Site icon NTV Telugu

Off The Record: ఇక్కడ పోస్టింగ్స్ అంటేనే వణికిపోతున్న అధికారులు

Wgl

Wgl

Off The Record: ఆ పోలీస్ స్టేషన్ పేరు చెబితేనే ఆఫీసర్స్‌ హడలిపోతున్నారట. అక్కడ ఇన్స్‌పెక్టర్‌గా ఉద్యోగం చేయాలంటే… వామ్మో…. అంటున్నారట. ఆ స్టేషన్‌కు ఎస్‌హెచ్‌వోగా వెళితే… ఏదో ఒక వివాదంతో ముద్ర వేసుకుని రావడం ఖాయమంటున్నారు. పదేళ్ళ కాలంలో 11మంది పోలీస్‌ ఇన్స్‌పెక్టర్లు ఎందుకు మారాల్సి వచ్చింది? నిండా ఏడాది కూడా ఎందుకు పని చేయలేకపోతున్నారు? అంత వివాదాస్పద స్టేషన్‌ ఏది? అక్కడున్న ప్రత్యేక పరిస్థితులు ఏంటి?

Read Also: Etala Rajender : “ఆనాడు మీరు చేసిందేంటి?”.. కశ్మీర్ సమస్యకు కారణం కాంగ్రెస్ కాదా?

వరంగల్ సబ్ డివిజన్ పరిధిలోని మిల్స్ కాలనీ ఇన్స్‌పెక్టర్‌ జూపల్లి వెంకటరత్నం సస్పెండ్‌ అయ్యారు. ఆయన మీద వేటు వేస్తూ… వరంగల్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు ఇచ్చారు. డిపార్ట్‌మెంట్‌లో అలాంటివి సాధారణంగా జరుగుతుంటాయి. కానీ, ఈ సస్పెన్షన్‌ మాత్రం ప్రత్యేకం. ఎందుకంటే.. ఈ పోలీస్‌ స్టేషన్‌ ఇలాంటివి కామన్‌ అయిపోయాయి కాబట్టి. ఇక్కడ పని చేసే ఇన్స్‌పెక్టర్లు కనీసం ఏడాది కూడా ఉండకుండానే ట్రాన్స్‌ఫర్‌ అవడమో, సస్పెండ్‌ కావడమో జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే సీపీ తాజా చర్యపై హాట్‌ హాట్‌ చర్చ జరుగుతోంది. తప్పుడు కేసులతో బాధితులను ఇబ్బంది పెట్టడంతోపాటు ఓ హత్య కేసులో ప్రధాన నిందితురాలిని లైంగిక వేధింపులకు గురిచేయడం, మూవీ వాదంలో చిక్కుకోవడం లాంటి వ్యవహారాల మీద సస్పెండ్‌ అయ్యారు వెంకటరత్నం. ఈ క్రమంలో మరోసారి మిల్స్‌ కాలనీ పోలీస్‌ స్టేషన్‌ గురించిన చర్చ మొదలైంది.

Read Also: R-37M missile: డెడ్లీ మిస్సైల్‌ R-37Mను ఇండియాకు ఆఫర్ చేసిన రష్యా.. దీని స్పెషాలిటీ ఇదే..

అయితే, అసలు పోలీస్‌ అధికారులు కూడా ఈ స్టేషన్‌లో పోస్టింగ్‌ అంటేనే.. వణికిపోతున్నారట ఇప్పుడు. అధికారి ఎవరన్నదానితో సంబంధం లేదు.. ఇక్కడికి వస్తే.. కేరాఫ్‌ కాంట్రవర్శీ కామన్‌ అన్న అభిప్రాయం బలపడుతోంది. దాదాపు ఆరు చదరపు కిలోమీటర్ల పరిధి ఉన్న ఈ ఠాణాకు ఎక్కువగా భూ వివాదాలే వస్తుంటాయంటున్నారు. వాటి మీద కన్నేస్తున్న ఆఫీసర్స్‌ గట్టిగానే చేతివాటం ప్రదర్శిస్తున్నారని, ఇక్కడి పరిస్థితులు అంత టెంప్టింగ్‌గా ఉంటాయని చెప్పుకుంటున్నారు పోలీసులు. గతంలో కూడా ఇక్కడ పనిచేసిన కొందరు ఇన్స్పెక్టర్లు భూవివాదాల్లో పరిధి దాటి వ్యవహరించిన కారణంగా… ఉన్నతాధికారులు వేటేశారు. ఈ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మాస్ ఏరియా ఎక్కువ. దాంతో నిత్యం స్టేషన్ ఫిర్యాదు దారులతో కిటకిటలాడుతూ ఉంటుంది. అటు అధికారులకు ఆదాయ మార్గాలు కూడా అదే స్థాయిలో కనిపిస్తుంటాయట. మొత్తం మూడు పోలీస్ స్టేషన్లుగా విభజించాల్సినంత జనాభా ఉంది ఈ పరిధిలో. ఇలాంటి పరిస్థితులన్నీ కలిసి ఇక్కడి ఎస్‌హెచ్‌వోలకు అచ్చిరావడం లేదని చెప్పుకుంటున్నారు. గడిచిన పదేళ్ల కాలంలో 11 మంది ఇన్స్పెక్టర్లు పని చేశారు ఈ స్టేషన్‌లో. వాళ్ళలో ఇద్దరు వివాదాల్లో చిక్కుకొని సస్పెండ్‌ అయ్యారు.

Read Also: Off The Record: ఏపీ బీజేపీ పాత ముద్ర చెరిపేయడానికి తంటాలు పడుతోందా?

కాగా, మిగిలిన 9 మంది పోలీస్ ఆఫీసర్లల్లో ఒకరు 5, నలుగురు 7, మరొకాయన 8 నెలలు పనిచేయగా… నలుగురు మాత్రం కనాకష్టంగా ఏడాది సర్వీసు పూర్తి చేశారట. ఒకే ఒక్క అధికారి మాత్రం 22 నెలల పాటు ఇన్స్‌పెక్టర్గా కొనసాగారు. గడిచిన దశాబ్ద కాలంలో ఏ ఒక్క ఆఫీసర్ కూడా రెండేళ్ళ కాలం పని చేయలేదు. దాంతో మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ అంటేనే ఎస్‌హెచ్‌వోకు అచ్చిరాని ఠాణా అని పేరు పడిపోయింది.గతంలో ఆజంజాహి మిల్స్ క్వార్టర్స్ లో ఉన్నంత కాలం పోలీస్ ఆఫీసర్లు ప్రశాంతంగా ఉద్యోగం చేసుకున్నారట. మిల్లు మూత పడటం, భూములు అమ్మకోవడంతో పోలీస్ స్టేషన్ ను కొంత కాలం లక్ష్మీపురం వ్యవసాయ మార్కెట్ లోని రైతు విశ్రాంతి భవనంలోకి మార్చారు. ఆ తర్వాత ఖిలా వరంగల్ పెట్రోల్ బంక్ దగ్గరున్న ప్రభుత్వ భూమిలో సొంత బిల్డింగ్ కట్టారు. ఇక్కడకు మార్చినప్పటి నుంచి స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు అచ్చిరావడం లేదన్నది ఇంకో వెర్షన్‌. అయినా… మన బుద్ధి మంచిదికాకపోతే… స్టేషన్‌ బిల్డింగ్‌ ఏం చేస్తుంది పాపం.

Exit mobile version