OTR : ఎల్లారెడ్డి BJPకి సరైనోడు ఎవరు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సరైనోడి కోసం అక్కడ కాషాయ దళం భూతద్దం పెట్టిమరీ వెదుకుతోందా? ఎవరో వస్తారు, ఏదో చేసేస్తారంటూ ఎదురు చూసీ… చూసీ… కళ్ళు కాయలు కాసి పళ్ళయి రాలిపోతున్నాయి తప్ప కనుచూపు మేరలో సదరు సరైనోడు కనిపించడం లేదా? కమాన్….. మీరు నడిపే నాయకుడిని తేల్చండి, మా సత్తా ఏంటో చూపిస్తామని కేడర్ అడుగుతున్నా బీజేపీ నాయకత్వం ఎందుకు తటపటాయిస్తోంది? ఏ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాషాయ పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. ఇప్పటి వరకు ఇక్కడ కాషాయ జెండా ఎగరకపోయినా.. కార్యకర్తల బలం మాత్రం ఏటికేడు పెరుగుతోందట. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ తరపున పోటీ చేసిన వడ్డేపల్లి సుభాష్ రెడ్డికి 14.5 శాతం ఓట్లు వచ్చాయి. అయితే… ఓటమి తర్వాత పార్టీకి దూరంగా ఉన్న సుభాష్‌రెడ్డి మారిన రాజకీయ పరిస్థితుల్లో… కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. అయితే…. కొద్ది రోజుల్లోనే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ ఫిర్యాదుతో ఆయనపై కాంగ్రెస్ క్రమ శిక్షణ చర్యలు తీసుకుంది. ఇక అప్పటి నుంచి పొలిటికల్ సైలెన్స్ పాటిస్తున్నారు సుభాష్‌రెడ్డి. అయితే… ఆయన బీజేపీ నుంచి బయటకు వెళ్లాక.. ఎల్లారెడ్డిలో కాషాయ దళానికి పెద్దదిక్కు కరువయ్యారట. దీంతో…క్యాడర్ లో నిరుత్సాహం పెరిగిపోతోందంటున్నారు. అదే సమయంలో కాస్త ఉత్సాహం ఉన్నవాళ్లు ఎవరికి వారు మేమే పెద్దన్నలం అన్నట్టు ఫీలైపోతున్నారట. కొందరు నాయకులు అడపా దడపా నియోజకవర్గంలో పర్యటిస్తున్నా.. క్యాడర్ మాత్రం వాళ్లను అంతగా పట్టించుకోవడం లేదని చెప్పుకుంటున్నారు. దీంతో…ఎల్లారెడ్డిలో కమలం పార్టీ బలపడుతోందిగానీ… నడిపించే నాయకుడు కరువయ్యాడనే అభిప్రాయం ఉంది.
ఇటు పార్టీ అధినాయకత్వం సైతం బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే విషయమై మల్ల గుల్లాలు పడుతోందట. కొద్ది రోజులుగా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, శాస్త్రవేత్త పైడి ఎల్లారెడ్డి నేనున్నానంటూ నియోజవర్గాన్ని చుట్టొస్తున్నారు. కానీ… స్థానిక నేతలకు సమాచారం లేకుండానే పార్టీ కార్యక్రమాలు చేసేస్తున్నారట ఆయన. అడపా దడపా పర్యటిస్తున్నా.. క్యాడర్‌కు సమాచారం ఇవ్వకపోవడంతో.. ఇదెక్కడి రాజకీయం అంటూ వాళ్ళు తలలు పట్టుకుంటున్నారట. మరో నాయకుడు నేనున్నానంటూ టీవీల్లో ఎక్కువగా, నియోజకవర్గంలో తక్కువగా కనిపిస్తున్నారని అంటున్నారు. ఇలా ఎవరికి వారే… నియోజకవర్గంలో నేనే నెంబర్ వన్ అంటూ తిరుగుతుంటే.. క్యాడర్ మాత్రం మాకు సరైనోడు కావాలంటూ పైకి సందేశాలు పంపుతోంది. మాజీ ఎంపీ బీబీ పాటిల్ సైతం కొద్ది రోజులుగా ఎల్లారెడ్డిపై ఫోకస్ చేస్తున్నారట. అవకాశం వస్తే…. ఇక్కడి నుంచి తన కుటుంబ సభ్యుల్లో ఒకరిని పోటీకి దింపాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇలా ఎవరికి వారే లెక్కలు వేసుకుంటున్నా…. అవన్నీ కాకి లెక్కలుగానే మిగిలిపోతున్నాయి తప్ప… గట్టిగా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉండేవారు ఎనరన్నది కేడర్ క్వశ్చన్. మరో వైపు కొత్త నేతలు బీజేపీ వైపు చూస్తున్నారనే ప్రచారం సైతం జరుగుతోంది. ఇలా రకరకాలుగా… క్యాడర్ గందరగోళంలో ఉంది. మాకో స్ట్రాంగ్ లీడర్ కావాలని కార్యకర్తలు అడుగుతున్నా… అది ఎవరన్నది తేల్చలేకపోతున్నారట పార్టీ పెద్దలు. ఇప్పటికైనా పెద్దలు జోక్యం చేసుకుని సరైనోడికి బాధ్యతలు ఇస్తే…మా సత్తా ఏంటో చూపిస్తామంటోంది కాషాయ కేడర్.
Also Read
- Tags
- NTV Telugu
- off the record
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!