Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Palnadu Ycp Politics

Palnadu Politics : పల్నాడు వైసీపీలో కుండమార్పిడి రాజకీయాలు..!

Published Date :September 2, 2022 , 11:09 am
By Premchand Chowdary
Palnadu  Politics : పల్నాడు వైసీపీలో కుండమార్పిడి రాజకీయాలు..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఆ రెండు నియోజకవర్గాలలో అధికారపార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఒక MLA పక్క నియోజకవర్గం మీద కన్నేస్తే.. ఆ MLA నియోజకవర్గంపై ఆ పక్కనున్న MLA సోదరుడి కన్నుపడిందట. ఈ ఇద్దరూ చేస్తున్న.. చేసుకుంటున్న ప్రచారం ఒక్కటే. అక్కడ ఆయనైతే కష్టం.. నేను అయితే బెటర్‌ అని అట. ఇంతకీ ఎవరి ఫార్ములా ఏంటి? ఎవరు ఏం చేస్తున్నారో చూద్దాం..!

రోజులు మారుతున్నాయి.. రాజకీయాలు మారిపోతున్నాయి. మొన్నటి వరకు సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నవారు ఇప్పుడు తమ స్థానానికి గ్యారెంటీ లేదని తెలుసుకుని కొత్త మార్గాలు వెతుక్కుంటున్నారు. కానీ.. పల్నాడు ప్రాంతంలో వైసీపీ రాజకీయాలు మాత్రం వైవిధ్యంగా ఉన్నాయి. ఇక్కడ కుండమార్పిడి రాజకీయాలకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం నడుస్తోంది. గురజాల, నరసరావుపేట ఎమ్మెల్యేలను అక్కడి నుంచి పక్క స్థానానికి మారుస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంలో వాస్తవం ఎంత ఉందో కానీ.. అధికారపార్టీ అంచనాలు.. వ్యూహాలు మాత్రం ఎమ్మెల్యేలను టెన్షన్‌ పెడుతున్నాయి. ఈ ప్రచారంతో అలర్ట్‌ అయిన ఎమ్మెల్యేలు తమకు అనుకూలంగా ఉన్నచోట సీటు దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారట.

పల్నాడు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. జిల్లాలోని మరో నియోజకవర్గంలో తన సోదరుడిని బరిలో దింపేందుకు వ్యూహాలు రచిస్తున్నారట. వాస్తవానికి పిన్నెల్లికి మంత్రి పదవి ఇస్తారని భావించారు. కానీ ఆయనకు జిల్లా వైసీపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది పార్టీ. గురజాల నియోజకవర్గం కూడా తమ కుటుంబానికి కేటాయించాలని అధిష్ఠానాన్ని కోరారట పిన్నెల్లి. తన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డిని గురజాలలో పోటీ చేయించాలనే డిమాండ్‌ కుటుంబ సభ్యుల నుంచి కూడా రావడంతో పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న రామకృష్ణారెడ్డి సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధం అయ్యారట.

గతంలో కూడా గురజాల ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే పిన్నెల్లి ఈ ప్రాంతంలో గట్టిగానే తిరిగారు. ఏ చిన్న కార్యక్రమానికి పిలిచినా.. కార్యకర్తలకు కష్టం వచ్చినా పిన్నెల్లి వస్తారనే టాక్‌ ఉంది. ఇక్కడ నుంచి సోదరుడిని పోటీ చేయించాలనే వ్యూహంతోనే ఎమ్మెల్యే PRK గురజాలపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇక్కడ ప్రత్యర్థి పార్టీపై పైచెయ్యి సాధించాలంటే పిన్నెల్లి కుటుంబం మాత్రమే గట్టి పోటీ ఇస్తుందనే చర్చ PRK వైపు నుంచి ఉందట. పిన్నెల్లి బ్రదర్స్‌ సంగతి అలా ఉంటే.. గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి కూడా నరసరావుపేటలో పోటీ చేయాలనే కోరిక ఉందట. 2019లో కాసు నరసరావుపేటలోనే పోటీ చేయాలని చూశారు. అది సాధ్యం కాలేదు. 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికే 2019లోనూ ఛాన్స్‌ ఇచ్చింది పార్టీ.

ప్రస్తుతం మారుతున్న రాజకీయాలతో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని నరసరావుపే ఎంపీగా పంపుతారని.. లేదా కాసు మహేష్‌రెడ్డిని ఎంపీగా నిలబెడతారని జోరుగా ప్రచారం నడుస్తోంది. ఎటు తిరిగి పిన్నెల్లి కుటుంబానికి గురజాలపై కన్ను ఉండటంతో కాసు మహేష్‌రెడ్డి నరసరావుపేట రాజకీయాల్లోకి రావడంతో ఆశ్చర్యం లేదనే వాదన పార్టీలో ఉంది. గురజాలలో జంగా కృష్ణమూర్తితో కాసు వర్గానికి ఉన్న వైరం కొనసాగుతోంది. అందుకే గురజాల నుంచి దూరంగా జరిగితే బెటర్‌ అనే ఆలోచనలో కాసు వర్గీయుల్లో ఉందట. నరసరావుపేటలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్‌పై కన్నేసిన గోపిరెడ్డిని కాదని అధిష్ఠానం మహేష్‌రెడ్డికి అవకాశం ఇస్తుందా లేదా అన్నది చూడాలి.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • gopireddy srinivasa reddy
  • Mahesh Reddy
  • Palnadu Politics
  • Pinnelli Ramakrishna Reddy
  • Y S R Congress Party

తాజావార్తలు

  • Adivi Sesh: ‘డెకాయిట్’ నా కల.. రెండేళ్ల కష్టానికి ప్రతిరూపం: అడివి శేష్

  • Venkatesh: సుప్రియ కోసం కాదు.. ఆయన కోసమే ఈవెంట్‌కు వచ్చా.. విక్టరీ వెంకటేష్

  • Dacoit Movie: ఇక నా వల్ల కాదు, తెలుగు సినిమా చేయను.. డైరెక్టర్‌కు మృణాల్ ఠాకూర్ ఫోన్!

  • OTR: రామచంద్రపురంలో షాడో ఎమ్మెల్యేలా మంత్రి తండ్రి.?

  • Story Board : Iran షరతులకి America తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions