Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record Over Tg Bjp 5

Off The Record : తెలంగాణ బీజేపీలో షాకింగ్ ట్విస్ట్..! మున్సిపల్ ఎలక్షన్స్ పై బీజేపీ సీరియస్

Published Date :March 17, 2026 , 8:03 pm
By Gogikar Sai Krishna
  • మొన్నటి అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ గట్టి ఫోకస్‌
  • గ్రేడ్‌ను బట్టి మున్సిపాలిటీల్లో ఖర్చుల కోసం డబ్బు
  • పెట్టిన ఖర్చుకు, పడ్డ ఓట్లకు పొంతనలేని వైనం
  • ఏం జరిగిందంటూ పార్టీ అగ్ర నాయకులు సీరియస్‌
Off The Record : తెలంగాణ బీజేపీలో షాకింగ్ ట్విస్ట్..! మున్సిపల్ ఎలక్షన్స్ పై బీజేపీ సీరియస్
  • Follow Us :
  • google news
  • dailyhunt

కమలం పార్టీలో కంచే చేను మేసిందా? మున్సిపల్‌ ఎన్నికల్లో నొక్కుడు బేరం బాగా జరిగిపోయిందా? ఎన్నికల ఖర్చుల కోసమని పార్టీ నాయకత్వం పంపిన డబ్బుని లోకల్‌ కాషాయ లీడర్స్‌ ఎక్కడికక్కడ సెట్‌ చేసుకుని జేబులు నింపేసుకున్నారా? పెద్దలు పంపిన డబ్బుకు, పోలైన ఓట్లకు పొంతన లేదని లెక్కల్లో తేలిందా? ఇప్పుడిదే ఇష్యూ మీద పార్టీలో రచ్చ జరుగుతోందా? మున్సిపల్‌ ఎలక్షన్స్‌లో అసలేం జరిగింది? అది ఇప్పుడెందుకు ఇష్యూ అవుతోంది? కొట్టాలి…. గట్టిగా కొట్టాలి…. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఈ మున్సిపల్‌ ఎలక్షన్స్‌ని ట్రయల్‌ రన్‌గా భావించాలంటూ అప్పట్లో పెద్ద పెద్ద మాటలే చెప్పారు తెలంగాణ బీజేపీ నాయకులు. అందుకోసం స్పెషల్‌ ప్లానింగ్‌ చేసి అంగబలం, అర్ధబలంతో రంగంలోకి దిగారు. ఆయా మున్సిపాలిటీల్లో పార్టీకున్న బలాన్ని బట్టి ABCDలుగా వర్గీకరించారు. ఇక గ్రేడ్‌ను బట్టి ఖర్చుల కోసం ఆయా మున్సిపాలీలకు డబ్బులు పంపించిందట బీజేపీ నాయకత్వం. పార్టీకి పట్టుంది, కచ్చితంగా ఎక్కువ వార్డ్‌లు గెలుస్తామనుకున్న చోటికి కాస్త అదనంగానే పైసలు సమకూర్చినట్టు చెబుతున్నారు. అంతవరకు బాగానే ఉన్నా… అనుకున్నంత ప్రభావం ఎందుకు చూపలేకపోయామంటూ ఫలితాల పోస్ట్‌మార్టం చేస్తున్న క్రమంలో కొన్ని కొన్ని సంగతులు తెలిసి పార్టీ పెద్దలు సైతం గుడ్లు తేలేస్తున్నారట.

కొన్ని మున్సిపాలిటీల్లో పెట్టిన ఖర్చుకు, వచ్చిన ఓట్లకు ఓ మాత్రం పొంతనలేకుండా ఉందని చెబుతున్నాయి రాష్ట్ర బీజేపీ వర్గాలు. దానికి సంబంధించి ఢిల్లీ పెద్దలకు కూడా సమాచారం అందిందని, వాళ్ళు రిపోర్ట్ అడిగారన్న చర్చ జరుగుతోంది పార్టీలో. గతానికి భిన్నంగా ఈ సారి పురపాలక ఎన్నికల కోసం పెద్ద ఎత్తున డబ్బులు పంపించిందట పార్టీ అగ్ర నాయకత్వం. రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన ప్రతి మున్సిపాలిటీకి లెక్కలుగట్టి పంపిణీ చేసినట్టు చెబుతున్నాయి కాషాయ వర్గాలు. అక్కడ ఉన్న ఓట్లు, వార్డ్‌లు, పార్టీ పరిస్థితిని బట్టి డబ్బుల బట్వాడా జరిగిందని అంటున్నారు. కానీ… ఆ మేరకు ఫలితాలు మాత్రం కనిపించలేదని అగ్ర నాయకులు సీరియస్‌ అయినట్టు తెలిసింది. మున్సిపల్‌ ఎన్నికలను పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకత్వాలు తీసుకున్నంత సీరియస్‌గా స్థానిక నాయకులు తీసుకోలేదని, అందుకే అలాంటి ఫలితాలు వచ్చాయన్నది లేటెస్ట్‌ ఇంటర్నల్ టాక్‌. ఇదే సమయంలో పై నుంచి వచ్చిన డబ్బును ఎక్కడికక్డ లోకల్‌ లీడర్‌షిప్‌ గట్టిగా నొక్కేసినట్టు తేలిందట. చాలాచోట్ల మున్సిపాలిటీలకు పంపించిన డబ్బులు సద్వినియోగం కాలేదని, తమకు డబ్బులు ఇవ్వలేదని పోటీ చేసిన అభ్యర్థులు రాష్ర్ట పార్టీకి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. లక్షల్లో సొమ్ము పంపితే కనీసం వంద ఓట్లు కూడా పడని నియోజకవర్గాలు సైతం ఉన్నాయట.

