El Nino : తెలంగాణలో సెప్టెంబర్ సెగ.. 2 రోజుల్లో మరో 2 డిగ్రీలు పెరిగే ఛాన్స్.!
- తెలంగాణలో సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు
- నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లో 35 డిగ్రీల నమోదు
- హైదరాబాద్‌లోనూ 34 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రత
- రెండు రోజుల్లో మరో 2 డిగ్రీలు పెరిగే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
El Nino : తెలంగాణ వ్యాప్తంగా సెప్టెంబర్ నెలలోనే అకాల భానుడి భగభగలు మొదలయ్యాయి. సాధారణంగా నమోదవాల్సిన ఉష్ణోగ్రతల కంటే 3 నుంచి 4 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు అధికంగా రికార్డవుతుండటంతో రాష్ట్ర ప్రజలు ఉక్కపోత, తీవ్ర వేడితో అల్లాడిపోతున్నారు. ఎల్ నినో (El Niño) ప్రభావం కారణంగానే వాతావరణంలో ఈ తరహా ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయని, పగటి ఉష్ణోగ్రతలు అసాధారణ రీతిలో పెరుగుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు.
జిల్లాల్లో సెగలు.. హైదరాబాద్‌లోనూ దంచికొడుతున్న ఎండ
రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుతున్నాయి. ప్రధానంగా నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో గరిష్ఠంగా 35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇది సాధారణం కంటే ఏకంగా 4 డిగ్రీలు అధికం కావడం గమనార్హం. అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 34 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు కాగా, రాజధాని హైదరాబాద్‌లోనూ భానుడి ప్రతాపం గట్టిగానే కనిపిస్తోంది. నగరంలో సాధారణంగా నమోదయ్యే 31.8 డిగ్రీల సెల్సియస్‌కు బదులుగా ప్రస్తుతం ఉష్ణోగ్రత 34 డిగ్రీలకు చేరుకోవడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Also Read
మరో 2 డిగ్రీలు పెరిగే ఛాన్స్.. వాతావరణ శాఖ అలెర్ట్
ప్రస్తుతం కనిపిస్తున్న ఈ అకాల వేడి తీవ్రత ఇక్కడితో ఆగదని, రానున్న రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరో 2 డిగ్రీల మేర అదనంగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఎల్ నినో ప్రభావం వల్లనే ఈ విపరీత మార్పులు సంభవిస్తున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అనవసరంగా మధ్యాహ్న సమయంలో బయటకు రాకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
El Nino : తెలంగాణలో సెప్టెంబర్ సెగ.. 2 రోజుల్లో మరో 2 డిగ్రీలు పెరిగే ఛాన్స్.!
-
Meg Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
-
Nepal Floods: నేపాల్‌లో జల ప్రళయం.. విరిగిపడ్డ కొండచరియలు.. మూడు రోజుల్లో ఎంత మంది చనిపోయారంటే!
-
NEET UG 2027: గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా?.. నీట్ 2027 ప్యాటర్న్ పూర్తిగా మారబోతోందా?
-
Antera Closed: ఎన్టీవీ ఎఫెక్ట్.. చివరకు మూతపడిన ‘అంతేరా’.!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!