Off The Record : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మైనింగ్ కంపెనీపై బీఆర్ఎస్ ఎందుకంతగా దృష్టిపెట్టింది?
- పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మైనింగ్ కంపెనీపై బీఆర్ఎస్ ఎందుకంతగా దృష్టిపెట్టింది?
- అదే అంశంపై పదేపదే ఎందుకు బలంగా వాదిస్తోంది?
- పొంగులేటిని గులాబీ పార్టీ టార్గెట్ చేసుకోవడానికి బలమైన కారణం వుందా?
- ఏ ఆధారాలు....ఆయుధం అయ్యాయని చెబుతోంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మైనింగ్ కంపెనీపై బీఆర్ఎస్ ఎందుకంతగా దృష్టిపెట్టింది? అదే అంశంపై పదేపదే ఎందుకు బలంగా వాదిస్తోంది? పొంగులేటిని గులాబీ పార్టీ టార్గెట్ చేసుకోవడానికి కారణమేంటి? ఏ ఆధారాలు….ఆయుధమని చెబుతోంది? తెలంగాణలో రాజకీయం అంతా రాఘవ కన్స్ట్రక్షన్స్ చుట్టే తిరుగుతోంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుటుంబానికి చెందిన కంపెనీగా చెబుతున్న BRS..దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తోంది. క్రషర్ కు పర్యావరణ అనుమతులు లేవని, జీఓ నెంబర్ 111 పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో అక్రమంగా క్వారీయింగ్ చేస్తున్నారని చాలా కాలంగా గులాబీ పార్టీ ఆరోపిస్తూ వస్తోంది. ఇక అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న టైంలో ఈ అంశాన్ని సభలో లేవనెత్తింది బీఆర్ఎస్ పార్టీ. రెండు రోజులపాటు నిరసన తెలిపింది. రాఘవ కన్‌స్ట్రక్షన్స్ క్రషర్ అక్రమ మైనింగ్ పై హౌస్ కమిటీ వేయాలని గా పట్టుబట్టారు. ఇదే అంశంపై శాసనసభలో ఎమ్మెల్యేలు, శాసనమండలిలో ఎమ్మెల్సీలు సస్పెండ్ కూడా అయ్యారు.
విజువల్స్
అయితే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ పై బీఆర్ఎస్ ఎందుకంతగా ఫోకస్ పెట్టింది అని ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. పొంగులేటి ఇష్యూపై బీఆర్ఎస్ సీరియస్ గా తీసుకోవడానికి ఓ బలమైన కారణం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రాఘవ కన్‌స్ట్రక్షన్స్ క్రషర్‌కు అనుమతులు లేవని, పలుమార్లు నోటీసులు జారీ అయ్యాయని బీఆర్ఎస్ అంటోంది. స్వయంగా ప్రభుత్వమే జరిమానా విధించిందని చెబుతోంది. ఈ జరిమానాల ఆధారాలనే ఆయుధంగా మలచుకున్నామంటోంది గులాబీ పార్టీ. సభలో పదేపదే ఇదే విషయాన్ని ప్రస్తావించింది. దీనితో పాటు రెండున్నరేళ్లలో వివిధ శాఖల్లో జరిగిన సుమారు 19 స్కాములపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది. స్వయంగా మంత్రికి చెందిన మైనింగ్ సంస్థపై వచ్చిన ఆరోపణల ఇష్యూను అంత ఈజీగా వదలొద్దని డిసైడ్ అయ్యామంటోంది బీఆర్ఎస్.
Also Read
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు