OTR: ఆలేరు ఎమ్మెల్యే వైఖరిపై భువనగిరి ఎమ్మెల్యే అసంతృప్తి
- ఆలేరు ఎమ్మెల్యే వైఖరిపై భువనగిరి ఎమ్మెల్యే అసంతృప్తి
- చెప్పకుండా బీర్ల భువనగిరిలో పర్యటిస్తున్నారని కుంభం అసహనం
- ఐలయ్యకు నేరుగా చెప్పినా మారలేదని అనిల్‌కుమార్‌రెడ్డి కోపం
- కార్యక్రమం ఏదైనా ఒకరు వెళ్ళిపోయాక మరొకరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OTR: ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యేకి పొరుగింటి పుల్లకూర విపరీతంగా నచ్చేస్తోందట. సొంత నియోజకవర్గం సంగతి ఎలా ఉన్నా… పక్క సెగ్మెంట్ మీద విపరీతమైన ప్రేమ పెరిగిపోతోందట. సందు దొరికితే చాలు… అక్కడ వాలిపోతూ తెగ కలియదిరిగేస్తుండటంతో… ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేకి ఎక్కడో… కాలుతోందంటున్నారు? ఎవరా పొరుగు ప్రేమల శాసనసభ్యుడు? ఏంటా పొలిటికల్ ప్రేమాయణం?. ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తీరుపై కొద్ది రోజుల నుంచి భువనగిరి శాసనసభ్యుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి తీవ్ర అసంతృప్తిగా ఉన్నారట. తనకు మాట మాత్రం చెప్పకుండా తన నియోజకవర్గం భువనగిరిలో…. బీర్ల, టూర్ల మీద టూర్లు వేసేస్తుండటమే అందుకు కారణం అంటున్నారు. సమాచారం ఇవ్వకుండా నియోజకవర్గంలో పర్యటనలు చేయడం సరికాదని, చెప్పి రావాలి….. లేదా తనతో కలిసి పర్యటించాలని అంటున్నారు కుంభం. ఈ విషయాన్ని ఆలేరు ఎమ్మెల్యేకే సూటిగా…సుత్తి లేకుండా చెప్పేశారట అనిల్‌కుమార్‌రెడ్డి. అయినా సరే…. ప్రభుత్వ విప్ వ్యవహార శైలిలో మార్పు రాకపోగా… టూర్స్ అలాగే కంటిన్యూ అవుతున్నాయని అంటున్నారు.
దీంతో… అసలాయన ఏమనుకుంటున్నారంటూ బీర్ల ఐలయ్య వైఖరిపై కుంభం అనిల్‌కుమార్ రెడ్డి తన సన్నిహితుల దగ్గర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎక్కడా లేని విధంగా నా దగ్గరే ఇలా ఎందుకు? నేరుగా నేనే చెప్పినా మార్పు రాకపోవడం ఏంటి? వాట్స్ హ్యాపెనింగ్ అంటూ మండిపడుతున్నారట. ఈ క్రమంలో కొద్ది కాలంగా ఇద్దరు అక్కడక్కడా కలిసే తిరుగుతున్నా…. నోటితో మాట్లాడుతూ… నొసలుతో వెక్కిరించుకుంటున్నట్టే ఉందని అంటున్నారు ఇద్దర్నీ దగ్గరగా గమనిస్తున్నవాళ్ళు. భువనగిరి ప్రభుత్వ పాఠశాలలో చెట్టు విరిగిపడి విద్యార్థి మరణించిన ఘటనలో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆ కుటుంబాన్ని పరామర్శించి… పరిహారం ప్రకటించడం వివాదాస్పదమైంది. అలాగే… జిల్లా హెడ్ క్వార్టర్లో జరిగే కార్యక్రమాలకు ఇద్దరు ఎమ్మెల్యేలను ఆహ్వానిస్తే ఒకరి తర్వాత మరొకరు వచ్చి పోతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో జరిగే కార్యక్రమాల్లో కూడా ఇదే తంతు కొనసాగుతోందని అంటున్నారు. ఇటీవల జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్నే ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు హస్తం పార్టీ నేతలు.
