Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Otr Mla Burla Ramanjaneyulu Faces Allegations In Pattipadu

OTR: మోనార్క్‌ ఎమ్మెల్యే.. టైం వస్తుందంటున్న మైనారిటీలు!

Published Date :December 29, 2025 , 10:45 pm
By Sampath Kumar
  • 2024లో మాజీ ఐఎఎస్‌ బూర్ల రామాంజనేయులు గెలుపు
  • ప్లస్‌ అనుకుంటే మైనస్‌ అవుతున్నారన్న అభిప్రాయం
  • నియోజకవర్గంలోని ప్రతి మండలంలో గ్రూప్‌ పాలిటిక్స్‌
  • ఎమ్మెల్యే వైఖరి గ్రూప్స్‌ని ప్రోత్సహించేలా ఉంటోందన్న టాక్‌
  • డ్వాక్రా యానిమేటర్‌ విషయంలో పెరిగిన అపోహలు
  • పత్తిపాడులో ముస్లింలను పట్టించుకోకుండా వెళ్ళిపోయిన ఎమ్మెల్యే
  • మాకూ టైం వస్తుందంటున్న మైనారిటీలు
  • ఇళ్ళ స్థలాలపై స్పందన లేదంటూ సొంత కార్యకర్తల అసహనం
OTR: మోనార్క్‌ ఎమ్మెల్యే.. టైం వస్తుందంటున్న మైనారిటీలు!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఆ ఫస్ట్‌ టైం ఎమ్మెల్యే ఇక సింగిల్‌ టైం శాసనసభ్యుడిగానే మిగిలిపోతారా? నేను మోనార్క్‌ని, నచ్చినట్టు చేసుకుని పోతాను తప్ప ఎవ్వరితో నాకు పనిలేదని సదరు ఆఫీసర్‌ టర్న్‌డ్‌ ఎమ్మెల్యే అంటున్నారా? నియోజకవర్గంలో గ్రూప్స్‌ని సెట్‌ చేయాల్సిన నాయకుడే ఇంకా ఎగదోస్తున్నారా? దానివల్ల ఆయనకేంటి ఉపయోగం? ఎవరా ఎమ్మెల్యే? ఏంటా మోనార్క్‌ స్టోరీ?

గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో పార్టీ పెట్టినప్పటి నుంచి టీడీపీదే హవా. ఆ పార్టీ తరపున మాకినేని పెదరత్తయ్య వరుసగా ఐదు సార్లు గెలిచారు. 2004 నుంచి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నా…పట్టు నిలుపుకుంటూనే ఉంది తెలుగుదేశం. ఇక 2024 ఎన్నికల్లో మాజీ ఐఏఎస్ అధికారి బూర్ల రామాంజనేయులు ఇక్కడి నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో గుంటూరు జిల్లా కలెక్టర్‌గా కూడా పనిచేశారాయన. పరిస్థితులన్నీ తెలుసుకాబట్టి ప్లస్‌ అవుతారనుకుంటే… కొంత కాలంగా ఆయన వ్యవహారశైలితో ప్రత్తిపాడు టీడీపీలో నేతల మధ్య విభేదాలు పెరుగుతున్నట్టు చెప్పుకుంటున్నారు. నియోజకవర్గంలో పత్తిపాడు, వట్టిచెరుకూరు, పెదనందిపాడు, కాకుమాను, గుంటూరు రూరల్ మండలాలున్నాయి. ఈ ఐదింటిలో ప్రతి చోట గ్రూప్‌ పాలిటిక్స్ ఉన్నాయి. పత్తిపాడు, పెదనందిపాడు, వట్టిచెరుకూరు మండలాల్లో అయితే…తరచూ బయటపడుతూనే ఉన్నాయి. ఇక కాకుమాను, గుంటూరు రూరల్‌లో అంతర్గతంగా రగిలిపోతోంది పార్టీ. తరచూ అభ్యర్థుల్ని మార్చడం వల్ల తయారైన గ్రూప్స్‌తో ఇప్పటికే అల్లాడుతుంటే… వాటికి ఎమ్మెల్యే వైఖరి ఆజ్యం పోసినట్టు అవుతోందన్నది పార్టీ టాక్‌. విభేదాలను పరిష్కరించాల్సిన ఎమ్మెల్యే రామాంజనేయులు ఆ దిశగా కనీసం కృషి చెయ్యడంలేదనే విమర్శలు పార్టీలో ఉన్నాయి. పైగా వాటిని ప్రోత్సహించేలా ఆయన వైఖరి ఉంటోందన్న విమర్శలు పెరుగుతున్నాయి.

Also Read

  • Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
  • Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
  • Off The Record : ఖమ్మం పాలిటిక్స్.. కలెక్టర్లు తట్టుకోలేకపోతున్నారా? ముగ్గురి మార్పు వెనుక అసలు కథ!
  • Off The Record : గులాబీ బాస్ పోస్ట్ మార్టం.. అసెంబ్లీ ఎన్నికల తప్పులపై BRS సీరియస్ ఫోకస్!

పత్తిపాడు మండలం గొట్టిపాడు డ్వాక్రా యానిమేటర్ వ్యవహారమై ఆ మధ్య విబేధాలు వచ్చాయి. దీంతో ఓ వర్గం యానిమేటర్‌ని తొలగించాలని, ఉంచాల్సిందేనని మరో వర్గం పట్టుబట్టాయి. ఈ వ్యవహారంలో ఉన్న అపోహలను తొలగించాల్సిన ఎమ్మెల్యే ఎవ్వర్నీ పట్టించుకోలేదు. పైగా.. యానిమేటర్‌ కూడా బదిలీ లేకుండా అక్కడే ఉన్నారు. దాంతో.. ఎమ్మెల్యే ఓ వర్గానికి కొమ్ముకాస్తున్నట్టు మరో వర్గం భావించింది. గొట్టిపాడులో ఇప్పటికీ ఆ సమస్య అలాగే ఉంది. ఇక పెదనందిపాడు మండలం పాలపాడులో వాటర్ ప్లాంట్ వ్యవహారంలో కూడా ఎమ్మెల్యే ఇలాగే వ్యవహరించారు. దీంతో అక్కడ కూడా సొంత పార్టీ నేతలే ఆయన తీరుపై ఆగ్రహంగా ఉన్నారు. ఇక కొన్ని రోజుల క్రితం ప్రత్తిపాడులో ఎఫ్.సి.ఐ. గోడౌన్ ప్రారంభోత్సవానికి వెళ్లారు ఎమ్మెల్యే రామాంజనేయులు. అదే సమయంలో అక్కడకు వచ్చిన టీడీపీ మైనార్టీ నేతలు గ్రామంలో కొత్తగా నిర్మించబోతున్న షాదీఖానాకు ఎమ్మెల్యే చేతుల మీదుగా విరాళం ఇప్పించే ప్రయత్నం చేశారు. కానీ… ఆయన వాళ్ళని పట్టించుకోకుండా వెళ్లిపోయారు.

దీంతో టీడీపీ మైనార్టీ నేతలంతా ఎమ్మెల్యే తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం తమను పట్టించుకోకపోవడం ఏంటంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. రేపు మళ్లీ ఓట్లు అడగడానికి మా దగ్గరికి రాకుండా పోతారా అంటూ కోపంగా ఉన్నారు ముస్లిం నాయకులు. ఇక ఇంటి స్థలాల సమస్యతో కొంతమంది పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినా సరిగా స్పందించలేదట. దాంతో వాళ్ళు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ….. సమావేశాలు పెట్టి మీ సమస్యలు మా దృష్టికి తీసుకురమ్మని చెబుతారు…తీరా వస్తే స్పందించరని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఆ మాత్రం దానికి మీటింగ్‌లు ఎందుకు దంగడ అంటూ అక్కడనుంచి వెళ్లిపోయారు. నియోజకవర్గంలోని కొందరికే ఎమ్మెల్యే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ పార్టీలో విమర్శలు పెరుగుతున్నాయి. రామాంజనేయులు పోటీ చేసినప్పటినుంచి ఆయనతోనే ఉన్న నియోజకవర్గానికి చెందిన ఓ సీనియర్ నేత వారం రోజులుగా కనిపించడంలేదు. ఎమ్మెల్యే తీరుతో మనస్తాపానికి గురైన ఆ నేత దూరంగా ఉంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఉన్న విబేధాలను పరిష్కరించకపోగా తన వ్యవహారశైలితో ఎమ్మెల్యే సమస్యను మరింత పెంచుతున్నారన్న అభిప్రాయం బలపడుతోంది పత్తిపాడులో.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ap
  • Burla Ramanjaneyulu
  • OTR
  • OTR Pattipadu
  • Pattipadu

తాజావార్తలు

  • CM Chandrababu: ఏపీ ప్రజలకు NDA వల్ల మరోసారి స్వాతంత్య్రం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

  • Shubman Gill: స్టేడియంలో కోహ్లీ-గిల్ మధ్య ఉద్రిక్తత.. కెప్టెన్ శుభ్‌మన్‌ గిల్ ఇన్‌స్టా పోస్ట్ వైరల్..

  • NDMA: మే 2న లక్షలాది మొబైల్ ఫోన్లలో ఒకేసారి సైరన్.. ఎందుకంటే?

  • Weather Updates in Regional Languages: రైతులకు గుడ్‌న్యూస్‌.. ఇక ప్రాంతీయ భాషల్లోనే వాతావరణ సమాచారం..

  • NTRNEEL : డ్రాగన్ పార్ట్ – 2 కోసం ఎన్టీఆర్ షాకింగ్ మేకోవర్

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions