Off The Record : మళ్లీ తెర మీదికి రాపాక రాజకీయ భవిష్యత్ చర్చలు
- మళ్లీ తెర మీదికి రాపాక రాజకీయ భవిష్యత్ చర్చలు
- ప్రస్తుతం పొలిటికల్ చౌరాస్తాలో, టీడీపీ వైపు చూపు
- రాపాక టీడీపీలో చేరడానికి జనసేన ఒప్పుకుంటుందా?
- నాడు ద్రోహం చేశారంటూ ఇప్పటికీ జనసైనికుల మండిపాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆ సీనియర్ లీడర్‌కు ఇప్పుడు ఫుల్లీ పొలిటికల్ బ్యాడ్‌టైం నడుస్తోందా? గతంలో వేసిన రాంగ్ స్టెప్స్, రాంగ్ అలయెన్స్‌కు ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నారా? ఒకప్పుడు సంచలనం సృష్టించిన ఆ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు పొలిటికల్ ఒంటరి అయ్యారా? ఆయన చేసిన పొలిటికల్ జంపింగ్స్ బూమరాంగ్ అవుతున్నాయా? పుట్టింటోళ్ళు తరిమేశారు, కట్టుకున్నోడు వదిలేశాడన్నట్టుగా ఉన్న ఆ ఎక్స్ ఎమ్మెల్యే ఎవరు? ఏంటా శాడ్ స్టోరీ? డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజకీయాల్లో మళ్లీ హీట్ పెరుగుతోంది. ప్రత్యేకించి రాజోలు నియోజకవర్గం ఇప్పుడు మూడు పార్టీల మధ్య ప్రతిష్టాత్మక పోటీకి వేదికగా మారుతోంది. ఒకవైపు దేవా వరప్రసాద్ నేతృత్వంలోని జనసేన బలంగా ఉంది. మరోవైపు టిడిపి, వైసీపీ బలం పెంచుకునేందుకు గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశాయి. ఇన్నాళ్ళు సైలెంట్‌గా ఉన్న ఓ పేరు ఈ సమీకరణాల మధ్య మళ్ళీ తెర మీదికి వచ్చింది. ఆయనే ఒకప్పుడు జనసేనకు వన్ అండ్ వోన్లీ ఎమ్మెల్యేగా ఉన్న రాపాక వరప్రసాద్. జనసేన తరఫున గెలిచి, తర్వాత వైసీపీలోకి వెళ్ళి, ఆ తర్వాత దూరమై ప్రస్తుతం పొలిటికల్ చౌరాస్తాలో ఉన్నారాయన.
ప్రస్తుతం సరికొత్త ఆశలతో టీడీపీ రూట్‌వైపు చూస్తున్నారు రాపాక. రాజోలు నియోజకవర్గంలో టిడిపికి స్ట్రాంగ్ ఫేస్ లేకపోవడమే తన అవకాశాలకు గ్రీన్ సిగ్నల్ వేస్తుందని నమ్ముతున్నారు మాజీ ఎమ్మెల్యే. తన పాత నెట్‌వర్క్, గ్రౌండ్ ఇమేజ్ అన్నిటినీ కలిపి ఇంకోసారి గేమ్‌లోకి రావచ్చన్నది ఆయన ప్లాన్‌గా తెలుస్తోంది. కానీ ఇక్కడే… అసలు ట్విస్ట్ ఉంది. ఆయన ఆశల సంగతేమోగానీ….. అవతల అవకాశాల మాటేంటన్న చర్చ నడుస్తోంది. సార్ టీడీపీలో చేరాలనుకున్నా, ఆ పార్టీ చేర్చుకోవాలనుకున్నా… అదేమంత తేలికైన ప్రక్రియ కాదని, అందుకోసం జనసేన గ్రీన్ సిగ్నల్ తప్పనిసరని అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. రాపాక విషయంలో జనసేన అంత పాజిటివ్‌గా ఉండకపోవచ్చన్నది వాళ్ళ అభిప్రాయం.