Also Read
అంతేకాదు… ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు కార్యకర్తలు, సీనియర్ కాంగ్రెస్ నేతలు సైతం చిలువలు పలువలు చేసి మాట్లాడుకుంటున్నారని, ఇది కాంగ్రెస్‌కు అంత మంచిది కాదన్న అభిప్రాయం బలంగా ఉంది. ఉపాధ్యాయ దినోత్స వ వేడుకలకు మొదట ప్రభుత్వ విప్ బీర్ల హాజరైతే… ఆయన వెళ్లిపోయాక భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అటెండ్ అవడం చర్చనీయాంశంగా మారింది. తర్వాత స్పీడ్ పెంచిన బీర్ల…గణపతి నవరాత్రులలోనూ భువనగిరి టౌన్, భువనగిరి నియోజకవర్గ గణపతి మండపాలను చుట్టేశారట. తాజాగా మదర్ డైరీ ఎన్నికల్లో భువనగిరి నియోజకవర్గానికి చెందిన డైరెక్టర్ స్థానానికి కూడా ఆలేరుకు చెందిన వ్యక్తినే అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఇదేంటని ప్రశ్నించిన భువనగిరి ఎమ్మెల్యే… తాను కూడా మరో అభ్యర్దిని పోటీకి పెట్టారు. మదర్ డైరీ డైరెక్టర్ ఎన్నికల పరిధిలోకి నకిరేకల్, తుంగతుర్తి నియోజకవర్గాలు కూడా వస్తాయి. కానీ… ఆ నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వకుండా డైరెక్టర్స్ అభ్యర్థుల ఎంపిక జరగడంపై ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వ విప్ తీరుపై అసంత్రుప్తిగానే ఉన్నట్లు సమాచారం.
ఇలా కొద్ది నెలలుగా భువనగిరి, ఆలేరు ఎమ్మెల్యేల మధ్య టామ్ అండ్ జెర్రీ వార్ నడుస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఐలయ్య దూకుడు వెనక ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ మంత్రి సూచనలు, సలహాలు ఉన్నట్టు అనుమానిస్తోందట కుంభం వర్గం. సదరు మంత్రి అండతోనే ప్రభుత్వ విప్ పక్క నియోజకవర్గంలో కూడా పర్యటనలు చేస్తున్నారంటూ మాట్లాడుకుంటున్నారు. ఇదే రీతిలో…మరి ఆలేరులో భువనగిరి ఎమ్మెల్యే తిరిగితే ఒప్పుకుంటారా… అంటూ ప్రశ్నిస్తోంది కుంభం వర్గం. విప్ వెనక ఉన్న సదరు మంత్రి ఇలాకాలో ఇతర ఎమ్మెల్యేలు పర్యటిస్తున్నారా అని కూడా అడుగుతున్నారు. భువనగిరి నియోజకవర్గంలో పదవులు దక్కని కొందరు నేతలు… ప్రాధాన్యత కోల్పోయిన ఇంకొందరు బీర్లను రా… రమ్మని పిలుస్తున్నారనే చర్చ కుంభం వర్గీయుల్లో జరుగుతోంది. అదే సమయంలో కొందరు ఇంటి దొంగల వల్లే ఈ రచ్చ అంతా అని అంటున్నారు మరికొందరు హస్తం నేతలు. యాదాద్రి జిల్లాలో ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు కలిసి పనిచేయాల్సింది పోయి… అంతర్గత పోరుకు తెరలేపడంపై కాంగ్రెస్ సీనియర్స్‌లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. మొదటిసారి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు.. ప్రజాసమస్యల పరిష్కారంలో పోటీ పడాల్సింది పోయి… సమన్వయం, సంయమనం లేకుండా వ్యవహరించడం వాళ్ల కెరీర్‌కే మంచిది కాదంటున్నారు పార్టీ సీనియర్ నేతలు.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!