ఆర్‌ఆర్‌ఆర్ అనబడే రౌద్రం రుధిరం రణం చిత్రంలోని దోస్తీ పాటను దర్శకుడు రాజమౌళి విడుదల చేశారు. సంగీత దర్శకుడు కీరవాణి నిర్దేశంలో గాయకుడు హేమచంద్ర పాడిన సీతారామశాస్త్రి పాట చిత్రంలో చిత్రణ అలా వుంచితే విడుదలచేసిన ట్రైలర్‌లో కూడా ఉద్వేగభరితంగా వుంది. గిరిజనులను కదిలించి పోరాడిన అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌ల మధ్య వూహాజనిత స్నేహం దాని పరిణామం చిత్రకథ గనక స్నేహగీతం విడుదల చేయడం కూడా సముచితమే. పులికి విలుకానికి,తలకూ వురితాడుకూ కదిలే కార్చిచ్చుకు కసిరే…
పెగాసస్ స్పైవైర్‌పై పోరాటం అంతకంతకూ తీవ్ర రూపం దాల్చే సూచనలు కనిపిస్తున్నాయి.లోక్‌సభ రాజ్యసభ రెండుచోట్లా తమ వాయిదా తీర్మానాలను నోటీసులను తోసిపుచ్చడం ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పైగా తమ ఒత్తిడిని బేఖాతరు చేయడమే గాక ఇదే అదనుగా కీలకమైన బిల్లులను ఆమోదింపచేసుకోవడం వాటికి మరింత అసహనం కలిగిస్తున్నది. ఇది పార్లమెంటరీ సంప్రదాయాలను నిబంధనలను పాతర వేయడమేనని సభ్యులు విమర్శిస్తున్నారు.ఈ రోజు కూడా లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపి మనీష్ తివారి, రాజ్యసభలో సిపిఎం సభ్యుడు ఎలగారం కరీం…
పార్లమెంటు సమావేశాలకు ఒక రోజు ముందు పెగాసస్ స్పైవేర్‌తో వందలమంది మొబైళ్లను అక్రమంగా ఆలకించారన్న ఘోరం బయిటకు వచ్చింది. రహస్యంగా వినడానికే గాక రహస్య చిత్రాలు తీయడానికీ ఇది ఉపకరిస్తుంది. మన దేశంలో వైర్‌తో సహా ప్రపంచ వ్యాపితంగా పదిహేను దేశాల మీడియా సంస్థలు ఈ కథనాన్ని సాక్ష్యాధారాలతో సహా వెల్లడి చేశాయి.ఇజ్రాయిల్‌కు చెందిస స్పైవేర్ తయారీదారీ సంస్థ ఎన్‌ఎస్‌వో గ్రూపుచెప్పిన ప్రకారం దాన్ని ప్రభుత్వాలకే విక్రయిస్తారు.ఈ మాట మోడీ ప్రభుత్వమూకాదనలేదు. అనధికారికంగా హ్యాకింగ్ కుదిరేపని కాదంటున్నది.…
తెలంగాణ పిసిసి అద్యక్షుడుగా రేవంత్ రెడ్డి నియామకం కాంగ్రెస్‌లోనూ రాష్ట్ర రాజకీయాల్లోనూ ముఖ్య పరిణామం అవుతుంది. ఎడతెగని వివాదాలను అంతర్గత విభేదాలను పక్కనపెట్టి అధిష్టానం రేవంత్‌ను ఎంపిక చేయడంలో ఆయనపై విశ్వాసంతో పాటు ఆ పార్టీ పరిస్తితి కూడా అర్థమవుతుంది. ఎప్పటినుంచో వున్న పిసిపి పీఠం ఆశిస్తున్న హేమాహేమీలను కాదని, గత ఎన్నికల ముందు టిడిపి నుంచి కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌నే ఎంచుకున్నారంటే కెసిఆర్ ప్రభుత్వాన్ని ఢీకొనగల సత్తా ఆయనకే వుందని నాయకత్వం భావించిందన్న మాట. బండిసంజయ్…