Also Read
ఒకసారి తమకు ఝలక్ ఇచ్చిన వెళ్ళిన నేత తిరిగి మిత్రపక్షంలో చేరతానంటే గ్లాస్ పెద్దలు తేలిగ్గా తలూపేస్తారా అన్నది ఇక్కడ క్వశ్చన్. ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్‌పై గతంలో చేసిన కామెంట్స్ ఇప్పటికీ క్యాడర్ మైండ్‌లో ఫ్రెష్‌గానే ఉన్నాయట. రాజకీయాల్లో మెమరీ షార్ట్ అంటారుగానీ… ఇక్కడ రాపాక విషయంలో మాత్రం జనసేన క్యాడర్ మర్చిపోలేదట. జనసేనలోకి తిరిగి రావాలని రాపాక చేసిన ప్రయత్నాలు ఇప్పటికే ఫెయిల్ అయ్యాయి. కార్యకర్తలు ఓపెన్‌గానే వ్యతిరేకించడంతో ఆ డోర్స్ క్లోజ్ అయిపోయాయి. ఇప్పుడు టీడీపీలోకి రావాలన్నా అలయెన్స్ ధర్మం అడ్డం పడుతోంది. కాకుంటే… మాజీ ఎమ్మెల్యే ఇప్పటికే టిడిపి సీనియర్ లీడర్స్‌తో టచ్‌లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. లోపల లాబీయింగ్ చేస్తూ… బయట సైలెన్స్ స్ట్రాటజీ అమలు చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. అయితే ఫైనల్ డెసిషన్ మాత్రం సింగిల్ లీడర్ చేతిలో కాదు, అలయెన్స్ టేబుల్ మీదే ఉంటుంది.
రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన లీడర్‌కు ఇప్పుడు ఒక్క ముఖ్యమైన పార్టీ కూడా క్లియర్ కట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడం నిజంగానే రాజకీయ విషాదం అంటున్నారు పరిశీలకులు. గతంలో వేసిన ఒక్కో అడుగు, తీసుకున్న ఒక్కో నిర్ణయం ఇప్పుడు రాపాక రాజకీయ భవిష్యత్తును డిసైడ్ చేస్తున్నాయన్న అభిప్రాయం బలంగా ఉంది. ఇప్పటికైతే సిట్యుయేషన్ క్లియర్ కాదుగానీ… ఆప్షన్స్ మాత్రం తగ్గుతున్నాయి. టిడిపిలోకి ఎంట్రీ దొరికితే కొత్త ఛాన్స్. లేదంటే రాజకీయంగా లాంగ్ బ్రేక్ కూడా తప్పదని టాక్. రాజోలు నియోజకవర్గంలో సొంతగా 25 వేల ఓట్‌బ్యాంక్ కలిగిన నాయకుల్ని ఏ పార్టీ కూడా చేర్చుకోవటానికి ఇష్టపడకపోవడం విశేషం. మొత్తానికి వరప్రసాద్ పొలిటికల్ జర్నీ ఇప్పుడు క్రాస్ రోడ్స్‌లో ఉంది. రాంగ్ రూట్‌లోకి వెళ్లిన ప్రయాణం మళ్లీ మెయిన్ రూట్‌లోకి వస్తుందా? లేక సర్వీస్ రోడ్‌తో సరిపెట్టుకుంటుదా అన్నది తేలాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.
- Tags
- NTV Telugu
- OTR
- rapaka politics
తాజావార్తలు
-
Gold Theft: లవర్ సంతోషం కోసం అమ్మ నగలు అమ్మేశాడు.. అసలేం జరిగిందంటే!
-
West Bengal: టీఎంసీ ఆఫీస్‌లో వందలాది ఆధార్ కార్డులు.. బెంగాల్లో సంచలనం!
-
Perni Nani: ఆర్టీసీని సర్వనాశనం చేశారు.. మహిళలపై నెపం వేస్తున్నారు..
-
KamalHaasan : నాకు రజనీకాంత్‌కు మధ్య పోటీ మాత్రమే ఉంది.. విజయ్ నుండి ఎక్కువ ఆశించకూడదు
-
MS Dhoni Retirement: ఎంఎస్ ధోనీ చివరి మ్యాచ్ ఆడనున్నాడా?.. చెపాక్‌లో ఎమోషనల్ ఫేర్వెల్?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..