వరంగల్ నగరంలో మరో వివాదాస్పద ఘటన చోటుచేసుకుంది. మిల్స్ కాలనీ పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఎస్సై శ్రీకాంత్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయింది. వివరాల ప్రకారం, ఈ నెల 22వ తేదీ అర్ధరాత్రి స్థానికంగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్న దళిత మహిళ మరియమ్మపై దాడి చేసిన ఘటన జరిగింది.
వరంగల్ సబ్ డివిజన్ పరిధిలోని మిల్స్ కాలనీ ఇన్స్‌పెక్టర్ జూపల్లి వెంకటరత్నం సస్పెండ్ అయ్యారు. ఆయన మీద వేటు వేస్తూ... వరంగల్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు ఇచ్చారు. డిపార్ట్‌మెంట్‌లో అలాంటివి సాధారణంగా జరుగుతుంటాయి. కానీ, ఈ సస్పెన్షన్ మాత్రం ప్రత్యేకం. ఎందుకంటే.. ఈ పోలీస్ స్టేషన్ ఇలాంటివి కామన్ అయిపోయాయి కాబట్టి.