Site icon NTV Telugu

Off The Record: ఢిల్లీ పర్యటన తర్వాత సీఎం రేవంత్ రెడ్డిలో మార్పు..?

Revanth Reddy

Revanth Reddy

Off The Record: తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డికి కొత్త శక్తి వచ్చిందా? ఏడాదిన్నరలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు ఆయన మాట మారుతోందా? కేబినెట్‌ మీద పట్టు బిగించడంతోపాటు ఎక్కడికక్కడ నట్లు టైట్‌ చేసే పని మొదలుపెట్టారా? సన్నిహితులనుకున్న మంత్రివర్గ సహచరులతో సైతం కాస్త సీరియస్‌గానే ఉంటున్నారంటే ఏదో జరిగిందన్నది నిజమేనా? ఏంటా సంథింగ్‌ సంథింగ్‌? ముఖ్యమంత్రి తాజా ఢిల్లీ పర్యటనలో ఏం జరిగింది?

Read Also: Allu Arjun : బన్నీ రిజెక్ట్ చేసిన రెండు భారీ మూవీలు..

రేవంత్‌రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఏడాదిన్నరలో చాలాసార్లు ఢిల్లీ వెళ్ళివచ్చారు. వివిధ సందర్భాల్లో అధిష్టానం పెద్దల్ని కలిసి మంతనాలు జరిపారు. కొన్ని ప్లస్‌లు ఉన్నాయి, మరికొన్ని మైనస్‌లు ఉన్నాయి. అదంతా వేరే సంగతి. కానీ, ఈ మధ్యన తాజాగా ఢిల్లీ వెళ్ళి వచ్చాక ఆయన వైఖరిలో మార్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని అంటున్నారు ఆయన్ని దగ్గరగా గమనిస్తున్నవారు. ఇంకా చెప్పాలంటే.. కొత్త బలం వచ్చినట్టుందని, కాన్ఫిడెన్స్‌ లెవల్స్‌ కూడా పెరిగాయని చెప్పుకుంటున్నారు. గడిచిన 18 నెలలుగా.. ఇటు ప్రభుత్వంలో, అటు పార్టీలో ఎవరేం చేసినా.. ఏం మాట్లాడినా చూసీ చూడనట్టే ఉన్నారు సీఎం. కేబినెట్‌ మంత్రుల మీద రకరకాల ఆరోపణలు వచ్చినా.. అంత సీరియస్‌గా తీసుకున్నట్టు కనిపించలేదు. కేవలం ఆరోపణలే కాదు.. మంత్రివర్గ సమావేశంలో ఒకరిద్దరు సహచరులు కాస్త అటు ఇటుగా మాట్లాడినా.. చాలా సాదాసీదాగా చూస్తూ వచ్చారు రేవంత్‌. కానీ, ఇప్పుడు ఆయన వైఖరి చూస్తుంటే.. అదంతా గతం. ఇక మీదట అలాంటివేవీ నడవవ్‌ అన్నట్టుగా ఉందని మాట్లాడుకుంటున్నారు.

Read Also: Off The Record: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పతంగి సపోర్ట్ ఎటు..? |

అయితే, ఏడాదిన్నర టైం ఇచ్చినా.. వీళ్ళలో మార్పు లేదు, ఇకమీదట కూడా అలాగే ఉంటే కుదరదని అనుకున్నారో, లేదంటే లేటెస్ట్‌ ఢిల్లీ టూర్‌లో పార్టీ పెద్దలతో రెండు రోజుల పాటు జరిగిన సమావేశాల్లో క్లారిటీ వచ్చిందోగానీ.. ఈసారి హస్తిన ఫ్లైట్‌ దిగినప్పటి నుంచి ముఖ్యమంత్రిలో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు పొలిటికల్‌ పరిశీలకులు. ఆయన కాన్ఫిడెంట్‌గా అడుగులేస్తున్నారని విశ్లేషిస్తున్నారు. ఇక, ఉత్సాహం ఆపుకోలేని కొందరు కాంగ్రెస్‌ నాయకులైతే.. ఓ అడుగు ముందుకేసి.. ఎందుకిలా?.. ఢిల్లీలో ఏం జరిగి ఉంటుందని ఆరా తీస్తే.. కొత్త కొత్త సంగతులు తెలుస్తున్నాయట. ఢిల్లీ ఇందిరాభవన్‌లో రాహుల్‌గాంధీతో.. గంట సేపు ముఖాముఖి చర్చలు జరిపారట సీఎం. ఆ సమయంలో మంత్రుల పని తీరు, ఇతరత్రా అంశాలన్నిటి మీద సవివరంగా మాట్లాడినట్టు తెలుస్తోంది. కేబినెట్‌లోకి కొత్తగా వచ్చిన ఓ మంత్రి… సీఎం దగ్గరున్న కీలక శాఖలు కావాలని అధిష్టానంలోని ఓ పెద్దాయనకు విన్నవించుకున్నారట. ఆ దిశగా గట్టి ప్రయత్నాలే చేసినట్టు చెప్పుకుంటున్నారు.

Read Also: Gang Rape: బీచ్‌లో ప్రియుడి ముందే యువతిపై సామూహిక అత్యాచారం..10 మంది అరెస్ట్

కానీ, రేవంత్ మాత్రం.. ఆ కీలక శాఖలన్నిటినీ తన దగ్గరే పెట్టుకుని.. ఢిల్లీలోనే చిట్ చాట్ పెట్టి మరీ.. తాను చెప్పాలనుకున్నది క్లారిటీగా చెప్పేశారు. ఆ మాటల ద్వారా.. నేను ఇవ్వాలనుకున్న శాఖలే ఇస్తాను తప్ప.. డిమాండ్‌ చేస్తే కేటాయించే పరిస్థితి లేదని చెప్పకనే చెప్పేశారని విశ్లేషిస్తున్నారు. ఢిల్లీలో అలా మొదలైన రేవంత్ కాన్ఫిడెన్స్.. ఆ తర్వాతి నుంచి పెరుగుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇక సోమవారం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగిన మంత్రుల సమావేశంలో ఆయన చేసిన కామెంట్స్ చూస్తే.. ఇక నుంచి మరింత దూకుడుగా వెళ్ళబోతున్నారనే ఇండికేషన్ ఇచ్చినట్టు కనిపిస్తోందంటున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. సీఎంకి అత్యంత సన్నిహితుడని చెప్పుకుంటారు. మేటర్‌ ఏదైనా.. ఇద్దరూ చర్చించే నిర్ణయాలు తీసుకుంటారన్న అభిప్రాయం ఉంది చాలామంది మంత్రులకు. కానీ.. తాజాగా పొంగులేటికే.. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి అంటూ చెప్పేశారట రేవంత్‌.

Read Also: Sekhar Kammula : అందుకే ధనుష్ అంటే టెన్షన్.. శేఖర్ కమ్ముల కామెంట్స్

ఇక, పొంగులేటికి ఆయన అలా చెబుతారని అస్సలు ఊహించలేదని ఒకరిద్దరు మంత్రులు కామెంట్‌ చేసినట్టు తెలిసింది. ఆ టైంలో.. మంత్రి శ్రీనివాసరెడ్డి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినా.. సీఎం ఆ ఛాన్స్‌ ఇవ్వలేదని చెప్పుకుంటున్నారు. ఆ విధంగా సీఎం కేబినెట్‌ మీద పట్టు సాధిస్తున్నారన్నది ఒక వెర్షన్‌. ముఖ్యమంత్రి మెల్లిగా.. అన్నిటినీ టైట్‌ చేసే పనిలో ఉన్నట్టు కనిపిస్తోందని అ్ననారో మంత్రి. ఇలా, కారణం ఏదైనా.. ఢిల్లీ పర్యటన తర్వాత రేవంత్‌రెడ్డిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోందన్నది ఇన్‌సైడ్‌ టాక్‌.

Exit mobile version