సత్యవేడు నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితేంటి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేతలు ఒకవైపు …కేడర్ మరోవైపు. ఇక ఎమ్మెల్యేదైతే అసలు ఏ దారో తెలియదు. ఇది అ నియోజక వర్గంలో అధికారపార్టీ పరిస్థితిపై జరుగుతున్న చర్చ. అధికారంలో ఉన్నా, ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ఉండటంతో అ నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది?
చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజక వర్గం అధికార వైసీపీలో పెద్ద చర్చకు కారణంగా మారింది. ఇక్కడ 2014 లో ఆదిమూలం పోటీచేసి ఓడిపోయారు. అయినా అధిష్ఠానం 2019 ఎన్నికలలోనూ అవకాశం ఇచ్చింది. జిల్లాలోనే అత్యధికంగా 45 వేలకుపైగా మెజారిటీ గెలిచారు. పార్టీసైతం అధికారంలోకి వచ్చింది. కానీ అక్కడ పార్టీ పరిస్థితి మాత్రం రోజురోజుకు దిగజారిపోతుందనే ప్రచారం జిల్లా పొలిటికల్ సర్కిల్స్ జోరుగా సాగుతోంది. పంచాయతీ ఎన్నికల నాటికే పూర్తిగా కంట్రోల్ తప్పిందని లోకల్ కేడర్ కోడై కూస్తోంది.
Also Read
పార్టీ పదవుల కోసం, నామినేటెడ్ పదవుల కోసం నియోజకవర్గంలో మండలాల్లో నాయకుల మధ్య వర్గ పోరు పీక్స్ కి చేరిందంటున్నారు. ఎంపీపీ పదవికోసం ఎంపీటీసీ అభ్యర్థులు వర్గాలుగా విడిపోయారని సమాచారం. ఇన్ని జరుగుతున్నా, ఎమ్మెల్యే ఆదిమూలం మాత్రం ఉన్నా లేనట్లుగానే వ్యవహరిస్తూన్నారట. కనీసం ప్రభుత్వ పథకాల అమల్లోను ఎమ్మెల్యే యాక్టివ్ గా ఉండటం లేదట. ఎమ్మెల్యేని జనం కలవాలంటేనే పెద్ద టాస్క్ గా మారిందట. అయన్ని కలవాలంటే పుత్తూరు పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటున్నారు.
ఇక నియోజకవర్గంలో సురుట్టుపల్లి దేవస్థానంలో చైర్మన్, సభ్యుల వ్యవహారం తీవ్ర చర్చకు కారణమైంది. ఎమ్మెల్యే వర్గం, మంత్రి వర్గం గొడవలకు దిగారు. నియోజకవర్గంలోని మండలాల్లో పార్టీ అధ్యక్షుల మార్పు చేయాలని కేడర్ ఎమ్మెల్యేపై ఒత్తిడి తెస్తున్నారట. ఎమ్మెల్యే కంటే… నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు …డిప్యూటీ సిఎం నారాయణ స్వామి అనుచరుల పెత్తనం ఎక్కువగా సాగుతోందని ఎమ్మెల్యే వర్గం గుర్రుగా ఉందని టాక్. ఈ పరిణామాల మధ్య కార్యకర్తలు నలిగిపోతున్నారని, సత్యవేడు, వరదయ్యపాళెం, పిచ్చటూరు, బుచ్చి నాయుడు కండ్రిగలలో అయితే ఈ గోడవలు పీక్స్ లో ఉన్నాయట. ఆ ఎఫెక్ట్ తిరుపతి ఉప ఎన్నికల సమయంలోను కనిపించిందని, దీని కారణంగానే సత్యవేడు నుండి ఎంపీకి ఆశించిన స్థాయిలో మెజారిటీ రాలేదని టాక్. ప్రభుత్వ పథకాలను, అభివృద్ది కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకొని పోవాల్సిన నేతలు.. ఎవరి స్వలాభం కోసం వారు అసలు బాధ్యతను మరిచి ప్రవర్తిస్తున్నారట. ఈ వర్గాల గొడవలు చూసిన ఎమ్మెల్యే సైతం తనకెందుకని సైలెంట్ గా ఉంటున్నారని నియోజకవర్గ ద్వితీయ శ్రేణి నేతలు జిల్లా పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. చాలామంది నాయకులు నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి చెప్పినా ప్రయోజనం లేకపోగా ఇంకా ఎక్కువ అవడం కొసమెరుపు అంటున్నారు. జిల్లా నేతల్లో, కేడర్ లోను అక్కడ అసలు ఏం జరుగుతుందనే చర్చ జోరుగానే సాగుతోంది. మరి సత్యవేడులో పార్టీని ఎవరు ఎలా గాడిలో పెడతారో అనేది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!