Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record Over Rangareddy Congress

Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్‌లో వలస నేతల డామినేషన్

Published Date :April 27, 2026 , 10:31 pm
By NTV WebDesk
  • ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్‌లో వలస నేతల డామినేషన్‌
  • పార్టీ మారిన నేతలకు ఇప్పుడు కొత్త చిక్కులు
  • అనుచరులకు పార్టీ పదవులు ఇప్పించుకోలేక సతమతం
  • పదవి కావాలంటే మూడేళ్ళు పార్టీలో పనిచేసి ఉండాలన్న రూల్‌
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్‌లో వలస నేతల డామినేషన్
  • Follow Us :
  • google news
  • dailyhunt

హస్తం నేతలు అక్కడ చుక్కలు చూస్తున్నారా..? సొంత పార్టీనే… సరికొత్త రూల్స్‌తో వాళ్ళకు షాకిస్తోందా? పార్టీ మారిన నేతలకు పదవుల సెగ తగులుతోందా? ఇలాగైతే సొంత కేడర్‌ను నిలబెట్టుకోవడం కష్టమంటూ వాళ్ళు మధనపడుతున్నారా? ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఎక్కడుంది? ఏ జిల్లా నాయకులు అంతలా ఇరకాటంలో పడ్డారు? రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌లో ఇప్పుడు వలస నేతల హవానే నడుస్తోంది. ఎక్కడ చూసినా వాళ్ళే కనిపిస్తున్నారు. మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి నుంచి మొదలు.. ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, కాలె యాదయ్య, మనోహర్ రెడ్డి.. ఇలా ఒకరేమిటి…జిల్లాలో పొలిటికల్‌ హేమా హేమీలని చెప్పుకునే వాళ్ళలో ఎక్కువ మంది ఇప్పుడు హస్తం గూటికే చేరారు. వాళ్లు పార్టీ మారడం సంగతి ఎలా ఉన్నా… ఆ తర్వాతే అసలు చిక్కులు మొదలయ్యాయట. నాయకుల వెనకే వచ్చిన అనుచరుల పరిస్థితి ఇప్పుడు త్రిశంకు స్వర్గంలో ఉన్నట్టయిందని అంటున్నారు. పార్టీ జిల్లా, డివిజన్, వార్డు కమిటీల్లో తమ వారికి పదవులు ఇప్పించుకుందామంటే… పీసీసీ పెట్టిన త్రీ ఇయర్స్ రూల్ ప్రతిబంధకంగా మారింది. పార్టీలో కనీసం మూడేళ్లు పనిచేస్తేనే పదవి ఇవ్వాలన్నది రూల్‌. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌కు అధిష్టానం నుంచి ఉన్న క్లియర్ కట్ లైన్ ఇది. 2023 ఎన్నికల కంటే ముందు నుంచి ఎవరైతే పార్టీని నమ్ముకుని ఉన్నారో, వారికే ప్రస్తుత కమిటీల్లో చోటు కల్పించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. జంపింగ్ జపాంగ్‌లకు పార్టీలోకి వచ్చిన వెంటనే పదవులు ఇస్తే.. మొదటి నుంచి కష్టపడ్డ వారికి అన్యాయం జరుగుతుందని భావిస్తోంది అధిష్టానం.

దీంతో ఏళ్ల తరబడి జెండా మోసిన పాత కాపులు ఖుషీ అవుతుంటే.. వలస నేతల కేడర్‌లో మాత్రం నిరాశ పెరుగుతోందట. పదవులు లేకపోతే పార్టీలో మా ఉనికి ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. మహిళా నేతల్లో కూడా ఇదే పరిస్థితి ఉన్నట్టు తెలిసింది. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి భార్య సునీత మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆమె అప్పుడప్పుడు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నా… కీలక పదవి కోసం ఎదురు చూస్తున్నట్టు చెబుతున్నారు అనుచరులు. ప్రస్తుత మేడ్చల్ జిల్లా, రంగారెడ్డి జిల్లాల్లో మున్సిపల్ చైర్ పర్సన్స్, కార్పొరేషన్ మేయర్లుగా పని చేసిన నాయకురాళ్లు చాలామంది హస్తం పార్టీలో పదవుల కోసం లాబీయింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ…. పీసీసీ త్రీ ఇయర్స్‌ కండిషన్స్‌తో వారంతా ఇంకొద్ది కాలం వేచి చూడాల్సిన పరిస్థితి. ఈ నిబంధనపై కొత్తగా చేరిన నేతలు లోలోపల రగిలిపోతున్నారట. వచ్చీ రాగానే మంత్రి పదవులు ఇవ్వడానికి లేని రూల్స్.. పార్టీ కమిటీ పదవులకు ఎందుకన్నది వారి ప్రధాన ప్రశ్న. కీలకమైన స్థానిక కమిటీల్లో తమ వారికి ప్రాధాన్యత లేకపోతే.. రేపు ఎన్నికల సమయంలో కేడర్‌ను ఎలా కంట్రోల్ చేస్తామంటూ వాదిస్తున్నారు. పదవులు లేకుంటే కొత్త చేరికలు ఎలా ఉంటాయని అధిష్టానాన్ని నిలదీస్తున్నారు వలస నేతలు. పాత-కొత్త నేతల మధ్య మొదలైన ఈ చిచ్చు.. జిల్లాలో పార్టీ పటిష్టతకు దెబ్బతీస్తుందా? లేక అధిష్టానం ఏమైనా సడలింపులు ఇస్తుందా? అనేది ఇప్పుడు ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్‌లో హాట్‌ టాపిక్‌.

Also Read

  • Off The Record : అధికారిక పర్యటనలు జరిగినప్పుడల్లా రచ్చో రచ్చస్య
  • Off The Record : మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డికి కోవర్ట్ల భయం
  • Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
  • Off The Record : సర్ సర్వేకు మజ్లిస్ మార్క్ ట్రీట్‌మెంట్‌ మొదలైందా?

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • NTV Telugu
  • off the record
  • rangareddy congress

తాజావార్తలు

  • Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్‌లో వలస నేతల డామినేషన్

  • Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..

  • RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!

  • India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్‌ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!

  • SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..

ట్రెండింగ్‌

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions