Off The Record : తెలంగాణ కాంగ్రెస్‌లో గందరగోళం.. కోఆర్డినేషన్ పేరుతో కొత్త డ్రామా..!
- కాంగ్రెస్ అగ్ర నేతల మధ్య సమన్వయం లేదా?
- సమన్వయ కమిటీ ప్రకటనలోనే ఆ విషయం బయటపడిందా?
- కేసీ వేణుగోపాల్ ప్రకటనలో ముందు సీఎం రేవంత్ పేరు
- మీనాక్షి నటరాజన్ లేఖలో ముందు పీసీసీ చీఫ్ పేరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ కాంగ్రెస్‌లో తీవ్ర గందరగోళ పరిస్థితులు ఉన్నాయా? కొత్తగా వేసిన సమన్వయ కమిటీతో ఆ లోపం ఇంకా గట్టిగా బయటపడిందా? అసలు కమిటీ ప్రకటనలోనే సమన్వయం కొరవడిందా? అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ళకు ఇప్పుడు కొత్తగా కమిటీ వేశారంటే… నిజంగానే పార్టీ, ప్రభుత్వం మధ్య కో ఆర్డినేషన్ లేదా? కాంగ్రెస్ పార్టీలో అసలేంటీ గందరగోళం? తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త చర్చకు తెర లేచింది. పార్టీ నాయకుల మధ్య సమన్వయం కోసమంటూ కమిటీ వేసింది ఏఐసీసీ. కానీ… అసలు కో ఆర్డినేషన్ కమిటీ వేసిన పార్టీ అగ్రనేతల మధ్యనే కో ఆర్డినేషన్ లేనట్టు కనిపిస్తోంది.
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ విడుదల చేసిన రెండు వేర్వేరు ప్రకటనల్ని చూస్తుంటేనే…. ఆ ఇద్దరి మధ్య సయోధ్య లేదన్నట్టు కనిపిస్తోందని అంటున్నారు. కేసీ వేణుగోపాల్ విడుదల చేసిన ప్రకటనలో సీఎం రేవంత్ రెడ్డి పేరు మొదట్లో పెట్టారు. కానీ… మీనాక్షి నటరాజన్ ఇచ్చిన లేఖలో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పేరు ముందుకొచ్చింది. దీంతో కాంగ్రెస్ వ్యవహారాలకు సంబంధించి సోషల్ వీధుల్లో చర్చోపచర్చలు జరిగిపోతున్నాయి. వాళ్ళు చేస్తున్నారనేకంటే… ఈ చర్య ద్వారా పార్టీ అగ్ర నాయకులే సోషల్ మీడియాకు కావాల్సినంత స్టఫ్ ఇచ్చారంటూ కాంగ్రెస్‌లో అంతర్గతంగా మాట్లాడుకుంటున్నారు.
Also Read
- OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్‌తో రాజీ ఎలా కుదిరింది?
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Off The Record: అవనిగడ్డ కూటమి పరిణామాలతోబుద్ధప్రసాద్ మధనపడుతున్నారా?
అసలు సమన్వయ కమిటీ వేయడంలోనే సమన్వయం లేదన్న ఇండికేషన్ పంపినట్టయింది. సహజంగా ఎప్పుడు అధికారంలో ఉన్నా.. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయ కమిటీ ఉంటుంది. కానీ… ఈసారి పవర్లోకి వచ్చిన రెండున్నరేళ్ళకు కమిటీ వేయడంపై డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఇటీవల ఢిల్లీలో పార్టీ సీనియర్ నాయకులందరినీ పిలిచి సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత కమిటీ ఏర్పడడంతో ఈ చర్చకు అవకాశం కల్పించినట్లు అయింది. ఇంత ఆలస్యంగా కో ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేయడం ద్వారా… ఇన్నాళ్ళు ప్రభుత్వానికి, పార్టీకి మధ్య సమన్వయం లేదని పార్టీ పెద్దలు చెప్పాలనుకున్నారా అన్న ప్రశ్నలు సైతం వస్తున్నాయి. ఢిల్లీలో అధిష్టానం వద్ద ముఖ్యమైన నేతలు వన్ టు వన్ సమావేశం అయ్యారు. ఆ సమావేశంలో ఒకరిద్దరు సీనియర్ నేతలు సమన్వయం లేదన్న అంశంపై అధిష్టానానికి చెప్పడం వల్లనే ఈ కమిటీ వచ్చిందనట్టు చెప్పుకుంటున్నారు. మరి పార్టీలో, ప్రభుత్వంలో జరిగే కీలక నిర్ణయాలని ఈ కమిటీని ఫైనల్ చేయబోతుందా..? ఇది ఎవరికి చెక్ పెట్టడానికి, ఎవర్ని బుజ్జగించడానికి అన్న చర్చలు నడుస్తున్నాయి తెలంగాణ కాంగ్రెస్‌లో.
- Tags
- congress
- NTV Telugu
- OTR
తాజావార్తలు
-
2027 ODI World Cup: సెలెక్టర్లకు మైండ్ పని చేయడం లేదా?.. బీసీసీఐపై మాజీ టీమిండియా స్టార్ ఫైర్!
-
Ind vs Eng 3rd ODI: నేడే హై ఓల్టేజ్ పోరు.. ఆ జట్టుకే అడ్వాంటేజ్.. పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ ఎలెవన్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే!
-
Theft: రెచ్చిపోయిన దొంగలు.. 10 నిమిషాల్లో రూ.50 లక్షల విలువైన 77 మొబైల్ ఫోన్లు చోరీ..
-
Bethlehem Kudumba Unit: ‘ప్రేమలు’ డైరెక్టర్ నుంచి మరో రొమాంటిక్ మ్యాజిక్.. రిలీజ్ డేట్ అనౌన్స్
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు జాగ్రత్త సుమీ!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!