కలెక్టరేట్‌ల కమిషనరేట్ల ప్రారంభాలు.. పెద్ద వైద్యశాలల శంకుస్థాపనలూ, దత్తత గ్రామస్తులతో సహపంక్తిభోజనం ఆపైన చమత్కార ప్రసంగం,,యాదాద్రి ఆలయ నిర్మాణ పర్యవేక్షణ, షరా మామూలుగా సమీక్షలు ఆదేశాలు కీలక నిర్ణయాలు.. ఏడేళ్ల తర్వాత కాంగ్రెస్ నాయకులకు అపాయింట్‌మెంట్ లాకప్‌డెత్‌పై విచారణ బాధిత కుటుంబానికి ఉద్యోగ కల్పన, ఆ పైన దళిత సంక్షేమంపై అఖిలపక్ష చర్చ అందుకోసం స్వయంగా ఫోన్లు., ఎపితో నీటివివాదంపై తీవ్ర భాషలో మంత్రుల దాడి..పివి నరసింహారావు శతజయంతి వేడుకల ముగింపు సభలు ఒకటేమిటి.. ముఖ్యమంత్రి కెసిఆర్…
ఎన్‌సిపి నేత శరద్‌పవార్ నివాసంలో మంగళవారం ప్రతిపక్ష నాయకుల సమావేశం గురించిన కథనాలన్నీ చాలా త్వరగా తేలిపోయాయి. ఏ సమావేశమైనా సరే దాని నిర్వాహకులెవరు, ఉద్దేశమేమిటనేదానిపై ఆధారపడి వుంటుంది. కాని ఈ సమావేశం విషయంలో ప్రతిదీ భిన్న కథనాలతో నడిచింది. శరద్ పవార్‌ను ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ రెండు సార్లు కలుసుకొని చర్చలు జరపడం దీనికి తొలి సంకేతమైంది. తర్వాత రాష్ట్రీయ మంచ్ నాయకుడుగా బయిలుదేరి ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ ఉపాద్యక్షులుగా వున్న మాజీ బిజెపి…
కేంద్రం పంజరంలో చిలుకగా పేరు మోసిన సిబిఐ డైరెక్టర్ ఎంపిక భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌విరమణ జోక్యంతో కొత్త మలుపు తిరగడం కీలక పరిణామం. సిబిఐ డైరెక్టర్ ఎంపిక కమిటీలో ప్రధాని, ప్రతిపక్ష నాయకుడు,సిజెఐ సభ్యులుగా వుంటారు. కేంద్ర క్యాబినెట్ తుది నిర్ణయం తీసుకుంటుంది గనక ఈ కమిటీ చర్చలు లాంఛనంగానే పరిగణించబడేవి. ఈసారి బిఎస్‌ఎప్ డైరెక్టర్‌గా వున్న రాకేశ్ ఆస్తానా, ఎన్‌ఐఎ బాస్ వైసిమోడీ పేర్లు తుది జాబితా నుంచి ఎగిరిపోయాయి. రాకేశ్ ఆస్తానాను ప్రధాని…
అయిదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో మరోసారి దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ ఆలస్యంగా సమీక్ష ప్రారంభించింది. తాత్కాలిక అద్యక్షురాలు సోనియా గాంధీ ఆద్యక్షతన జరిగిన వర్కింగ్ కమిటీ వర్చువల్ సమావేశం మొక్కుబడిగా తప్ప లోతుగా పరిశీలన జరిపిందా అంటే లేదనే చెప్పాలి. ఈ ఎన్నికలో తమ పార్టీకి వచ్చిన పలితాలు చాలా నిరుత్సాహకరంగా వున్నాయని సోనియాగాంధీ వ్యాఖ్యానించడం మినహా మరే విధమైన ఆత్మ విమర్శ కనిపించలేదు. కేరళలో అస్సాంలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ కోరుకున్నది. పశ్చిమ బెంగాల్‌లో వామపక్షంతో…