Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అన్నిటికీ ఆయనేనా…? ఏ సమస్య వచ్చినా… నేరుగా ముఖ్యమంత్రే స్పందించాలా? మిగతా వాళ్ళకు బాధ్యత లేదా? చేసింది చెప్పుకోవాలన్నా, ప్రతిపక్షానికి కౌంటర్ ఇవ్వాలన్నా డైరెక్ట్‌గా సీఎం ఎందుకు రియాక్ట్ అవ్వాల్సి వస్తోంది? కేబినెట్ మంత్రులు, కాంగ్రెస్ సీనియర్స్ ఏం చేస్తున్నారు? అటు అధికార పార్టీ…ఇటు కేబినెట్ పరస్పర సమన్వయంతో సహకరించుకుంటూ అడుగు ముందుకు వేసినప్పుడే ఎక్కడైనా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, వ్యవహారాలు సక్రమంగా నడుస్తాయి. అఫీషియల్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకున్నా…అధికార పార్టీ నేతలకు ఆ ప్రయారిటీ ఉండటం సాధారణం. ప్రభుత్వం మీద ఆరోపణలు వస్తే పార్టీ, విపక్షాలు డైరెక్ట్‌గా సీఎంని అటాక్ చేస్తే కేబినెట్ సహచరులు వెంటనే రియాక్ట్ అయి కౌంటర్స్ ఇవ్వడం కూడా సర్వ సాధారణం. కానీ… ప్రస్తుతం తెలంగాణలో అలాంటి వాతావరణం కనిపించడం లేదన్నది పొలిటికల్ అబ్జర్వేషన్. ప్రభుత్వం మీద విమర్శల విషయంలో కాంగ్రెస్ పార్టీ పెద్దలు అంటీ ముట్టనట్టు ఉంటున్నారన్న అభిప్రాయం బలపడుతోంది. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లైనా… పార్టీ నేతల్లో ఇంకా ఆ జోష్… ఆ వ్యూహం కనిపించడమే లేదని అంటున్నారు. ప్రతిపక్షాల నుంచి విమర్శల దాడి పెరిగినా… మరో రీజన్ అయినా…. నేరుగా సీఎం హోదాలో రేవంత్ రెడ్డే స్పందించాల్సి వస్తోంది తప్ప… ఇటు పార్టీ నుంచిగాని, అటు కేబినెట్ మంత్రుల నుంచిగానీ… ఆశించిన స్థాయిలో రియాక్షన్ ఉండటం లేదని మాట్లాడుకుంటున్నాయి రాజకీయవర్గాలు. ధాన్యం కొనుగోలు వ్యవహాన్నే తీసుకుంటే…ఈసారి గతంలో కంటే ఎక్కువ దిగుబడి వచ్చింది.
దాంతో. గన్నీ బ్యాగుల కొరత, రవాణాకు లారీలు చాలకపోవడం లాంటి సమస్యలు తలెత్తాయి. ఈ పరిస్థితుల్లో మంత్రులు యాక్టివ్ రోల్ తీసుకుని, ఉన్న సమస్యల్ని చెప్పి…రైతుల్ని మెప్పించే ప్రయత్నం చేయాలి. కానీ… ఒకరిద్దరు తప్ప మిగతా ఎవరూ పెద్దగా స్పందిస్తున్నట్టు కనిపించడం లేదు. గతంతో పోల్చితే ఇప్పుడు ఎక్కువ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ధాన్యం కొనుగోలులో వేగం కూడా పెరిగింది. కానీ దిగుబడి ఆశించిన దానికంటే ఎక్కువ రావడంతో సమస్యగా అనిపిస్తోంది. సాధారణంగా సమస్యలు ఏటా ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటాయి. కానీ… వాటిని అధిగమించేందుకు యంత్రాంగం చేసే ఏర్పాట్లలో ప్లానింగ్ లోపమే అసలు సమస్య. దాన్ని సరిదిద్దేందుకు కొంత మేర ప్రయత్నాలు జరుగుతున్నాయి కూడా. కనీసం ఆ చేసింది చెప్పుకోవడంలో కూడా అధికార పార్టీగా కాంగ్రెస్ నేతలు, కేబినెట్ మంత్రులు విఫలమవుతున్నారని, కొందరైతే అసలు మాకు సంబంధం లేదన్నట్టుగా ఉంటున్నారన్న చర్చలు నడుస్తున్నాయి. ఇస్తే… ప్రెస్ నోట్ లు… లేదంటే అర కొర రివ్యూలే అన్నట్టు ఉంది పరిస్థితి. రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న సీనియర్స్ కూడా మాకు సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం ఉంది. ఇప్పటి వరకు బండి భగీరథ్ ఎపిసోడ్‌పై కానీ.. ధాన్యం కొనుగోలు విషయంలోగానీ… మాట్లాడింది లేదు. ఏ శాఖకు సంబంధించిన మంత్రి ఆ శాఖనే చూసుకుంటారని అనుకుంటున్నారా..? లేదంటే… మొత్తానికి ముఖ్యమంత్రే బాధ్యత వహిస్తారని భావిస్తున్నారోగానీ… అత్యంత కీలకమైన అంశాల్లో కూడా సీనియర్స్ నుంచి రియాక్షన్ ఉండటం లేదు. ప్రతి అంశంలోనూ.. సీఎం రేవంత్ రెడ్డే స్పందించాల్సి వస్తోందన్నది ఓపెన్ టాక్.
Also Read
అయితే… పార్టీ సీనియర్స్, మంత్రులు ఇక్కడో చిన్న లాజిక్ మిస్ అవుతున్నారన్న చర్చ జరుగుతోంది రాజకీయవర్గాల్లో. ప్రభుత్వం మీద ప్రతిపక్షం చేసే మాటల దాడి ప్రభావం అందరి మీదా పడుతుందని, లాభ నష్టాలకు అంతా ఉమ్మడిగా బాధ్యత వహించాల్సి ఉంటుందన్న సంగతి మర్చిపోతున్నట్టు ఉన్నారన్న టాక్ నడుస్తోంది. అసలు వీళ్లకి దిశానిర్దేశం కరవైందా అన్నది ఇంకొందరి ప్రశ్న. పార్టీ నుండి వచ్చే రియాక్షన్స్ కూడా మొక్కుబడిగా ఉంటున్నాయి తప్ప…విపక్షానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలన్న, ప్రభుత్వాన్ని నిలబెట్టాలన్న కసి మాత్రం ఏ కోశానా కనిపించడం లేదని మాట్లాడుకుంటున్నారు ఎక్కువ మంది. మరోవైపు మంత్రులు అసలు గాంధీభవన్ వైపు రావడమే మానేశారు. ఇప్పటిదాకా పార్టీఆఫీస్ మెట్లెక్కని ఎంపీలు కూడా ఉన్నారంటే ఆశ్చర్యం లేదు. అధికారంలో ఉండి, ఉమ్మడిగా ముందుకు కదలాల్సిన పార్టీ…ఎందుకు డల్‌గా మారిందన్నది మిలియన్ డాలర్ క్వశ్చన్. అంతా ఆయనే చూసుకుంటారంటూ భారం మొత్తం సీఎం రేవంత్ మీదే వేసేస్తే…. ఆయన మాత్రం ఎంతవరకని మోస్తారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పార్టీ అధికారంలో ఉంటే ఇప్పుడు అందరూ ఆ పవర్‌ని అనుభవిస్తున్నట్టే…. రేపు ఒకవేళ తేడా కొడితే… నేడు నోళ్ళకు తాళాలు వేసుకున్నవాళ్ళు కూడా విపక్షంలోకే వెళ్లిపోతారు తప్ప…వాళ్లకేం ప్రత్యేకంగా పవర్స్ రావు కదా..? కలిసి పని చేసుకుంటే ఉన్న పవన్నే నిలబెట్టుకోగలుగుతాం కదా అన్నది కాంగ్రెస్‌లోని ఓ వర్గం లాజిక్. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉన్న పరిస్థితి మారితేనే అందరికీ భవిష్యత్ ఉంటుంది తప్ప…కొందరికే ప్రత్యేకం కాదని అంటున్నారు. కేబినెట్ మంత్రుల్లో ఇప్పుడున్న వైఖరి అందరికీ నష్టం చేసేదే తప్ప….మేం తప్పించుకుంటామంటే ముందు ముందు తిప్పవన్నది
కాంగ్రెస్ పార్టీ కింది స్థాయిలో ఉన్న అభిప్రాయం
- Tags
- NTV Telugu
- OTR
- tg cabinet
తాజావార్తలు
-
Thummidihatti Barrage: తెలంగాణ, మహారాష్ట్ర మధ్య తుమ్మిడిహట్టి పంచాయితీ.. నేడు కేంద్రం సమక్షంలో చర్చలు..!
-
NTV Exclusive: ‘మండాడి’ కోసం 45 రోజులు సముద్రంలోనే.. నాలుగైదుసార్లు చావు అంచుల వరకు వెళ్లాం: సుహాస్
-
Bethlehem Family Unit: రూ. 250 కోట్ల దిశగా మలయాళ మూవీ.. తెలుగులోనూ రిలీజ్‌కు రెడీ!
-
YS Jagan: పులివెందులలో వైఎస్ జగన్ రెండు రోజుల పర్యటన!
-
Toxic : వంద కోట్ల గ్రాస్ కూడా రాబట్టలేక షాకిచ్చిన ‘యశ్ టాక్సిక్’
ట్రెండింగ్
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!