Off The Record over : విజయనగరం నియోజకవర్గంలో షాడోల పెత్తనం?
- విజయనగరం నియోజకవర్గంలో షాడోల పెత్తనం?
- ఎమ్మెల్యే అదితి చుట్టూ ఇద్దరు అనధికార వ్యక్తులు
- బదిలీలు, కాంట్రాక్టులు అన్నిటిలో షాడోల నిర్ణయమే ఫైనల్?
- మాట వినని ప్రభుత్వ సిబ్బందిపై వైసీపీ ముద్ర, బదిలీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోటలో షాడోలు… వినడాకేదో సినిమా టైటిల్లా ఉందా…? టైటిల్ సంగతేమోగానీ…. అచ్చం పొలిటికల్ మూవీ మాత్రం అక్కడ రసవత్తరంగా నడిచిపోతోందట. మేం ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యే ఎవరంటూ అక్కడి జనం జుట్టు పీక్కుంటున్నారు. అంతలా… అధికారిక వ్యవహారాల్లో ఎమ్మెల్యేని కమ్మేసిన షాడోలు అంతా తామై నడిపిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. ఏ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? ఎవరా టీడీపీ ఎమ్మెల్యే? విజయనగరం నియోజకవర్గం రాజకీయం మొత్తం ఇప్పుడు షాడో పాలిటిక్స్ చుట్టూ తిరుగుతోంది. పైకి అధికార ముద్ర ఒకరిది కనిపిస్తున్నా…. లోపల అసలు నిర్ణయాలు, తీర్మానాలు వేరే వాళ్ళ చేతుల్లో ఉన్నాయన్న చర్చలు హాట్ హాట్‌గా నడుస్తున్నాయి. రాజు కన్నా రాజగురువు గొప్ప అన్నట్టు… ఇక్కడి అధికార వ్యవహారాలన్నీ… టీడీపీ ఎమ్మెల్యే అదితి గజపతిరాజు కాకుండా…. ఇద్దరు అనధికార వ్యక్తుల చుట్టూ తిరుగుతున్నాయన్న గుసగుసలు పెరిగిపోతున్నాయి. వీటి చుట్టూ రకరకాల ఆసక్తికరమైన చర్చలు కూడా జరుగుతున్నాయి.
షాడో వ్యవస్థల విషయంలో ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలని సీఎం చంద్రబాబు పదేపదే హెచ్చరిస్తున్నప్పటికీ…. విజయనగరంలో మాత్రం ఆ హెచ్చరికలు చెవిన పడ్డట్టు లేదని టీడీపీ వర్గాలే మాట్లాడుకుంటున్నాయి. అధికార వ్యవహారాలు, కాంట్రాక్టుల కేటాయింపులు, ఉద్యోగుల బదిలీలు…. ఒకటేమిటి…? ఏ అంశమైనా ఆ ఇద్దరి అనుమతి లేనిదే ఫైల్ కదలదని, మేడమ్ నిర్ణయం తీసుకోబోరన్న తెలుగుదేశం కార్యకర్తలే చెప్పుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో రాజకీయ బలం పెద్దగా లేని ఇద్దరూ….షాడో ఎమ్మెల్యేల్లాగా చెలామణి అవుతూ… అధికార వ్యవహారాల్లో మితిమీరి జోక్యం చేసుకుంటున్నారన్నది లోకల్ వాయిస్. సదరు షాడోలు ఇక్కడో టెక్నిక్ కూడా వాడుతున్నారట. తమ మాట వినని ప్రభుత్వ సిబ్బందిపై వైసీపీ ముద్ర వేసి కీలక స్థానాల నుంచి బదిలీ చేయిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
Also Read
చేతికి వచ్చిన అధికారమే చక్రవర్తితనం అన్నట్టు… కొందరు అధికారులను సైతం పట్టించుకోకుండా బదిలీలు జరుగుతున్నాయని చెప్పుకుంటున్నారు. ఇటీవల విజయనగరం నగరపాలక సంస్థలో జరిగిన భారీ స్థాయి బదిలీలు ఈ చర్చకు మరింత ఆజ్యం పోశాయి. ఒకేసారి దాదాపు 28 మంది ఉద్యోగులను మార్చడం ఆ వర్గాల్లో కలకలం రేపింది. వీరి పాచికలకు సాధారణ ఉద్యోగులే ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు. రోడ్లు, కాలువల కాంట్రాక్టు పనులు కూడా షాడోలు సూచించిన వారికే కేటాయిస్తున్నారన్న ఆరోపణలు సైతం పెరుగుతున్నాయి. పోలీస్ శాఖలో బదిలీల వెనుక కూడా రాజకీయ ఒత్తిళ్లు పనిచేశాయన్న ప్రచారం సాగుతోంది. పనిలో గుర్తింపు ఉన్నా… వీళ్ల ఒత్తిడికి బలైపోతున్నారట కొందరు ఉద్యోగులు. ఇక్క స్థాయీ భేదాలు కూడా ఉండవట. ఫలానా వాళ్లని తీసెయ్యాలంటే అంతే. ఇన్స్పెక్టర్ నుంచి కానిస్టేబుల్ వరకూ అందరినీ బదిలీ చేయించారన్న డిస్కషన్ డిపార్ట్మెంట్లో నడుస్తోంది. ఈ ఇద్దరు షాడోల నేపథ్యం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వారిలో ఒకరు గతంలో వైసీపీలో పనిచేసి తర్వాత టీడీపీలోకి మారారు. మరొకరు సెటిల్మెంట్లు, మధ్యవర్తిత్వాల ద్వారా ప్రభావం పెంచుకుని రాణిగారికి చేరువయ్యారన్న ప్రచారం గట్టిగా జరుగుతోంది. ఇద్దరూ… ఎమ్మెల్యే కుటుంబానికి అత్యంత సన్నిహితులుగా మారి తలలో నాలుకలా వ్యవహరిస్తున్నారట. అన్ని వ్యవహారాల్లో వాళ్ళ జోక్యం నియోజకవర్గంలోని టీడీపీ లీడర్స్‌కు అస్సలు మింగుడుపడ్డం లేదట. ఈ పరిస్థితులపై పార్టీ సీనియర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే తండ్రి అశోకగజపతిరాజు ఏ విధానాలకైతే వ్యతిరేకమో… ఇప్పుడు అవే పద్ధతులు, పరిస్థితులు నియోజకవర్గంలో కనిపిస్తున్నాయని అంటున్నారు. రెండేళ్ల వ్యవధిలోనే ఎమ్మెల్యే చుట్టూ ఏర్పడిన ఈ షాడో వ్యవస్థ కారణంగా ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని పార్టీలోనే గుసగుసలాడుకుంటున్నారు. ఇప్పటికైనా పార్టీ అధిష్టానం జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదితుందా.. లేక పూర్తిగా చెదలు పట్టించి నియోజవర్గంలో పార్టీని నాశనం చేస్తారో చూడాలంటన్నారు కార్యకర్తలు.
తాజావార్తలు
-
418: కంటెంట్ చూసి షాక్.. రాత్రికి రాత్రే ‘పాన్-ఇండియా’ రేంజ్‌కు మారిన ‘418’ రిలీజ్!
-
Rahul Gandhi: యూపీఐ ఛార్జీలపై రాహుల్‌గాంధీ విమర్శలు
-
IND vs WI 2026: మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల.. సెప్టెంబర్ 27 నుంచే..
-
Faaah : ‘ఫాహ్..’ వైరల్ సౌండ్ వెనుక ఉన్నది టాలీవుడ్ లెజెండరీ కమెడియనా?.. అసలు నిజం ఇదిగో!
-
Mahesh Babu: రెండే సినిమాలు అన్నారు.. 15 ఏళ్లు వెయిట్ చేశా.. ఆసక్తికర విషయాలు చెప్పిన మహేష్ బాబు!
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?