YCP : ఎమ్మెల్యే రాపాక వైఖరి నచ్చక పార్టీ లీడర్స్ జంప్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రమంతా రాజకీయం ఒక తీరున ఉంటే.. ఈ మూడేళ్లలో రాజోలు పాలిటిక్స్ మాత్రం ప్రత్యేకం. రాష్ట్రంలో జనసేన గెలిచిన ఏకైక నియోజకవర్గం ఇదే. ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ చాలా వేగంగా వైసీపీకి జైకొట్టేశారు. అప్పటి నుంచి మూడేళ్లుగా రాజోలు వైసీపీ రాజకీయం చిత్ర విచిత్ర మలుపులు తిరుగుతోంది. ఇంఛార్జులు మారిపోయారు. నేతల మధ్య సఖ్యత లేదు. ఒకరంటే ఒకరికి పడదు. ఈ గొడవల మధ్య ఇన్నాళ్లూ ఉగ్గబట్టి ఉన్న వైసీపీ నేతలు కొందరు.. ఇక ఇమడలేక గుడ్‌బై చెప్పేస్తున్నారు. దీనికంతటికీ ఎమ్మెల్యే రాపాక వైఖరే కారణమని రాజోలు వైసీపీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.
రాపాక కండువా మార్చేయడంతో.. కొందరు జనసేన స్థానిక నాయకులు ఆయన్ని అనుసరించారు. కానీ.. మొదటి నుంచి వైసీపీలో ఉన్న వారికి ప్రాధాన్యం దక్కక అసంతృప్తి రాజుకుంది. అది అనేక రకాలుగా బయట పడినా.. తాత్కాలిక సర్దుబాటు చేశారు కానీ.. సమస్యను పరిష్కరించలేదు పార్టీ పెద్దలు. దీంతో వేచి చూసిన అసంతృప్తి నాయకులు ఒక్కొక్కరుగా గుడ్‌బై చెప్పేస్తున్నారు. రాజోలుకు చెందిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి రుద్రరాజు వెంకట రామరాజు అదే చేశారు. రాపాక నాయకత్వాన్ని మొదటి నుంచి అంగీకరించని రామరాజు.. పార్టీ నిర్ణయాన్ని మార్చుకోవాలని గతంలో డిమాండ్ చేశారు. స్పందన లేకపోవడంతో ఆయనే వైసీపీ నుంచి వెళ్లిపోయారు. వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్న సాగి రామరాజు.. నియోజకవర్గ బూత్ కమిటీ ఇంఛార్జ్ సుందరపు బుల్లబ్బాయి సైతం పార్టీకి రాజీనామా చేసేశారు.
Also Read
- OTR : తెలంగాణ బీజేపీ నాయకులకు ఢిల్లీ అధిష్టానం వార్నింగ్ ఇచ్చిందా?
- OTR : Thopudurthi Prakash Reddy ఉక్కిరి బిక్కిర అవుతున్నారా? దిక్కుతోచల స్థితిలో ఉన్నారా..?
- OTR : సడన్ గా ఆగిపోయిన గాంధీభవన్ ముఖాముఖి.. కాంగ్రెస్‌లో మంత్రులపై అధిష్టానం సీరియస్?
- OTR : రెంటికి చెడ్డ రేవడిలా యనమల కృష్ణుడు రాజకీయ జీవితం?
రాజోలు వైసీపీ మూడు ముక్కలాటగా మారిందనే విమర్శలు మొదటి నుంచీ ఉన్నాయి. ఎమ్మెల్యే రాపాకను పార్టీ ఇంఛార్జ్‌గా ప్రకటించాక ఆ వర్గపోరు మరింత ఎక్కువైందట. తన వర్గానికే రాపాక ప్రాధాన్యం ఇవ్వడం.. వైసీపీలోని మిగతా నేతలకు అస్సలు రుచించలేదని సమాచారం. ఎమ్మెల్యే వైఖరి నచ్చని మరికొందరు నాయకులు సైతం రాజీనామా ఆలోచనలో ఉన్నట్టు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. గతంలో రాజోలు వైసీపీ కోఆర్డినేటర్లుగా పనిచేసిన బొంతు రాజేశ్వరరావు, పెదపాటి అమ్మాజీలు మొదటి నుంచి రాపాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ ఎవరి వర్గం వారిదే. బొంతకు, అమ్మాజీలకు నామినేటెడ్ పదవులు ఇచ్చినా కలిసి పనిచేసే పరిస్థితి లేదు. ఇప్పుడు నియోజకవర్గానికి చెందిన పార్టీ నేతలు జారిపోతుండటంతో కేడర్ కలవర పడుతోంది.
రాజోలులో జరుగుతున్న పరిణామాలను వైసీపీ పెద్దలు గమనిస్తున్నట్టు చెబుతున్నారు. పరిస్థితి చక్కదిద్దేందుకు చర్యలు తీసుకుంటారని కేడర్ భావిస్తోంది. అయితే సమస్య మరింత జఠిలం కాకుండా ఎప్పుడు దిద్దుబాటు చర్యలు చేపడతారన్నదే ప్రశ్న. వైసీపీ శ్రేణులు మాత్రం తాడేపల్లి నుంచి ఆదేశాల కోసం ఆశగా ఎదురు చూస్తున్నాయి.
తాజావార్తలు
-
Virat Kohli Bowling: బౌలింగ్‌కు రెడీ అయిన కోహ్లీ.. అవాక్కైన అంపైర్, ఫాన్స్.. చివరకు ఏమైందంటే?
-
Fridge Cleaning Tips: ఇంట్లోనే 5 నిమిషాల్లో తయారయ్యే ఈ నేచురల్ స్ప్రే వాడండి.. మీ ఫ్రిజ్ ఎప్పుడూ తాజాగానే ఉంటుంది..!
-
Ranveer Singh: హైకోర్టు ఆదేశాలతో..చాముండేశ్వరి ఆలయంలో రణ్వీర్ సింగ్ క్షమాపణలు!
-
Virat Kohli: నీ రేంజ్ ఏంటి.. నువ్వు చేసే పనులేంటి కోహ్లీ.! ఫన్నీ యాక్షన్స్ వైరల్..
-
Egg Storage Tips in Summer: వేసవిలో గుడ్లు ఎన్ని రోజులు నిల్వ ఉంటాయి..? తినే ముందు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
ట్రెండింగ్
-
Raw Mango Roti Pachadi: అమ్మ చేతి రుచిని గుర్తు చేసే పుల్లటి “మామిడికాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!