OTR: యూనిఫాంలో ఉన్న క్రిమినల్ అంటూ నాగేశ్వరరావు సజ్జనార్‌పై ఫైర్.. అసలు కారణం ఏంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రిటైర్డ్ ఐపీఎస్ అధికారి నాగేశ్వరరావుకు సర్వీస్‌లో ఉన్న ఆఫీసర్ సజ్జనార్ అంటే ఎందుకంత కోపం? ఉన్నతాధికారిని యానిఫామ్లో ఉన్న క్రిమినల్ అని పిలిచే స్థాయికి ఎందుకు వెళ్లారు? సజ్జనార్‌పై నాగేశ్వరరావు చేస్తున్న ఆరోపణలకు కారణమేంటి? వీరిద్దరి మధ్య వివాదానికి ఎక్కడ బీజం పడింది? హైదరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌పై రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, సీబీఐ మాజీ తాత్కాలిక డైరెక్టర్ ఎం. నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. సజ్జనార్ యూనిఫాంలో ఉన్న క్రిమినల్ అంటూ అభివర్ణించడమే కాకుండా.. ఆయనపై సమగ్ర దర్యాప్తు జరిపించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నాగేశ్వరరావు. దీనికి సమాధానాలు వెదికితే.. కొన్ని నెలల క్రితం హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి కేసు తెరపైకి వస్తోంది. తోటి ట్రైనీ ఐపీఎస్ అధికారిణిపై లైంగిక వేధింపుల ఆరోపణలతో ఉదయ్ కృష్ణారెడ్డిపై కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తు తీరును అప్పట్లోనే నాగేశ్వరరావు తీవ్రంగా తప్పుబట్టారు. ఆయన ఉదయ్ కృష్ణారెడ్డి వైపు నిలబడడమే ఆగాధానికి కారణం అట. ఆ కేసులో ప్రాంతీయ అభిమానంతో సజ్జనార్ ఒకరివైపు మొగ్గుచూపడం నాగేశ్వరావు ఆగ్రహానికి కారణమైందని చెప్పుకుంటున్నారు. ఇద్దరి సర్వీసు రికార్డులను పరిశీలిస్తే ఒకరు 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి… మరొకరు 1996 బ్యాచ్ ఆఫీసర్. సజ్జనార్‌ది కర్నాటక అయితే నాగేశ్వరావుది వరంగల్. అయితే సజ్జనార్ తెలంగాణ క్యాడర్ ఆఫీసర్, నాగేశ్వరావు ఒడిశా క్యాడర్ ఐపీఎస్. ఈ ఇద్దరు అధికారులు సర్వీసు, క్యాడర్ వేరు వేరు అయినా వివాదం మాత్రం కంటిన్యూఅవుతోంది. 2019లో సీబీఐ నుంచి నాగేశ్వరరావు కేంద్ర ఫైర్ సర్వీసెస్ డీజీగా వెళ్లారు. 2026లో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ పదవి నుంచి సజ్జనార్ తెలంగాణ ఫైర్ సర్వీసెస్ డీజీగా వెళ్లారు.
రెండూ వేర్వేరు ప్రభుత్వాల పరిధిలోని పదవులే అయినా… విభాగాల పేర్లలో సారూప్యత ఉంది. ఇప్పుడు సజ్జనార్ బదిలీని ప్రస్తావిస్తూ నాగేశ్వరరావు సోషల్ మీడియాలో ఆయనను యూనిఫాంలో ఉన్న క్రిమినల్ అని అభివర్ణించడం తీవ్ర చర్చకు కారణమైంది. ఒకరు పదవీ విరమణ చేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి… మరొకరు ప్రస్తుతం సర్వీస్‌లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి. ఇద్దరి కెరీర్లోనూ కీలక పదవులు, వివాదాలు, ఫైర్ సర్వీసెస్ బదిలీలు ఉన్నాయి. సజ్జనార్ గతంలో దర్యాప్తు చేసిన మల్టీ లెవల్ మార్కెటింగ్ వ్యవహారం, ఆమ్వే ప్రాడక్ట్ కేసు, గోల్డ్ క్రెస్ట్ కేసుపై అనేక వివాదాలు కూడా ఉన్నాయి. ఈ పరిణామ క్రమంలో మాజీ అధికారి నాగేశ్వరావు ఆరోపణలు ఐపీఎస్ వర్గాలను నివ్వెరపరస్తున్నాయి. దీనికి తోడు కర్నాటక బీజేపీ లీడర్స్‌తో సజ్జనార్ మీటింగ్స్ కూడా బదిలీకి కారణమని చెప్పుకుంటున్నారు. 21 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ…. అందులో భాగంగానే హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న సజ్జనార్‌ను ఫైర్ సర్వీసెస్ డీజీగా నియమించింది తెలంగాణ సర్కార్. ఆయన స్థానంలో మహేష్ భగవత్‌ను హైదరాబాద్ సీపీగా నియమించింది. అయితే సజ్జనార్ బదిలీకి నిర్దిష్ట కారణాన్ని మాత్రం అధికారికంగా వెల్లడించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో నాగేశ్వరరావు చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. సజ్జనార్‌ను బదిలీ చేయడం మాత్రమే సరిపోదని, బదిలీ అనేది శిక్ష కాదని, ఆయనపై తాను చేస్తున్న ఆరోపణలన్నింటిపైనా విచారణ జరగాలని డిమాండ్ చేశారు రిటైర్డ్ ఐపీఎస్. ఒక మాజీ సహోద్యోగిని ఇంత తీవ్రంగా విమర్శించడం బాధ కలిగిస్తున్నా.. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మాట్లాడాల్సి వస్తోందని పేర్కొన్నారాయన. మరి నాగేశ్వరరావు ఆగ్రహానికి ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసే ప్రధాన కారణమా? లేక గత ఎన్కౌంటర్లపై ఉన్న అభ్యంతరాలన్నీ ఇప్పుడు మరోసారి బయటపడుతున్నాయా? సజ్జనార్‌పై ఆయన చేస్తున్న ఆరోపణలను ప్రభుత్వం పరిశీలిస్తుందా? లేక ఈ వివాదం ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారుల మధ్య మాటల యుద్ధంగానే మిగిలిపోతుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Also Read
తాజావార్తలు
-
OTR: నేతల తన్నులాటలతోనే నందికొట్కూరులో టీడీపీ ఘోర ఓటమి?
-
Nagula Chavithi: నాగుల చవితి వేళ అద్భుతం.. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యక్షమైన నాగసర్పం!
-
CM Revanth Reddy : పిల్లల భవిష్యత్తే లక్ష్యం.. సీఎం రేవంత్ కీలక సందేశం
-
OTR: లెక్కలు మారుతున్నాయా? కంగారులో కూటమి.. వైసీపీ మాత్రం పక్కా లెక్కలతో ముందడుగు వేస్తుందా?
-
OTR: చంద్రబాబుకు జనసేన ఫిర్యాదు.. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కు అగ్నిపరీక్ష!
ట్రెండింగ్
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్‌ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!