Off The Record : బండి సంజయ్‌కు బీజేపీ హైకమాండ్ ఫుల్ సపోర్ట్?
- కొడుకు ఎపిసోడ్లో సంజయ్‌ని టార్గెట్ చేసిన బీఆర్ఎస్
- కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్
- తొలి రెండు రోజులు బీజేపీ కామ్, తాజాగా స్టాండ్ ఛేంజ్
- బండిని సపోర్ట్ చేస్తూ గట్టిగా మాట్లాడిన రామచంద్రరావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొడుకు కేసు విషయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు కమలం అధిష్టానం బాసటగా నిలిచిందా? సడన్‌గా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి కౌంటర్ ఎటాక్‌కు కారణం అదేనా…? బండి సంజయ్ తప్పు చేయలేదు, దాన్ని రాజకీయం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని పార్టీ వైపు నుంచి స్టేట్మెంట్ రావడం వెనక ఢిల్లీ పెద్దల ప్రమేయం ఉందా? లెట్స్ వాచ్. కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు భగీరథ్ ఎపిసోడ్ తెలంగాణలో రాజకీయ దుమారం రేపుతోంది. ఆ విషయంలో సంజయ్ టార్గెట్‌గా బీఆర్ఎస్ ఆందోళన చేస్తోంది. ఏకంగా బండిని కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తోంది ప్రతిపక్షం. అందుకు సంబంధించి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా… మొదటి రెండు రోజులు కాస్త సంయమనం పాటించింది తెలంగాణ బీజేపీ. కానీ…తాజాగా స్టాండ్ మార్చినట్టు కనిపిస్తోంది. ముందు అగ్రెసివ్‌గా మాట్లాడని నాయకులు…సోమవారం మాత్రం స్టాండ్ మార్చారు.
అసలు ఆ విషయంలో పార్టీ వైఖరి ఏంటన్నది అర్ధంకాక తొలి రెండు రోజులు పార్టీ శ్రేణులు కూడా గందరగోళంలో ఉన్నాయి. రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించినా…. గట్టిగా మాట్లాడలేదు. దీంతో పార్టీ హై కమాండ్ ఏమనుకుంటోంది, సీరియస్‌గా ఉందా సానుకూలంగా ఉందా అనే సందేహాలు వ్యక్తం అయ్యాయి. ఆ విషయంలో పార్టీ వైపు నుండి స్పష్టత రావాలని… బలమైన కౌంటర్ ఇవ్వాలని కూడా కమలం శ్రేణులు కోరుకున్నాయి. ఈ క్రమంలోనే…. రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు సోమవారంనాడు పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదే సమయంలో బండి సంజయ్‌ని సపోర్ట్ చేస్తూ… గట్టిగా మాట్లాడారాయన. బీఆర్ఎస్ మీద కౌంటర్ ఎటాక్ చేశారు. బండి సంజయ్ తప్పు చేయలేదని చెబుతూ…, పార్టీ ఆయనకు అండగా ఉంటుందని సంకేతాలు ఇచ్చారు. కేంద్ర మంత్రి కుటుంబ సభ్యులు తప్పు చేస్తే… న్యాయ పరంగా చూసుకుంటారని కూడా చెప్పారు రామచంద్రరావు.
Also Read
ఆ విషయంలో మాట్లాడ్డానికి అసలు బీఆర్ఎస్కు నైతిక హక్కు లేదని మండిపడ్డారు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్. కొడుకు ఎపిసోడ్‌తో ముడిపెట్టి సంజయ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారని, మరి ఢిల్లీ మద్యం కేసులో కవిత జైలుకు వెళ్ళినప్పుడు కేసీఆర్, కేటీఆర్ రాజీనామా చేశారా అంటూ రివర్స్ అటాక్ మోడ్‌లోకి వచ్చేశారాయన. బీజేపీని బద్నాం చేయాలనుకుంటే చూస్తూ ఊరుకునేది లేదని కూడా స్పష్టం చేశారు రామచంద్రరావు. దీంతో… ఈ రియాక్షన్ మీద ఇటు బీజేపీ, అటు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాష్ట్ర అధ్యక్షుడు అంత గట్టిగా మాట్లాడారంటే…. బండి సంజయ్‌కు పార్టీ కేంద్ర నాయకత్వపు సపోర్ట్ ఉందన్న విషయం స్పష్టంగా తెలుస్తోందని అంటున్నారు. ఢిల్లీ పెద్దలతో మాట్లాడిన తర్వాతే రామచందర్‌రావు ఈ అంశం పై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయ్యారన్నది ఇన్సైడ్ టాక్. ఓవరాల్‌గా…. కొడుకు తప్పు చేస్తే… అందుకు చట్టపరమైన, న్యాయపరమైన చర్యలుంటాయిగానీ… తండ్రిని బాధ్యుడిని చేస్తే ఎలాగన్నది తెలంగాణ బీజేపీ నేతల క్వశ్చన్.
- Tags
తాజావార్తలు
-
Off The Record : బండి సంజయ్‌కు బీజేపీ హైకమాండ్ ఫుల్ సపోర్ట్?
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్‌కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
-
RR Vs LSG: మార్ష్ వీర విహారం.. రాజస్థాన్ రాయల్స్ ముందు భారీ టార్గెట్..
-
Chairmans Desk : ప్రపంచమంతా మాంద్యం గుప్పిట్లో ఉంటే.. దక్షిణాది మాత్రం సేఫ్ జోన్లోనే ఉందా..? |
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!