ఆ ఫలితాలపై పార్టీ రాష్ర్ట కార్యాలయంలో ఇటీవల సమీక్ష జరిగింది. ఆ సందర్భంగానే… అయిన ఖర్చు, వచ్చిన ఓట్ల గురించి గట్టిగానే చర్చించినట్టు సమాచారం. లక్షలు ఖర్చయిన చోట్ల కూడా అసలు జీరోకు పరిమితం అవడం ఏంటని స్థానిక నాయకత్వాలను పార్టీ పెద్దలు నిలదీసినట్టు సమాచారం. ఆ సందర్భంగానే నొక్కుడు ప్రస్తావన వచ్చినట్టు తెలిసింది. పై నుంచి వచ్చిన డబ్బులు పంచకుండా చాలామంది స్థానిక నాయకులు జేబులో వేసుకున్నారన్న ఆరోపణలున్నాయి. చివరికి అభ్యర్థులకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వకుంటే ఏం ఓట్లు పడతాయి? ఎలా గెలుస్తారంటూ పార్టీలో అంతర్గతంగా గట్టిగా రచ్చ అవుతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి కేంద్ర పార్టీకి ఫిర్యాదులు అందడంతో…. ఢిల్లీ నేతల ఆదేశాలతో సమీక్ష పేరుతో పోస్ట్‌మార్టం పెట్టినట్టు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఇలాగే డబ్బులు నొక్కేశారు నాయకులు. దీంతో… ఈవ్యవహారాన్ని అంత తేలిగ్గా వదలకూడదని, ఇక మున్సిపాలిటీల వారీగా స్పెషల్‌ ఎంక్వైరీ చేయించాలని బీజేపీ పెద్దలు అనుకుంటున్నట్టు తెలుస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • ntv
  • OTR

తాజావార్తలు

  • Nora Fatehi Song Controversy: నోరా ఫతేహి పాట వివాదం.. వివరణ ఇచ్చిన గీత రచయిత.. తప్పు నాది కాదు..!

  • Off The Record: కూటమిలో ఉన్న నమ్మకం లేదా..? రాజమండ్రిలో బీజేపీ మాస్టర్ ప్లాన్..!

  • Off The Record : తంబళ్లపల్లి టీడీపీలో వర్గపోరు.. ఇంచార్జ్ పోస్ట్ కోసం ఫైట్..!!

  • Kakatiya University: కాలేజీలో సీనియర్ల వేధింపులు.. దొంగతనం చేశావని చేసిన అవమానం.. చివరకు యువతి..

  • Chana Dal Payasam: అమ్మమ్మల నాటి ఆరోగ్య రహస్యం.. పంచదార లేకుండా సింపుల్‌గా చేసుకొనే హెల్దీ పాయసం

ట్రెండింగ్‌

  • Pomegranate Benefits: ప్రతిరోజూ ఒక దానిమ్మ పండు.. మీ శరీరానికి కలిగే అద్భుత ప్రయోజనాలు

  • Swaasa : మీ దగ్గు విని వ్యాధిని చెప్పేస్తుంది.! ఈ కొత్త AI టెక్నాలజీ గురించి తెలుసా.?

  • Ugadi Special : ఉగాది నాడు మనం వేప, బెల్లం ఎందుకు తింటామో మీకు తెలుసా?

  • Health Tips : బెండకాయతో కలిపి వీటిని అస్సలు తినకండి.. ఆరోగ్యానికి ప్రమాదకరం..!

  • Summer Tips : 40°+ ఎండలో కూల్‌గా ఉండాలంటే.. ఈ సమ్మర్ సీక్రెట్స్ ట్రై చేయండి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions