Mandadi Teaser: ‘మండాడి’ టీజర్ చూశారా? సుహాస్, సూరి ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mandadi Teaser: సుహాస్, సూరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘మండాడి’. ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ బ్యానర్‌పై మతిమారన్ పుగళేంది ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఎల్రెడ్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మహిమా నంబియార్ హీరోయిన్గా నటిస్తున్నారు. సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే సినిమాపై ఆసక్తి నెలకొనగా.. తాజాగా విడుదలైన ‘మండాడి’ టీజర్ ఈ చిత్రంపై అంచనాలను మరింత పెంచేసింది. టీజర్‌లోని డైలాగ్స్, విజువల్స్, బోట్ సీక్వెన్స్, పడవ పందేలకు సంబంధించిన సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ‘పందెమే మనల్ని కాపాడుతుంది.. పందెన్ని మనం కాపాడటం లేదు’, ‘బరిలోకి దిగే ప్లేయర్స్‌లో నిజాయితీ ఉంటే.. ఈ గాలి, సముద్రం మిమ్మల్ని ఎప్పటికీ ఒగ్గేయదు’ వంటి డైలాగ్స్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి.
ఎస్.ఆర్. కథిర్ సినిమాటోగ్రఫీ కూడా టీజర్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. టీజర్లో యాక్షన్, ఎమోషన్, డ్రామా, విజువల్స్‌కు ప్రాధాన్యత ఇవ్వడంతో ‘మండాడి’పై అంచనాలు ఒక్కసారిగా రెట్టింపయ్యాయి. పడవ పందేల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. కాగా ‘మండాడి’ సెప్టెంబర్ 10న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఏపీ, తెలంగాణలో ఈ సినిమాను మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ భారీ స్థాయిలో విడుదల చేయనుంది. తాజా టీజర్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
Also Read
- Rashmika Mandanna: గానకోకిల బయోపిక్‌లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
- CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్‌లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
- Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్‌పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
- Actor Sridevi: నటి శ్రీదేవి ఆస్తి వివాదంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
తాజావార్తలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
-
ED Raids : అమెరికన్లకు ఫేక్ కాల్స్.. భారత్‌లో ఈడీ మెరుపు దాడులు.!
-
OTR: కేంద్ర మంత్రి బండి సంజయ్ కు కీలక బాధ్యతలు..?
-
AP High Court: బీసీలకు 34% రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!