Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record Over Brs Situation In Serilingampally

Off The Record: బలమైన కమ్మ నేత కోసం బీఆర్ఎస్ చూస్తోందా?

Published Date :May 6, 2025 , 8:39 pm
By Chandra Shekhar Pamena
  • 2023 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ తరపున అరికెపూడి గాంధీ విజయం
  • కాంగ్రెస్‌లోకి జంప్‌, పీఏసీ ఛైర్మన్‌ పోస్ట్‌
  • బీఆర్ఎస్‌ కోటాలోనే పదవి వచ్చిందంటున్న గాంధీ
  • టెక్నికల్‌ మాటలు తప్ప శేరిలింగంపల్లిలో పట్టించుకోని వైనం
  • నాడు బీఆర్‌ఎస్‌ కోసం పని చేసినవాళ్ళంతా నేడు గాంధీ వెంటే
  • వరంగల్‌ సభకు జన సమీకరణ కోసం పక్క నియోజకవర్గం ఎమ్మెల్యే
  • ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు శేరిలింగంపల్లి వైపు చూస్తున్నారా?
  • శంభీపూర్‌కు శేరిలింగంపల్లి టిక్కెట్‌ సాధ్యమేనా?
  • కమ్మ సామాజికవర్గం కీలకంగా ఉన్న శేరిలింగంపల్లి
  • గెలుస్తున్న ఎమ్మెల్యేలంతా కమ్మ వాళ్ళే
  • బలమైన కమ్మ నేత కోసం బీఆర్‌ఎస్‌ చూస్తోందా?
Off The Record: బలమైన కమ్మ నేత కోసం బీఆర్ఎస్ చూస్తోందా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Off The Record: అక్కడ కారు స్టీరింగ్‌ పట్టుకునే దిక్కు కరవైందా? పవర్‌లో ఉన్నప్పుడు అంతా మేమేనని హవా నడిపిన వాళ్ళు ఇప్పుడు తాళాలు పక్కనపడేసి వెళ్ళిపోయారా? తెలంగాణలోనే అతిపెద్దదైన, అత్యధిక ఓటర్లు ఉన్న ఆ సెగ్మెంట్‌లో…బీఆర్‌ఎస్‌కు ఎందుకా పరిస్థితి వచ్చింది? చివరికి పార్టీ జెండా దిమ్మె దగ్గరకు వచ్చే నాయకుడు లేనంతగా దిగజారిపోయిన ఆ సెగ్మెంట్‌ ఏది?

Read Also: Lakshmi Narayana: మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డికి ఏడేళ్ల జైలు శిక్ష.. స్పందించిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ

మేడ్చల్ జిల్లా శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం… తెలంగాణలోనే అత్యంత ఖరీదైన సెగ్మెంట్‌. ఐటీ సెక్టార్ విస్తరించిన ఏరియా. అత్యధిక జనసాంద్రత కలిగిన ప్రాంతం. అలాంటి శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఇప్పుడు బీఆర్ఎస్ ఉనికి ప్రశ్నార్థకమైంది. 2023 ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అరికెపూడి గాంధీ… తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. అసెంబ్లీ పీఏసీ ఛైర్మన్ పోస్ట్ దక్కించుకున్నారాయన. కానీ… తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని, ఆ పార్టీ కోటాలోనే తనకు పీఏసీ ఛైర్మన్‌ పోస్ట్ దక్కిందని చెబుతుంటారు గాంధీ. టెక్నికల్‌గా ఆయన అలా చెప్పినా….వాస్తవంలో మాత్రం పార్టీకి దూరమయ్యారన్నది లోకల్‌ కేడర్‌ మాట. గతంలో శేరిలింగంపల్లి బీఆర్‌ఎస్‌కు అంతా తానై వ్యవహరించేవారు గాంధీ. కానీ, ఇప్పుడాయన పార్టీకి దూరం కావడంతో పెద్ద దిక్కు కరవైంది. గతంలో బీఆర్‌ఎస్‌ కోసం పనిచేసిన నేతలంతా ఇప్పుడు అధికార పార్టీతో ఉన్న అరికెపూడి గాంధీ వెంటే తిరుగుతున్నారు. వరంగల్‌లో జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు.. అన్ని నియోజకవర్గాల్లో సన్నాహాలు చేయగా… శేరిలింగంపల్లిలో మాత్రం ఆ ఊసే లేదు. ఇక చివరి నిమిషంలో పక్క నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణా రావుకు బాధ్యతలు అప్పగించి జనసమీకరణ జరిపారట. నియోజకవర్గంలో పార్టీకి పూర్తి స్థాయి నాయకుడు లేకపోవడంతో కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నట్టు సమాచారం.

Read Also: Sindhu river: పాకిస్తాన్‌కి మరో షాక్.. “సింధు నదుల”పై 6 ప్రాజెక్టుల పనులు వేగవంతం..

అయితే, అధికారంలో ఉన్నప్పుడు ఐటీ సెక్టార్‌లో అంతా తానై… కేటీఆర్ ఇష్టంగా ఇక్కడ కార్యక్రమాలు చేశారని కార్యకర్తలు గుర్తు చేసుకుంటున్నారు. అలాంటి చోట ఇప్పుడు పార్టీ జెండా దిమ్మె దగ్గరికి వచ్చే దిక్కు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కార్యకర్తలు. మరోవైపు మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు ప్రస్తుతం శేరిలింగంపల్లి వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది.దీంతో రాబోయే రోజుల్లో ఆయనే శేరిలింగంపల్లి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉంటారా అనే చర్చ మొదలైంది. అదే సమయంలో అదంత తేలికైన వ్యవహారం కాదన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం ఓటర్లు ప్రభావం ఎక్కువ. వాళ్ళు ఎటు మొగ్గితే ఆ పార్టీదే విజయం. అందుకు తగ్గట్టే… కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు.

Read Also: Robinhood: మే 10న ZEE5, జీ తెలుగులో రాబిన్‌హుడ్

కాగా, ఈ లెక్క ప్రకారం చూసుకుంటే… పార్టీ అధిష్టానం శంభీపూర్‌కు అవకాశం ఇవ్వకపోవచ్చన్న అభిప్రాయాలు సైతం ఉన్నాయి. అదే సామాజికవర్గానికి చెందిన బలమైన నాయకుడి కోసం చూస్తున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే గాంధీతో పాటే జీహెచ్ఎంసి కార్పొరేటర్లు తొమ్మిది మంది కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ నియోజకవర్గంలో ఇప్పుడు ఒకే ఒక కార్పొరేటర్ గులాబీ పార్టీలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో…. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రాజకీయాల్లో కీలకంగా ఉన్న శేరిలింగంపల్లి బాధ్యతలు గులాబీ బాస్ ఎవరికి అప్పగిస్తారనేది ఆసక్తిగా మారింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BRS
  • hyderabad
  • off the record
  • OTR
  • Serilingampally

తాజావార్తలు

  • Shell India: వాహనదారులకు షెల్ ఇండియా షాక్.. డీజిల్ ధర రూ. 25, పెట్రోల్ ధర రూ. 7.41 పెంపు

  • Ration Dealers: రేషన్ డీలర్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు ఇలా..

  • Hanuman Jayanti: రేపు హనుమాన్ శోభాయాత్ర.. హైదరాబాద్‌లోని ఈ ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..

  • Carmeni Selvam: అప్పుల్లో ఉన్నవారికి ధైర్యాన్నిచ్చే ‘కార్మేని సెల్వం’

  • Alwar Bride: పెళ్లైన నెలకే ఖిచిడీలో ఫినాయిల్ కలిపి అత్తకు పెట్టిన కొత్త కోడలు.. నగదు, నగలతో పరార్

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions