OTR: దసరాలోపు పదవుల భర్తీ పూర్తి చేసే ఆలోచన?
- నామినేటెడ్ పదవుల భర్తీ రేపో మాపో అన్నంత దగ్గరికి
- వాయిదా పర్వంతో కేడర్‌లో పెరుగుతున్న అసంతృప్తి
- దసరా లోపు పదవుల భర్తీ పూర్తి చేసే ఆలోచన?
- ఒకేసారి రెండు మూడు వేల మందికి పదవుల ప్రకటన
- 37 కార్పొరేషన్స్ ఛైర్మన్లలో ఐదుగురికే రెన్యువల్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో నామినేటెడ్ పదవు భర్తీ వ్యవహారం కొలిక్కి వచ్చిందా? ఇన్నాళ్లు ఎప్పటికప్పుడు వాయిదా పడుతున్నా…ఇక సమయం లేదు మిత్రమా అంటున్నారా? ఆల్రెడీ లిస్ట్ మొత్తం సిద్ధమైపోయి కేవలం ఢిల్లీ స్టాంప్ కోసం ఎదురు చూస్తోందా? వాయిదాల కారణంగా పెరుగుతున్న అసంతృప్తిని పసిగట్టిన అగ్ర నాయకత్వం ఇక డూ ఫెస్టివల్ అంటోందా? ఇంతకీ భర్తీ ఎప్పుడు?
తెలంగాణలో నామినేటెడ్ పోస్టుల భర్తీ కొలిక్కి వస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల హస్తినకు వెళ్లిన పిసిసి చీఫ్ మహేష్ గౌడ్…ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌తో కొన్ని పదవులకు ఆమోద ముద్ర వేయించినట్టు చెప్పుకుంటున్నారు. భర్తీ విషయమై ఎప్పటికప్పుడు వాయిదా పర్వం నడుస్తున్న క్రమంలో కాంగ్రెస్ కేడర్ బాగా అసంతృప్తితో ఉంది. ఆ సంగతి గ్రహించిన అధిష్టానం వీలైనంత త్వరగా పని పూర్తి చేయాలన్న ఆలోచనతో ఉందట. అధికారంలో ఉండి కూడా…. పదవులు ఇవ్వకపోవడంతో వృధాగా కాలం గడిచిపోతోందన్న చర్చ పెరుగుతోంది. ఇన్నాళ్లు వాయిదా వేసిన ప్రతిసారి… ఈ నెలాఖరు వరకు అని చెప్పుకుంటూ వస్తున్నారు పీసీసీ అధ్యక్షుడు.
Also Read
ఇక మీదట ఇలాంటి స్టేట్మెంట్స్తో కాలం వెళ్ళదీయడం కష్టమైన పనిగానే కనిపిస్తోంది. దీంతో… దసరా లోపు పదవుల్ని భర్తీ చేయాలన్న ఆలోచనకు పార్టీ పెద్దలు వచ్చినట్టు తెలుస్తోంది. వివిధ సంస్థల డైరెక్టర్స్ నియామకం, కార్పొరేషన్ చైర్మన్స్ ఎంపిక కోసం ఇప్పటికే కొంత కసరత్తు జరిగింది. నియోజకవర్గాల వారీగా పేర్లు తీసుకుని లిస్ట్ సిద్ధం చేశారట. ఆ రకంగా ఒకే సారి.. రెండు.. మూడు వేల మంది పార్టీ నాయకులకు పదవులు ఇచ్చి పండగ వాతావరణం కల్పించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.
సాధారణంగా పార్టీలో పదవుల భర్తీ వ్యవహారాన్ని PCC చీఫ్ మహేష్ గౌడ్… సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ పర్యవేక్షిస్తారు. ఈ క్రమంలో ఇప్పటికే అన్ని నియోజకవర్గాల నుంచి ఆశావహుల జాబితా సిద్ధంగా ఉంది కాబట్టి…త్వరలోనే ఢిల్లీకి వెళ్ళి ఆమోదముద్ర వేయించే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే… పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తల్లో ఇచ్చిన 37 కార్పొరేషన్ల ఛైర్మన్స్ పదవీ కాలం ముగిసింది. వీరిలో కొందరికి రెన్యువల్ చేయాల్సి ఉంది. ఆ రెన్యువల్ జాబితా పై కూడా వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవచ్చని అంటున్నారు. మహా… అయితే వాళ్ళలో ఐదుగురికి మించి తిరిగి ఇవ్వకపోవచ్చని అంటున్నారు. ఏది ఏమైనా…. అన్నిటినీ కలిపి ఒకేసారి అతి త్వరలోనే లిస్ట్ విడుదల చేయవచ్చంటున్నారు. సో… కాంగ్రెస్ లీడర్స్….. డూ ఫెస్టివల్.
తాజావార్తలు
-
OTR: దసరాలోపు పదవుల భర్తీ పూర్తి చేసే ఆలోచన?
-
Best Postal Scheme: బెస్ట్ పోస్టాఫీస్ స్కీమ్.. రూ.2 లక్షలకు రూ. 4 లక్షల లాభం..
-
Election Commission: విభేదాలకు కారణమైన ఫారం 6పై ఈసీఐ ఫుల్ క్లారిటీ..
-
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డికి ప్రతిష్టాత్మక ‘ఆర్యదాన్ ముహమ్మద్’ పురస్కారం
-
Ram Charan: మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రామ్ చరణ్ చేతికి రాడ్స్ తొలగింపు.. సెట్స్‌పైకి రీఎంట్రీ ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!