Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Special Focus On Prc Meeting In Andhra Pradesh

కీలక మీటింగ్స్‌లో టీ కాఫీలకే పరిమితం..!

Published Date :December 26, 2021 , 12:24 pm
By Manohar
కీలక మీటింగ్స్‌లో టీ కాఫీలకే పరిమితం..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

టిఫినీలు తిన్నారు.. కాఫీలు తాగారు. కీలక సమావేశంలో ల్యాప్‌టాపుల్లో మునిగిపోయారు. ఒకరు 14 అంటే.. ఇంకొకరు 34కి తగ్గేది లేదన్నారు. ఆ మీటింగ్స్‌లో ఇదే జరుగుతోందా? కాలక్షేపం కబుర్లు.. వ్యూహాత్మక ఎత్తుగడలతో సమావేశాలను మమ అనిపించేస్తున్నారా?

పీఆర్సీపై ఎడతెగని చర్చలు..!

ఏపీలో లక్షలాది మంది ఉద్యోగులకు కీలకమైన పీఆర్సీ కసరత్తు కొలిక్కి రాలేదు. ఫిట్‌మెంట్‌పై తేలుస్తారా తేల్చరా అని ఉద్యోగ సంఘాలు గట్టిగా అడగడంతో… ఆ మధ్య జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ మీటింగ్‌ నిర్వహించారు అధికారులు. 13 సంఘాలకు ఆహ్వానాలు వెళ్లడంతో వారంతా సూచించిన టైమ్‌కు చెప్పిన లొకేషన్‌ బ్లాక్‌ నెంబర్‌ 2 దగ్గరకు వచ్చేశారు. సీఎస్‌ సమీర్‌ శర్మ నేతృత్వంలో ఆర్ధికశాఖ కార్యదర్శులతో జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశం జరగాల్సి ఉంది. ఉద్యోగ సంఘ నాయకులు కమిటి హాల్‌లోకి వెళ్లి కూర్చున్నారు. ఐదు కావటానికి పావుగంట ముందే సీఎస్‌ సచివాలయం నుంచి తాడేపల్లిలోని సీఎమ్‌ క్యాంపు కార్యాలయానికి వెళ్లిపోవడంతో అంతా కంగుతిన్నారు.

టిఫిన్లు.. టీ కాఫీలతోనే సమయం గడిచిపోయిందా?

సీఎస్‌ లేకపోయినా ముగ్గురు ఆర్ధికశాఖ కార్యదర్శులు మీటింగ్‌ హాలులో ఉండటంతో ఉద్యోగ సంఘాల నేతలు సర్ది చెప్పుకొన్నారట. ఇక్కడే ఇంకో ట్విస్ట్‌ ఉంది. హెచ్‌ఆర్‌ ఫైనాన్స్‌ కార్యదర్శి శశిభూషణ్‌ సమావేశానికి వచ్చిన నేతల అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తే.. మిగిలిన ఇద్దరు కార్యదర్శులు రావత్‌, సత్యనారాయణలు తమతో తెచ్చుకున్న ల్యాప్‌ టాపుల్లో మునిగిపోయి.. తమ సమయం వృథా కాకుండా చూసుకున్నారట. దీంతో సీఎస్‌ వచ్చేంత వరకు మాటలు కలుపుతా.. అసలు విషయం పెద్దాయనతోనే మాట్లాడుకోవాలని చెప్పారట శశిభూషణ్‌. సీఎస్‌ రావటం లేటవుతుందేమో.. షుగర్‌ పేషెంట్స్‌కు ఇబ్బంది లేకుండా మరోదఫా స్నాక్స్‌ తెప్పిస్తాను.. అని సెటైర్లు వేశారట. టిఫిన్లు తిని, చల్లటి ఏసీ రూమ్‌లో వేడి వేడిగా టీ కాఫీలు తాగి.. నాయకులంతా పాత రీల్‌ మళ్లీ రీప్లే చేయడంతో అక్కడున్నవాళ్లకు సౌండ్‌ లేదట.

లెక్కలు మళ్లీ వెరిఫై చేస్తామన్న సీఎస్‌
ఉస్సూరుమంటూ బయటకొచ్చిన ఉద్యోగులు

రాత్రి 8 గంటలకు సీఎస్‌ సమీర్‌ శర్మ సచివాలయానికి వచ్చారు. అప్పటికే వెయింటింగ్‌లో ఉన్న JAC నేతలు అలిసిపోయి ఉంటారని భావించారో ఏమో.. 14 శాతం ఫిట్‌మెంట్‌తో సరిపెట్టేద్దాం అని సీఎస్‌ చెబితే.. ఉద్యోగ సంఘాల నాయకులు 34కి తగ్గేది లేదని సమాధానం ఇచ్చారు. 14 శాతం ఫిట్‌మెంట్‌ నివేదిక తప్పుల తడకగా కొట్టిపారేశారు JAC నేతలు. ఇలా పావు గంట గడిచాక.. అధికారులు చాణక్యం ప్రదర్శించారు. మా లెక్కలు తప్పంటున్నారు కదా.. మళ్లీ లెక్కలు వెరిఫై చేస్తాం అని బదులివ్వడంతో… మీటింగ్‌లో ఏదో తేలిపోతుందని అనుకున్న ఉద్యోగులకు ఆ సమాధానం మింగుడుపడలేదు. ఇదంతా కాదు సీఎం దగ్గరే తేల్చుకుంటా అని ఉద్యోగ సంఘాల నేతలు చెప్పడంతో.. చిరునవ్వులు చిందించారట అధికారులు. అయితే ఓకే.. ఇప్పుడు సీఎం ఉండరు. మళ్లీ వచ్చే వారమే అని మీటింగ్‌కు క్లోజ్‌ చేశారట. ఎంతో ఉత్సాహంతో మీటింగ్‌కు వెళ్లిన ఉద్యోగ సంఘాల నేతల ఉస్సూరు మంటూ బయటకొచ్చారు. ఏమైంది అని మీడియా ప్రశ్నిస్తే.. ఏముందీ ఈ మీటింగ్‌ కూడా మమ అనిపించారని నిట్టూర్పులిడిచారు. అదండీ.. పీఆర్సీపై మీటింగ్‌లో టీ కాఫీలకు, టిఫిన్లకు ఇస్తున్న ప్రాధాన్యం.. సమస్య పరిష్కారనికి ఇవ్వడం లేదని సచివాలయ వర్గాల్లో ఒక్కటే సణుగుడు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • Employees Unions
  • prc meeting

తాజావార్తలు

  • Ragi Chapati: షుగర్‌కు చెక్.. బరువు తగ్గడానికి బెస్ట్ మంత్రం.. ఈ స్టైల్‌లో రాగి చపాతీ తింటే ఫలితం పక్కా!

  • Trump: అగ్రరాజ్యాధినేత యుద్ధ విమరణకు కారణం ఇదేనా?

  • CM Chandrababu : ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. EHS బిల్లుల చెల్లింపు ఇక ఆన్‌లైన్‌లో

  • Pawan Kalyan Creative Works: పవన్ ఎలాంటి ప్రాజెక్టులు ఓకే చేయలేదు!

  • Iran: 24 రోజులుగా ఇంటర్నెట్ బంద్.. అలాడిపోతున్న ఇరానీయులు

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions