Off The Record : మమతా బెనర్జీని ఎంఐఎం టెన్షన్ పెడుతోందా?
- మజ్లిస్.. బీజేపీకి బద్ధ విరోధి అన్న అభిప్రాయం
- మైనార్టీ హక్కులకు రక్షణ కవచమని చెప్పే ఎఐఎం పెద్దలు
- బీజేపీకి బీ టీమ్ అంటూ కాంగ్రెస్ మిత్రుల విమర్శలు
- ముస్లిం ఓట్లు చీల్చి బీజేపీకి లబ్ది చేకూరుస్తోందని ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ పతంగి మాంజాతో హౌరాలో గడ్డిపూలకు కోత పడుతుందా? ఎంఐఎం పార్టీ…. తృమూల్ గెలుపు అవకాశాలను దెబ్బ తీస్తుందా? పతంగిని తల్చుకుంటే…. మమతకు ముచ్చెమటలు పడుతున్నాయా? ఏంటా పొలిటికల్ ఈక్వేషన్? పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ ఎందుకు చర్చనీయాంశమైంది? మహామహులను ముప్పు తిప్పలు పెట్టే మమతా బెనర్జీ హైదరాబాద్ పార్టీని చూసి ఎందుకంత భయపడున్నారు? లెక్కలు ఎక్కడ తేడా కొడుతున్నాయి? హైదరాబాద్ గడ్డమీద పురుడు పోసుకున్న మజ్లిస్ పార్టీని సహజంగానే బీజేపీ వ్యతిరేకి అనుకుంటారు అంతా. అందుకు తగ్గట్టే, ఇంటా బయటా….. అంటే…. లోక్‌సభలో, అసెంబ్లీలో, ఇతర ఏ వేదికల మీదైనా ఎంఐఎం నేతలు, ప్రధానంగా అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఒవైసీ బీజేపీ విధానాలపై విరుచుకుపడుతుంటారు. ముస్లిం సమాజాన్ని రక్షించడానికి ఉన్న ఏకైక పార్టీ తమదే అన్నట్లుగా కార్యక్రమాలు చేస్తారు. మైనార్టీ హక్కుల రక్షణ కవచంగా నిలుస్తారు. అలాంటి ఎంఐఎం పార్టీని కాంగ్రెస్ మిత్రపక్షాలు మాత్రం బీజేపీ బీ టీమ్‌గా అభివర్ణిస్తుంటాయి. కాషాయ పార్టీ కనుసన్నల్లోనే పలు రాష్ట్రాల్లో ఎంఐఎం పోటీ చేసి తమ గెలుపును అడ్డుకుందని, ముస్లిం ఓట్లను చీల్చి బీజేపీకి లబ్ది చేకూర్చుతోందని అటాక్ చేస్తున్నారు కాంగ్రెస్ మిత్రులు. ఆ మధ్య జరిగిన బీహార్ ఎన్నికల్లో 25 స్థానాలకు పోటీచేసిన మజ్లిస్… 5చోట్ల విజయం సాధించింది. మిగతా 20స్థానాల్లో తమ గెలుపును ప్రభావితం చేసిందన్నది మిగతా పార్టీల ఆరోపణ. అలాగే 2022 యూపీ ఎన్నికల్లో 95అసెంబ్లీ స్థానాల్లో పోటీచేసిన ఎంఐఎం.. ఒక్క స్థానం గెలుచుకోలేకపోయిననప్పటికీ కాంగ్రెస్ మిత్రుల విజయవకాశాలను దారుణంగా దెబ్బతీసింది. అంతకు ముందు గుజరాత్లో కూడా ఇదే రకంగా చేసిందనేది కాంగ్రెస్ మిత్రుల ఆరోపణ. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి సాంప్రదాయకంగా ముస్లిం ఓటు బ్యాంక్ కాంగ్రెస్ వైపే ఉంటుందన్నది స్థిరమైన రాజకీయ అభిప్రాయం.
కానీ…. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక సీన్ మారిపోయింది. ఎంఎంఐ, బీజేపీ సైద్దాంతిక విభేదాలు ఉన్న పార్టీలు అయినప్పటికీ లోపాయికారీగా సహకరించుకుంటున్నాయని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ మిత్రులు. కానీ… అలాంటి ఆరోపణలు వచ్చిన ప్రతిసారీ… ఎంఐఎం స్ట్రాంగ్‌గానే కౌంటర్ ఇస్తోంది. ఒక రాజకీయ పార్టీగా ఎక్కడైనా పోటీచేసే అవకాశం ఉందని, అది ఒంటరిగా అయినా, లేదా ఎవరితో కలిసి అయినా పోటీచేస్తామన్నది వాళ్ళ వెర్షన్. దానివల్ల సహజంగానే కొందరికి మంచి, కొందరికి చెడుజరుగుతాయని, అందుకు తామెలా భాద్యులం అవుతామని ప్రశ్నిస్తోంది పతంగి పార్టీ. ఈ చర్చల నడుమే… తాజాగా పశ్చిమబెంగాల్ ఎపిసోడ్ తెర మీదికి వచ్చింది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో 182స్థానాలకుపైగా పోటీ చేయడానికి రంగం సిద్ధం చేస్తోంది ఎంఐఎం. ఒక రకంగా ఇది తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీకి రాజకీయంగా ముచ్చెమటలు పట్టించే అంశమేనని అంటున్నారు. అంతకు ముందు లెప్ట్ పార్టీలతో, తర్వాత రెండు అసెంబ్లీ ఎన్నికల నుంచి బీజేపీతో కలబడుతున్న మమతకు ప్రధాన ఓటు బ్యాంకు మైనార్టీ ఓటర్లే. అలాంటిది ఇప్పుడు బెంగాల్లో ఎంఐఎం 182 స్థానాలకు పోటీచేస్తే,, కచ్చితంగా ఆ ప్రభావం టీఎంసీ మీద ఉంటుందన్న విశ్లేషణలు పెరిగిపోతున్నాయి. దీంతో…. గతంలో జరిగిన కొన్ని అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం ప్రభావంతో దెబ్బతిన్న కాంగ్రెస్ మిత్రుల్లాగే మమత కూడా మిగిలిపోతారా లేదా కమలాన్ని, పతంగిని కలిపి హౌరా బిడ్జి కిందకు తోసేస్తారా అన్నది చూడాలంటున్నారు పొలిటికల్ పండిట్స్. మొత్తం మీద హైదరాబాద్ పతంగి పార్టీ…. దేశంలో ఏ ఎన్నికలు జరిగినా… హడలెత్తిస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదన్నది పొలిటికల్ వాయిస్.
Also Read
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్‌పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్‌నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?