OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OTR: గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి రేషన్ బియ్యం అక్రమ రవాణాపై యుద్ధం ప్రకటించారు. తన నియోజకవర్గంలో పేదలకు అందాల్సిన బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలించి అమ్ముకుంటున్నారంటూ స్వయంగా ఎమ్మెల్యేనే ఆరోపించారు. అయితే… మాటలతో సరిపెట్టకుండా… రేషన్ షాపుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలంటూ కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. అలాగే… రేషన్ బియ్యం అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం ఇవ్వాలని పార్టీ నాయకులకు సూచించారు.
ఆ క్రమంలోనే…. రెండు వారాల క్రితం అనుచరుల ఇన్ఫర్మేషన్తో అధికారుల్ని అలర్ట్ చేశారు ఎమ్మెల్యే. తక్షణం స్పందించిన అధికారులు బియ్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు పెట్టారు. ఇక తాజాగా… రెండు రోజుల క్రితం మాధవి నివాసానికి సమీపంలోనే రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించేందుకు సిద్ధమవుతున్నారన్న సమాచారం వచ్చింది. దీంతో నేరుగా ఎమ్మెల్యే రంగంలోకి దిగారు. రేషన్ షాపు దగ్గరికి వచ్చి…. బియ్యం లోడు చేసిన వాహనాన్ని ఆపి డ్రైవర్‌ను ప్రశ్నించారామె. డైరెక్ట్‌గా శాసనసభ్యురాలే రంగంలోకి దిగి పట్టించడంతో… అధికారులు కూడా వెంటనే అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం వాహనాన్ని సీజ్ చేశారు. పేదలకు అందాల్సిన బియ్యం పక్కదారి పడుతోందని నేరుగా అధికార పార్టీ ఎమ్మెల్యేనే ఆరోపించడం, ఆమే వాహనాన్ని పట్టించడం జిల్లాలో సంచలనమైంది. అంత వరకు బాగానే ఉందని అనుకున్నా…. ఆమె వైఖరి టీడీపీకే చెందిన ఇతర శాసనసభ్యులకు ఇబ్బందికరంగా మారుతోందన్నది లేటెస్ట్ హాట్.
Also Read
అదేంటి… ఎమ్మెల్యే మాధవి తన నియోజకవర్గంలో రేషన్ అక్రమాలను ఆపితే మిగతా వాళ్ళకు ఇబ్బంది ఏంటని అనుకుంటున్నారా…? కానీ అసలు ట్విస్ట్ అక్కడే ఉందట. సాధారణంగా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులకు రేషన్ డీలర్లుగా అవకాశం కల్పిస్తుంటారు. ఇది ప్రతి నియోజకవర్గంలోనూ జరిగే తంతే. ఇక రేషన్ డీలర్లు బియ్యాన్ని బ్లాక్ మార్కెట్లో అమ్మి సొమ్ము చేసుకుంటారన్న ఆరోపణలు కూడా గట్టిగానే ఉన్నాయి. ఇలా ప్రతి నియోజకవర్గంలో రేషన్ డీలర్ల నుంచి బియ్యం కొనుగోలు చేసేవాళ్ళలో ప్రజాప్రతినిధుల అనుచరులు కూడా ఉంటారు. వీరు వివిధ గ్రామాల నుంచి సేకరించిన బియ్యాన్ని సిండికేట్ బాస్ కు అమ్ముతుంటారు. ప్రతిచోట ఇది బహిరంగ రహస్యం. రేషన్ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్లో అమ్ముకోవడం ద్వారా ప్రజాప్రతినిధుల అనుచరులకు లక్షలు మిగులుతాయన్న ప్రచారం సైతం ఉంది. కొంతమంది దీన్నో ఆదాయ వనరుగా మార్చుకున్నారనడంలో ఎలాంటి సందేహం ఉండబోదన్న మాటలు సైతం వినిపిస్తుంటాయి. ఒక్కో నియోజకవర్గంలో నెలకు పది నుంచి ఇరవై లక్షల వరకూ బియ్యం అమ్మకాల ద్వారా దండుకుంటున్నారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. అదంతా ఆ స్థాయిలో జరుగుతంటే… జిల్లాలో ఏ ప్రజాప్రతినిధి కూడా అటువైపు కన్నెత్తి చూసింది లేదు. ఈ వ్యవహారంలో ఉన్నవారంతా అధికార పార్టీకి చెందిన వాళ్ళే కాబట్టి…. పవర్ ఉన్నప్పుడే మనోళ్ళని నాలుగు రాళ్ళు వెనకేసుకోనివ్వండన్న వైఖరితో ఉంటారట. కానీ… ఇప్పుడు గళ్లా మాధవి రేషన్ అక్రమాల పేరుతో ఆరోపణలు చేయడం, స్వయంగా వాహనాలను పట్టుకోవడం జిల్లాలోని మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందికరంగా మారిందట.
గుంటూరు వెస్ట్‌లో ఆ స్థాయిలో అక్రమ రవాణాను అడ్డుకుంటుంటే మిగతా వాళ్ళంతా కామ్ ఉండటం ఏంటంటూ చర్చ మొదలవడం వాళ్లకు మింగుడు పడ్డంలేదట. కొంతమందిని అయితే… ఎమ్మెల్యే మాధవిలా మీరు కూడా రేషన్ అక్రమాలు జరక్కుండా ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. దీంతో… ఆమె పోరాటం ఏమోగానీ… మా ప్రాణానికి వచ్చిందంటూ ఉమ్మడి గుంటూరు టీడీపీ ఎమ్మెల్యేలు సణుక్కుంటున్నారట. ఇంకొందరైతే… ఎందుకమ్మా మమ్మల్ని ఇరికిస్తున్నావ్… అంటూ ఫీలైపోతున్నట్టు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Mandadi Teaser: ‘మండాడి’ టీజర్ చూశారా? సుహాస్, సూరి ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది!
-
Dean Elgar Retirement: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన దక్షిణాఫ్రికా స్టార్.. విరాట్ కోహ్లీతో వివాదం గుర్తుందా?
-
Toxic vs Irumudi : టాక్సిక్ టాక్.. ఇరుముడికి తిరుగులేదు
-
Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్‌తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
-
Paradise Second Single: ‘ది ప్యారడైజ్’ సెకండ్ సింగిల్.. ఇలాంటి లాంచ్ ఎప్పుడూ చూసి ఉండరు!
ట్రెండింగ్
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
-
10.1 అంగుళాల టచ్‌స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్‌తో Suzuki e-Sky లాంచ్..!
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
165Hz డిస్ప్లే, 24GB RAM, 7,470mAh బ్యాటరీతో Lenovo Legion Tab Y700 AI టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?