TDP vs Janasena: కాకినాడ జిల్లా తుని కూటమిలో కొత్త పంచాయతీ మొదలైంది.. టీడీపీ అభ్యర్థిగా ఉన్న యనమల దివ్య గెలుపు కోసం ఎన్నికల్లో ఎంతో కృషి చేశామని, ఇప్పుడు జనసేనకి కనీస విలువ ఇవ్వడం లేదని అంటున్నారు ఆ పార్టీ తుని కోఆర్డినేటర్ గణేష్.. ఎన్నో ఇబ్బందులు పడుతూ పార్టీలో ఉంటున్నామని, ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీలో కూడా జనసేనకు నియోజకవర్గంలో అన్యాయం జరిగిందని కార్యకర్తల సమావేశంలో గుర్తుచేస్తున్నారు.. అన్నిటినీ భరిస్తూ వస్తున్నామని, తిరుపతి లెటర్…
Off The Record: విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో కూటమి పార్టీల కుమ్ములాటలు పతాకస్థాయికి చేరాయి. పొత్తు కింద నెల్లిమర్ల నియోజకవర్గం జనసేనకు కేటాయించినప్పటి నుంచి టీడీపీ స్థానిక నాయకుల్లో అసంతృప్తి అంతకంతకూ కొనసాగుతోందన్నది బహిరంగ రహస్యం. తొలి నుంచి ఈ నియోజకవర్గం టీడీపీ కంచుకోట. కానీ పట్టు లేని జనసేనకు కేటాయించడంపై నువ్వా నేనా అన్న తరహాలో వార్ సాగుతోంది. అధిష్టానం నుంచి అక్షింతలు పడుతున్నా వీరి తీరు మారలేదు. మళ్లీ వరద బాధితులకు నిత్యావసర…
తెలుగుదేశం పార్టీకి కంచుకోట ఉత్తరాంధ్ర. 2024 ఎన్నికల ఫలితాలు, ఇక్కడ ఆ పార్టీ ఎమ్మెల్యేలకు వచ్చిన మెజార్టీలే అందుకు నిదర్శనం. అందులోనూ గ్రేటర్ విశాఖ సిటీలో అయితే సైకిల్ సవారీకి ఎదురే లేకుండా పోయింది. కూటమి కట్టినా...ఒంటరిగా పోటీ చేసినా సిటీ పరిధిలోని నాలుగు స్ధానాలు టీడీపీ ఖాతాలోనే పడుతున్నాయి.
2024 ఎన్నికల్లో జనసేనను బలంగా నిలబెట్టిన జిల్లాల్లో ఒకటి ఉమ్మడి పశ్చిమగోదావరి. ఇక్కడ మొత్తం 15 అసెంబ్లీ సీట్లు ఉంటే... ఆరు చోట్ల పోటీ చేసి గెలిచింది గ్లాస్ పార్టీ. అయినా సరే.... తమకు సరైన గుర్తింపు దక్కడం లేదని తెగ ఫీలైపోతున్నారట లోకల్ లీడర్స్. నిడదవోలు నుంచి గెలిచిన కందుల దుర్గేష్‌కు మంత్రి పదవి దక్కింది. ఆయనతో సహా... మిగతా నియోజకవర్గాల నేతలంతా... స్థానిక తెలుగుదేశం నాయకులు తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని లోలోపల రగిలిపోతున్నట్టు…
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో టిడిపి కాపు నేతలు కుదురుగా ఉండలేకపోతున్నారట. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఉమ్మడి జిల్లా నుంచి పార్టీ కాపు నాయకుడు ఒక్కరు కూడా మంత్రిగా లేరు.. ఇంతకుముందు ఏ ప్రభుత్వం ఉన్నా ఖచ్చితంగా తూర్పుగోదావరి నుంచి... వెసులుబాటును బట్టి ఒకరు లేక ఇద్దరు కాపు నేతలు మంత్రులుగా ఉండేవారు.
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య ఏర్పడిన విభేదాలకు చెక్ పెట్టే పనిలో ఇరు పార్టీల పెద్దలు రంగంలో దిగినట్టు తెలుస్తోంది. విజయవాడలో తాడేపల్లిగూడెంకు చెందిన టీడీపీ ఇంచార్జి వలవల బాబ్జి, జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌లతో సమన్వయ కమిటీ భేటీ నిర్వహించింది. ఇద్దరి మధ్య ఏర్పడిన విభేదాలను పక్కన పెట్టి పనిచేయాలని పార్టీ పెద్దలు సూచించినట్లు సమాచారం. తాడేపల్లిగూడెంలో జనసేన, టీడీపీ మధ్య విభేదాలేమీ లేవని.. ప్రజల సంక్షేమం కోసం టీడీపీ-జనసేన కలిసి…
ఆంధ్రా ప్యారిస్‌లో పొలిటికల్ హీట్ ఎండాకాలం వేడిని మించి పోతోంది. కానీ...అది రాజకీయ ప్రత్యర్థుల మధ్య అయితే వేరే లెక్క. అలా కాకుండా మిత్ర పక్షాలైన టీడీపీ, జనసేన మధ్య, అందునా... ఇద్దరు ముఖ్య నేతల అనుచరగణం తలపడుతోందన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. కూటమి పొత్తులో భాగంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో తెనాలి నుంచి పోటీ చేసి గెలిచారు జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్. ఇదే సీటు కోసం చివరి నిమిషం వరకు ప్రయత్నించి విఫలమయ్యారు…
ఇప్పుడు పిఠాపురంలో జరుగుతోన్న ఓ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీకి దూరంగా ఉండగా.. ఇప్పుడు టీడీపీ-జనసేన మధ్యే ప్రధాన పోటీ జరుగుతుండడం.. ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయింది..
మచిలీపట్నంలో బ్యానర్ విషయంలో టీడీపీ, జనసేన వర్గాల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. దీంతో.. బ్యానర్ గొడవ తారస్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో.. జనసేన కార్యకర్త యర్రంశెట్టి నాని, అతని బావపై టీడీపీ కార్యకర్త దాడి చేశారు. ఈ దాడిలో శాయన శ్రీనివాసరావు గాయపడ్డారు.