Off The Record : క్యాబినెట్ విస్తరణ క్లారిటీ వచ్చాకే ఉపసభాపతి ఎవరో తేలుతుందా?
- రెండేళ్ళ నుంచి ఖాళీగా డిప్యూటీ స్పీకర్ పదవి
- గత సెషన్‌లో జరుగుతుందనుకున్నా నో
- ఈసారి కూడా ఇంతవరకు నో డిస్కషన్
- డిప్యూటీ స్పీకర్‌గా రామచంద్రు నాయక్‌కు లైన్ క్లియర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వాయిదాల మీద వాయిదాలు. ఒకసారి కాదు, రెండు విడతలు కాదు. పదే పదే అదే వాయిదాలు. అయినా మేటర్ కొలిక్కి రాలేదు. ఆ పోస్ట్‌కు అభ్యర్థిని ప్రకటించారు. ఇక సీట్లో కూర్చోవడమే తరువాయి అన్నారు. కానీ… ఏదీ జరగలేదు. మరి పార్టీ ప్రకటించిన పదవి సదరు నేతకు ఇష్టం లేదా? అంతకు మించి అన్నట్టుగా ఆయన ఆశిస్తున్నారా? ఎవరా నాయకుడు? ఏదా పదవి? తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవి దాదాపు రెండేళ్ళ నుంచి ఖాళీగానే ఉంది. భర్తీ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నా… ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంది. డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కోసం గతంలో అధికారిక ప్రకటన కూడా వెలువడింది. అయినా ప్రక్రియ మాత్రం పూర్తవలేదు. గడిచిన అసెంబ్లీ సెషన్‌లోనే ఎన్నిక జరుగుతుందని అంతా భావించారు. అది జరక్కపోగా….ప్రస్తుతం ఈ బడ్జెట్ సెషన్‌లో సైతం ఆ ఎన్నికలకు సంబంధించిన చర్చ ఇప్పటివరకు జరగలేదు. డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్‌ను డిప్యూటీ స్పీకర్ అభ్యర్థిగా ఎప్పుడో ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. కానీ సభలో అందుకు సంబంధించిన ప్రకటన మాత్రం వాయిదా పడుతూ వస్తోంది.
అందుకు కారణాలపై రకరకాల అనుమానుల పెరుగుతున్నాయి. ఏదో…. నెలో రెండు నెలలో అంటే సరేగానీ…. ఏళ్ళకు ఏళ్ళు ఉప సభాపతి పదవిని భర్తీ చేయలేకపోవడం వెనకున్న బలమైన కారణాలేంటా అన్న ఆరాలు సైతం నడుస్తున్నాయి. ఇందుకు కేబినెట్ విస్తరణ కూడా ఓ కారణమై ఉండవచ్చని అంటున్నారు. తెలంగాణ కేబినెట్‌లో తమకు ప్రాతినిధ్యం లేదని లంబాడా సామాజిక వర్గం అసంతృప్తిగా ఉంది. ఆ కోటాలో మంత్రి పదవి ఆశిస్తున్నారట రామచంద్రనాయక్. అందుకే ఆయన డిప్యూటీ స్పీకర్ పదవి విషయంలో అంత సానుకూలంగా లేరని, ఆ కారణంతోనే అభ్యర్థిత్వాన్ని ప్రకటించినా… ఎన్నిక ఎప్పటికప్పుడు వాయిదా పడుతుండవచ్చన్న చర్చ నడుస్తోంది పొలిటికల్ సర్కిల్స్‌లో. గతంలో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారాయన. కానీ… అదే సామాజికవర్గం నుంచి దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ కూడా మంత్రి పదవి కోసం తన ప్రయత్నాలు తాను చేస్తున్నారు.
Also Read
- OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్‌తో రాజీ ఎలా కుదిరింది?
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Off The Record: అవనిగడ్డ కూటమి పరిణామాలతోబుద్ధప్రసాద్ మధనపడుతున్నారా?
దీంతో ఇద్దరి మధ్య మంత్రి పదవి కోసం పోటీ నెలకొంది. విస్తరణ జరిగితే లంబాడ సామాజిక వర్గం నుంచి ఒకరిని క్యాబినెట్లోకి తీసుకుంటారని ఇద్దరూ ఆశతో ఉన్నారు. దీంతో… విస్తరణ కోసం ఎదురుచూసే పనే ఉంటే… ఏడాది క్రితమే డిప్యూటీ స్పీకర్ పదవికి అభ్యర్థిని ప్రకటించడం ఎందుకన్న చర్చ కూడా నడుస్తోంది. పార్టీలో ఇది అనవసరమైన డిస్ట్రబెన్స్ అన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. రామచంద్రనాయక్ ఇప్పటికే ప్రభుత్వ విప్‌గా కొనసాగుతున్నారు. డిప్యూటీ స్పీకర్ ఛాన్స్ సైతం ఆయనకే ఇచ్చినా…తాను మాత్రం మంత్రి పదవి మీదే ఆశలు పెట్టుకున్నారు. అందుకే ఉప సభాపతి పదవికి ఎన్నిక ఆగిపోయినట్టు చెప్పుకుంటున్నారు.
తాజావార్తలు
-
FIFA World Cup 2026 Final: మెస్సీ వర్సెస్ యమాల్.. అర్జెంటీనా-స్పెయిన్ ఫైనల్ పోరు, ఎవరిది పైచేయి?
-
2027 ODI World Cup: సెలెక్టర్లకు మైండ్ పని చేయడం లేదా?.. బీసీసీఐపై మాజీ టీమిండియా స్టార్ ఫైర్!
-
Ind vs Eng 3rd ODI: నేడే హై ఓల్టేజ్ పోరు.. ఆ జట్టుకే అడ్వాంటేజ్.. పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ ఎలెవన్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే!
-
Theft: రెచ్చిపోయిన దొంగలు.. 10 నిమిషాల్లో రూ.50 లక్షల విలువైన 77 మొబైల్ ఫోన్లు చోరీ..
-
Bethlehem Kudumba Unit: ‘ప్రేమలు’ డైరెక్టర్ నుంచి మరో రొమాంటిక్ మ్యాజిక్.. రిలీజ్ డేట్ అనౌన్స్
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!