Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record Over Telangana Bjp 33

Off The Record : తెలంగాణ బీజేపీవన్నీ మాటలేనా? చేతల్లో చూపిస్తారా?

Published Date :January 28, 2026 , 8:45 pm
By Gogikar Sai Krishna
  • తెలంగాణ బీజేపీవన్నీ మాటలేనా? చేతల్లో చూపిస్తారా?
  • లోక్‌సభ ఎన్నికల్లో తప్ప మిగతా ఏ ఎలక్షన్‌లోనూ నో ఇంపాక్ట్‌
  • అధికారం కోసం చూస్తున్న చోట ఓట్ల శాతంతో సంబరపడితే ఎలా?
  • 2020 మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోయిన బీజేపీ
Off The Record : తెలంగాణ బీజేపీవన్నీ మాటలేనా? చేతల్లో చూపిస్తారా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీ స్థానం ఎక్కడ? ఈసారైనా అన్ని వార్డుల్లో అభ్యర్థుల్ని నిలబెట్టగలదా? ప్రత్యామ్నాయ శక్తి మేమేనంటూ గొప్పలు చెప్పడమేనా? మున్సిపల్‌ ఎలక్షన్స్‌లో ఆ సత్తా ఏంటో చూపించేది ఉందా? రాష్ట్రంలో అధికార పీఠం కోసం కలలుగంటున్న కమలనాథులు కార్యాచరణలో ఎక్కడున్నారు? లెట్స్‌ వాచ్‌. తెలంగాణలో అధికార పార్టీకి తామే ప్రత్యామ్నాయమంటూ చాలా రోజులుగా చెబుతోంది బీజేపీ. అయితే… అవన్నీ మాటలే తప్ప చేతల్లో మేటర్‌ ఉండటం లేదన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. నెక్స్ట్‌ మేమేనని కొన్నేళ్ళుగా అంటునే ఉన్నా… ఎన్నికల టైం వచ్చేసరికి చతికిలపడుతున్నారన్న అభిప్రాయం బలంగా ఉంది. జాతీయ నాయకత్వపు ఛరిష్మాతో లోక్‌సభ ఎన్నికల్లో ప్రభావం చూపడం మినహా… స్టేట్‌ లీడర్‌ షిప్‌ ప్రమేయం ఉన్న ఏ ఎన్నికలోనూ కాషాయ దళం ఆశించినంత ప్రభావం చూపలేకపోయిందన్నది విశ్లేషకుల మాట. అందుకు సమాధానంగా మాకు సీట్లు రాకున్నా ఓట్ల శాతాన్ని పెంచుకోగలుగుతున్నామన్నది తెలంగాణ కమలనాధుల మాట. కానీ… అందుకు కూడా కౌంటర్స్‌ గట్టిగానే పడుతున్నాయి వివిధ వర్గాల నుంచి. నెక్స్ట్‌ మేమే…. వచ్చే ఎన్నికల్లో అధికారం మాదేనని గట్టిగా మాట్లాడే పార్టీ ఎప్పటికప్పుడు కేవలం ఓట్ల శాతం పెరుగుతోందంటూ సంబరపడితే ఎలాగన్నది విమర్శకుల ప్రశ్న. దీంతో ప్రస్తుతం మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీ ఎంతవరకు ప్రభావం చూపుతుంది? ఈసారి అధికార పీఠం మాదేనని చెప్పుకుంటున్న స్థాయిలో ఇప్పుడు పట్టణాల్లో ప్రభావం చూపగలదా అన్న చర్చలు నడుస్తున్నాయి. 2020 మున్సిపల్ ఎన్నికల్లో అంతగా ప్రభావం చూపలేకపోయింది బీజేపీ. అప్పుడు 120 మున్సిపాలిటీలు, 10 మున్సిపల్ కార్పొరేషన్స్‌కు ఎన్నికలు జరిగాయి.

అప్పుడు కేవలం రెండు మున్సిపాలిటీలు, అందులోనూ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని మక్తల్, ఆమనగల్‌ను మాత్రమే గెల్చుకుంది బీజేపీ. ఇక వార్డుల విషయానికి వస్తే…. మొత్తం 2 వేల 727 వార్డ్స్ ఉంటే…. అప్పుడు 2 వేల 26 వార్డుల్లో పోటీ చేసిన కమలం పార్టీ… 237 చోట్ల మాత్రమే గెలవగలిగింది. అప్పుడసలు 700 వార్డుల్లో బీజేపీకి అభ్యర్థులు కూడా కరవయ్యారు. ఇక కార్పొరేషన్స్‌ విషయానికి వస్తే…. 10 మున్సిపల్ కార్పొరేషన్స్‌లో 385 డివిజన్స్‌ ఉంటే…. బీజేపీ 344 చోట్ల పోటీ చేసి కేవలం 78 డివిజన్స్‌లోనే గెలవగలిగింది. అర్బన్ పార్టీ ఇమేజ్‌ ఉన్న బీజేపీ కనీసం అన్ని డివిజన్స్‌లో కార్పొరేటర్‌ అభ్యర్థులను పెట్టలేకపోవడం ఏంటన్న చర్చ అప్పట్లో జరిగింది. అప్పుడు అభ్యర్థులను పెట్టినా…. 48 మునిసిపాలిటీలు, రెండు కార్పొరేషన్స్‌లో అస్సలు ఖాతా తెరవలేకపోవడం గురించి కూడా రకరకాల విశ్లే,ణలు వినిపించాయి. ఒక్క నిజామాబాద్, కరీం నగర్ కార్పొరేషన్లలోనే బీజేపీ ప్రభావం చూపగలిగింది. ఇక ప్రస్తుతానికి వస్తే…. ఈసారి 116 మున్సిపాలిటీలు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్స్‌కు ఎన్నికలు జరుగబోతున్నాయి. మొత్తం 2 వేల 996 వార్డ్‌లు ఉన్నాయి. గతం గతహ అనుకున్నా…. ఈసారన్నా అన్ని వార్డుల్లో బీజేపీ అభ్యర్థులను పెట్టగలదా అన్న ప్రశ్నలు అలాగే ఉన్నాయట రాజకీయవర్గాల్లో.

Also Read

  • Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
  • Off The Record : తిరుపతి కలెక్టర్ వైఖరితో రెవెన్యూ శాఖలో వణుకు.. స్పాట్ లోనే అధికారులు సస్పెండ్..
  • Off The Record : పార్టీతో పాటు శెట్టిబలిజ సామాజికవర్గంలో మంత్రి సుభాష్ ఒంటరి అయ్యారా?
  • Off The Record : ఆ నలుగురు ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారా?

ఉన్నది తక్కువ టైం.. ఆ పార్టీ బలం ఉన్న, నేతలు ఉన్న చోట ఒకేగానీ…. మిగతా ప్రాంతాల్లో పరిస్థితి ఏంటన్నది అంతుబట్టకుండా ఉందట. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వంద శాతం సీట్లలో పోటీ సంగతి తర్వాత… 95 శాతాన్ని భర్తీ చేయగలిగినా గొప్పేనని పార్టీ వర్గాలే మాట్లాడుకుంటున్నాయి. డౌటే లేదు… వంద శాతం బరిలో ఉంటామని కొందరు నాయకులు అంటున్నా… నామినేషన్స్‌ ఉప సంహరణ తర్వాతే దాని గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుందన్నది పొలిటికల్‌ డిస్కషన్‌. ప్రస్తుతం బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్న ప్రాంతాల్లో మున్సిపాలిటీలు, కార్పొరేషన్స్‌ కలిపి 50 వరకు ఉన్నాయి. దీంతో అక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయోనన్న చర్చలు సైతం నడుస్తున్నాయి. పట్టణ ప్రాంతాల్లో తమకు పట్టు ఉంటుందని, ఓట్‌ బ్యాంక్‌ మొత్తం అక్కడే ఉందని ఘనంగా చెప్పుకుంటున్న పరిస్థితుల్లో….తెలంగాణ కాషాయ దళానికి ఈ మున్సిపల్‌ ఎన్నికలు అగ్నిపరీక్షేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తెలంగాణలో తాము కూడా బలమైన శక్తి అని చెప్పుకుంటున్న బీజేపీ నేతలు ఈ ఎన్నికల్లో సత్తాచాటి తామేంటో నిరూపించుకుంటేనే కేడర్‌లో కూడా కాస్త ఆత్మ విశ్వాసం పెరుగుతుందని అంటున్నారు పరిశీలకులు. అలా కాకుండా… ఎప్పట్లాగే ప్రత్యామ్నాయం మేమేనంటూ భారీ భారీ డైలాగులు కొట్టి… తీరా ఆచరణలో విఫలమైతే… దాని ప్రభావం ఈసారి అసెంబ్లీ ఎన్నికలదాకా ఉంటుందన్నది పొలిటికల్‌ పండిట్స్‌ మాట.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ntv
  • OTR
  • Will BJP Impact in Municipal Elections?

తాజావార్తలు

  • Bengal Election Results Live Updates: బెంగాల్ బాద్‌షా బీజేపీ..! టీఎంసీకి మరో షాక్..! అప్‌డేట్స్ మీకోసం..

  • Election Results 2026: గెలుపెవరిది?.. 4 రాష్ట్రాలు+UT ఎన్నికల ఫలితాలు.. మినిట్స్‌ టు మినిట్స్ అప్‌డేట్స్‌..

  • Trisha: పదేళ్లలో సీఎం అవుతానన్న త్రిష వీడియో వైరల్

  • West Bengal Results: తృణమూల్ కోటలో ‘కమల’ వికాసం.. బెంగాల్‌లో ఘనవిజయం దిశగా బీజేపీ అడుగులు

  • Trisha Political Entry: త్రిష పొలిటికల్‌ ఎంట్రీ..? విజయ్ మాస్టర్ ప్లాన్ వెనుక నిజం ఏంటి?

  • Sun TV Share Price: తమిళనాడులో విజయ్ సునామీ.. సన్ టీవీ షేర్లు పతనం.. ఎందుకు?

  • Sai Pallavi: బాలీవుడ్ ఎంట్రీలోనే అట్టర్ ఫ్లాప్ అందుకున్న సాయి పల్లవి ..

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions