OTR : గిద్దలూరు మున్సిపల్ పీఠంపై అన్నదమ్ముల రాజకీయం.. మూడు నామినేషన్లతో ట్విస్ట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కడ అన్న ఎమ్మెల్యేగా ఉన్నారు. తమ్ముడు మున్సిపల్ చైర్మన్ పీఠం టార్గెట్‌గా పెట్టుకున్నారు. కానీ అనూహ్యంగా ఆ పదవిని బీజేపీకి కేటాయించాల్సి వచ్చింది. తాను మాత్రం వెనక్కు తగ్గేదే లేదంటూ ఏకంగా మూడు నామినేషన్లు వేశారు ఎమ్మెల్యే సోదరుడు. మార్కాపురం జిల్లా గిద్దలూరులో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కూటమి పార్టీల మధ్య అంతర్గత రాజకీయాన్ని తెరపైకి తెచ్చింది. ఇంతకీ మూడు నామినేషన్ల వెనుక వ్యూహమేంటి?తెరవెనుక ఏం జరిగింది?ఈ ఎన్నికల్లో ఏం జరగబోతోంది?
గిద్దలూరు మున్సిపల్ చైర్మన్ పీఠం..కూటమి రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.. టీడీపీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి సోదరుడు కృష్ణకిశోర్‌రెడ్డి.. నియోజకవర్గంలో అన్న తర్వాత అన్నీ తానై వ్యవహరిస్తున్న నాయకుడు.. ఎమ్మెల్యే అందుబాటులో లేని సమయంలోనూ అవసరమైతే ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరవుతూ.. నియోజకవర్గ రాజకీయాల్లో తనదైన పాత్ర పోషిస్తుంటారు..అయితే అధికారిక పదవి లేకపోవడంతో ప్రొటోకాల్ ఇబ్బందులు ఎదురవుతున్నాయన్న చర్చ ఉంది.. ఈ తరుణంలో మున్సిపల్ చైర్మన్ పదవిపై ఆయన ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.. గిద్దలూరు మున్సిపాలిటీ జనరల్ కావడంతో.. ఈసారి చైర్మన్ పీఠం తనకు దక్కుతుందని భావించారు అశోక్‌రెడ్డి సోదరుడు కృష్ణకిశోర్‌రెడ్డి.. కానీ కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా టీడీపీ ఈ స్థానాన్ని బీజేపీకి కేటాయించడంతో కథ అడ్డం తిరిగింది.. ఆశించిన పదవి దక్కకపోవడం.. మరోవైపు కూటమి ధర్మం పాటించాల్సిన పరిస్థితి.. ఈ రెండింటి మధ్య గిద్దలూరు టీడీపీలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కిందట.
Also Read
- Off The Record: తాండూరు కాంగ్రెస్‌లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
- Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
- OTR: డిండి నీటి కేటాయింపులతో రాజకీయ వేడి.. నల్లగొండ నేతల మౌనమేంటి?
- Off The Record: స్థానిక సంస్థల ఎన్నికల వేళ పిఠాపురంలో ఆసక్తికర రాజకీయాలు..
మున్సిపల్ చైర్మన్ పదవిని బీజేపీకి కేటాయించడంపై కృష్ణకిశోర్ రెడ్డి అసంతృప్తితో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గిద్దలూరు స్థానాన్ని టీడీపీకే కేటాయించాలని పట్టుబట్టినప్పటికీ.. చర్చలు కొలిక్కి రాకపోవడంతో ఏకంగా మూడు నామినేషన్లు దాఖలు చేశారాయన.. టీడీపీ తరఫున ఒకటి.. బీజేపీ తరఫున మరొకటి.. స్వతంత్ర అభ్యర్థిగా ఇంకొకటి.. ఏదో ఒక మార్గంలో పోటీలో నిలవాలన్న వ్యూహంతోనే ఈ మూడు నామినేషన్లు వేసినట్లు ప్రచారం జరిగింది.. మరోవైపు బీజేపీ అభ్యర్థి జాడి వెంకట నారాయణ నామినేషన్ కార్యక్రమానికి ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు సోము వీర్రాజు, టీడీపీ జిల్లా పరిశీలకుడు బీటీ నాయుడు, ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి హాజరయ్యారు.. అయితే ఈ కార్యక్రమానికి టీడీపీ శ్రేణులు పెద్దగా హాజరు కాకపోవడం రాజకీయ చర్చకు దారితీసింది.. ఇదే సమయంలో కృష్ణకిశోర్‌రెడ్డి భారీ ర్యాలీతో వచ్చి మూడు నామినేషన్లు వేయడం.. ఆ కార్యక్రమానికి ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి దూరంగా ఉండటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.. ఎమ్మెల్యే సోదరుడి పోటీ వ్యవహారాన్ని బీజేపీ సీరియస్‌గా తీసుకున్నట్లు సమాచారం.. సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు వెళ్లడంతో.. కూటమి ధర్మాన్ని పాటించాల్సిందేనని ఎమ్మెల్యేకు స్పష్టమైన ఆదేశాలు అందినట్లు ప్రచారం జరిగింది.. ఈ క్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ గిద్దలూరు వెళ్లి ఎమ్మెల్యే, ఆయన సోదరుడితో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.. చివరకు అధిష్టానం ఒత్తిడితో కృష్ణకిశోర్‌రెడ్డి మూడు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.. దీంతో ప్రస్తుతానికి వివాదానికి తెరపడినా.. అసలు రాజకీయ పరీక్ష మాత్రం మిగిలే ఉంది..
నామినేషన్ల ఉపసంహరణతో కూటమిలో వివాదం ముగిసినట్లే కనిపిస్తున్నా.. తెరవెనుక అసంతృప్తిపై చర్చ మాత్రం కొనసాగుతోంది.. మంత్రి గొట్టిపాటి రవికుమార్ టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థులతో సమావేశమై.. కూటమి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే బీజేపీ అభ్యర్థి జాడి వెంకట నారాయణ బలాబలాలపై టీడీపీలోనే అంతర్గత చర్చ జరుగుతుందని టాక్.. పరిమిత ఓటు బలం ఉన్న అభ్యర్థికి మద్దతు ఇవ్వడమే కాకుండా.. ఎన్నికల ఖర్చుల భారం కూడా టీడీపీపైనే పడుతోందన్న అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఎమ్మెల్యే కుటుంబానికి సమీప బంధువైన టీడీపీ నేత ప్రతాప్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయడం కూడా చర్చనీయాంశమైంది. అయితే ఆయనను కూడా ప్రచారానికి దూరంగా ఉండాలని ఆదేశించినట్లు సమాచారం. ఈ పరిణామాలను వైసీపీ తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది.. వైసీపీ అభ్యర్థి భూమా బాల నర్సింహారెడ్డి ప్రచారం ప్రారంభించడంతో పోరు మరింత ఆసక్తికరంగా మారింది.
- Tags
- ntv
- off the record
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్‌లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..