OTR : కాంగ్రెస్ టిక్కెట్ దానంకేనా? మరొకరికి ఇస్తారా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఖాయమైపోయింది. కానీ… అక్కడ కాంగ్రెస్ టిక్కెట్ ఎవరికి ఇస్తారన్నదే ఇప్పుడు బిగ్ క్వశ్చన్. పార్టీ మారివచ్చి అనర్హత వేటు పడ్డ దానం నాగేందర్‌నే ఈసారి హస్తం గుర్తు మీద బరిలో దింపుతారా? లేక ప్రత్యామ్నాయం చూస్తారా? దాని గురించి కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతున్న చర్చలేంటి? వేటు పడ్డాక తనను కలిసిన దానంకు సీఎం రేవంత్ ఏం చెప్పారు? లెట్స్ వాచ్. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు పడింది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గతంలో ఇచ్చిన తీర్పును బీజేపీ, బీఆర్ఎస్ హైకోర్ట్‌లో సవాల్ చేశాయి. విచారించిన ఉన్నత న్యాయస్థానం దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేసింది. దాంతో… ఖైరతాబాద్ సీటు ఖాళీ అయ్యింది. ఆ దశలో దానం నాగేందర్… సుప్రీం కోర్ట్‌లో అప్పీల్‌కు వెళతారనే ప్రచారం జరిగింది. కానీ.. తనకు అలాంటి ఉద్దేశ్యం లేదని ఆ తర్వాత ఆయన క్లారిటీ ఇచ్చేశారు. సుప్రీం కోర్టుకు కాదు… ప్రజల్లోకే వెళ్తానని కూడా ప్రకటించేశారాయన. అంటే…. ఉప ఎన్నికల్ని ఎదుర్కోవడానికి సిద్ధమయ్యారన్న మాట. దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయడంతో… అన్ని పార్టీలు ఉప ఎన్నికల్ని ఎదుర్కోవడానికి సిద్ధమవ్వాల్సిన పరిస్థితి. మేం రెడీ అంటూ… పీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్ ఇప్పటికే ప్రకటించేశారు కూడా. ఇంతకు ముందు జరిగిన రెండు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. ఇంకొకటి వచ్చినా… విజయం మాదేనంటూ కాన్ఫిడెంట్‌గా చెప్పారాయన. మరోవైపు అనర్హత వేటు పడిన తర్వాత… సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు దానం. ఆ సందర్భంగా…. ఉప ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధమవ్వండని సీఎం చెప్పినట్టు సమాచారం.
ఐతే… దానం నాగేందర్‌కు కాంగ్రెస్ బీ ఫామ్ ఇవ్వడం కన్ఫామ్ అయినట్టేనా..? లేక మరో ఆలోచన ఏదైనా చేస్తారా..? అన్న సందేహాలు ఉన్నాయి రాజకీయవర్గాల్లో. అందుకు సమాధానంగా…. ఆ నియోజకవర్గంలో బలమైన నాయకుడు దానం నాగేందర్ కాబట్టి… కాంగ్రెస్ అనివార్యంగా ఆయన్ని బరిలో దింపుతుందని అంటున్నారు కొందరు. కానీ… ఇక్కడ ప్రత్యర్ధి పార్టీలు BRS…బీజేపీ ఏం చేస్తాయి? వాటి వ్యూహం ఎలా ఉంటుందన్నదే అసలు చర్చ. బీఆర్ఎస్ తరపున బరిలో దిగే నాయకుడు బలవంతుడైతే పోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ…ఆ పార్టీ అభ్యర్థి ఎవరన్న విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అదే సమయంలో అధికార పార్టీ మాత్రం కాన్ఫిడెంట్‌గా కనిపిస్తోంది. దానం నాగేందర్‌ను ముందుపెట్టి ఉప ఎన్నికల్ని ఎదుర్కోవాలని డిసైడ్ అయినట్టే కనిపిస్తోందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు ఎక్కువ. అలాగే… స్లమ్ కాలనీల సంఖ్య ఎక్కువే. వీటన్నిటినీ బేరీజు వేసుకుంటే… వాతావరణం మాకు అనుకూలంగా ఉంటుందన్నది కాంగ్రెస్ లెక్క. అయితే… ప్రత్యర్థి పార్టీలు ఏ స్థాయి అభ్యర్థిని నిలబెడతాయన్నదాన్ని బట్టి కొన్ని కేలిక్యులేషన్స్ మారవచ్చని అంటున్నారు. మొత్తం మీద ఖైరతాబాద్‌లో ఉప ఎన్నిక ఖాయం. అదే టార్గెట్‌తో అధికార పార్టీ పకడ్బందీ వ్యూహాన్ని సిద్ధం చేస్తోందట.
Also Read
తాజావార్తలు
-
Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
-
UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
-
Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
-
Smart Projectors: ఇక టీవీలతో పనేలేదు.. చీప్ రేటుకే ఇంట్లోనే మల్టీప్లెక్స్ రేంజ్ ఫీలింగ్!
-
Ind vs WI 5th T20: టాస్ గెలిచిన వెస్టిండీస్.. సిరీస్ కోసం ఇరు జట్ల పోరు
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!