయాయని ఈ సమావేశంలో సోనియాగాంధీ వ్యాఖ్యానించారు. మనం ఇళ్లు చక్కబెట్టుకోవడం అవసరమని గుర్తు చేశాయి అన్నారు. ఎన్నికల పలితాలపై పార్టీ ముఖ్యమంత్రులు, ఎన్నికలు జరిగిన రాష్ట్రా నాయకులు నిర్మొహమాటంగా మాట్లాడాలన్నారు. దీనిపై తాను ఒక చిన్న కమిటీని వేస్తానని అది వీలైనంత త్వరలో నివేదిక ఇస్తుందని ప్రకటించి ఆ ఆంశం ముగించారు. ఇదంతా కాంగ్రెస్ ఆనవాయితీ ప్రకారమే జరిగిందని కొందరు నాయకులు అపహాస్యం చేశారు. రాహుల్‌గాంధీ స్క్రిప్టు లా వుందని కూడా అన్నారు. కోవిడ్‌ను ఎదుర్కోవడంలో మోడీ ప్రభుత్వ వైఫల్యాలను సమావేశం విమర్శించింది. సెంట్రల్ విస్తా పేరిట నూతన పార్లమెంటు భవన సముదాయం నిర్మాణం వాయిదా వేయాలని కోరింది. విజయం సాధించిన స్టాలిన్, విజయన్, మమతను అభినందించింది.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!