Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record Controversy On Mla Rohith Reddy Speed

Off The Record: ఆ ఎమ్మెల్యేకి ఎందుకంత స్పీడ్

Published Date :April 22, 2023 , 6:43 pm
By NTV WebDesk
Off The Record: ఆ ఎమ్మెల్యేకి ఎందుకంత స్పీడ్
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఆ ఎమ్మెల్యే తీరు పదే పదే ఎందుకు వివాదాస్పదం అవుతోంది? చీటికి మాటికి చిల్లర గొడవలతో ఎందుకు వార్తలకెక్కుతున్నారు? ఎమ్మెల్సీతో ఆధిపత్య పోరు ఉంటే… ఆ స్థాయిలోనే చూసుకోవాలిగానీ…గ్రామ స్థాయికొచ్చి కొట్లాడితే ఏం ఉపయోగం అనిపించుకుంటున్న ఆ ఎమ్మెల్యే ఎవరు? ఎందుకలా చేస్తున్నారు?

భద్రేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ముష్టి ఘాతాలు?
వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి వరుసగా వార్తల్లో నిలుస్తున్నారు. అలాగని అదేదో… జనానికి మంచి చేసికాదు. వాళ్ళని ఇబ్బంది పెడుతూ తానేదో హీరో అనిపించుకోవాలనుకుంటున్నారట ఆయన. ఇటీవల ఎమ్మెల్యే చేస్తున్న పనులు గ్రామాల్లో అసహనాన్ని పెంచుతున్నాయట. ఇప్పటికే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా రాజకీయ విరోధం ఉంది. దానికి తోడు స్థానిక భద్రేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో నేతల మధ్య గొడవ జరిగింది. హారతి సమయంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిని చేతితో నెట్టి వేసే ప్రయత్నం చేశారట. దాంతో ఇద్దరూ కాసేపు రోడ్‌సైడ్‌ తోపులాట స్థాయిలో తలపడ్డారట.

పని అడిగిన గ్రామస్తుల్ని ఎమ్మెల్యే బెదిరిస్తున్నారా?
కొంత కాలంగా పల్లె పల్లెకు పైలెట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి. అందులో భాగంగా బషీరాబాద్ మండలం మైలవరంలో రోహిత్ రెడ్డి వ్యవహార శైలి గ్రామస్థులకు ఆగ్రహం తెప్పించిందట. స్థానిక అక్కలమ్మ చెరువు తూము పనులు నిలిచిపోవడంతో సాగు చేయడం లేదని… సమస్యను ఎప్పుడు పరిష్కరిస్తారని ఎమ్మెల్యేని ప్రశ్నించారట గ్రామస్తులు. అయితే పరిష్కారం
చెప్పకుండా, ప్రశ్నించిన వారిని స్టేజి దిగిపోవాలని వార్నింగ్ ఇవ్వడం, పోలీసులను పురమాయించి మరీ కిందికి దింపడంపై కోపంతో ఉన్నారట గ్రామస్తులు. నిరుడు కూడా ఇలాంటి ఘటనే జరిగింది.ఇదే మండలంలోని క్యాద్గిర సర్పంచ్ ను ప్రజల మధ్యలోనే ఎమ్మెల్యే బెదిరించారు. అభివృద్ధికి అడ్డుపడితే చూస్తూ ఊరుకోను అంటూ చిందులు వేశారు. పీడీ యాక్ట్ పెట్టిస్తానంటూ బెదిరించారట ఎమ్మెల్యే.

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య బహిరంగ సవాళ్ళు
అటు తాండూరు బీఆర్ఎస్‌లో రోజు రోజుకు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మధ్య వర్గ పోరు పెరుగుతోంది. నువ్వెంత అంటే నువ్వెంత అని వేదికల మీదే కొట్లాడుకుంటున్న ఘటనలు ఉన్నాయి. బయటికి రా చూసుకుందాం అంటూ ఒకరికొకరు సవాళ్ళు విసురుకుంటున్నారు. గొట్టిగఖుర్దులో పల్లె పల్లెకు పైలెట్ కార్యక్రమాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి… సమావేశంలో ఎమ్మెల్సీ వర్గానికి చెందిన గ్రామ ఉప సర్పంచ్‌కు స్టేజీ మీద కుర్చీ ఇవ్వలేదని సర్పంచే ఆగ్రహం వ్యక్తం చేశారట. బహిరంగంగా ఎమ్మెల్యే ముందే స్థానిక నాయకులు తిట్టుకుంటూ బయటికి వచ్చేశారట. దీంతో కార్యక్రమం ప్రారంభించకుండానే ఎమ్మెల్యే వెళ్ళిపోయారట. రోహిత్‌రెడ్డి చేసిన పనికి స్థానిక నాయకులు కొట్టుకుని చొక్కాలు చించుకున్నారట. కక్షపూరితంగానే ఎమ్మెల్యే వర్గీయులు ఎమ్మెల్సీ మనుషులను అవమానిస్తున్నారని , ప్రోటోకాల్ పాటించడం లేదని అసహనంగా ఉన్నారట మహేందర్‌రెడ్డి వర్గీయులు.

ప్రచారం కోసమే ఎమ్మెల్యే అలా చేస్తున్నారా?
నియోజకవర్గంలో జరుగుతున్న వరుస సంఘటనలు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ప్రచారం కోసం చేయిస్తున్నారా? లేక కాకతాళీయంగా జరుగుతున్నవా అన్నది అర్ధం కావడం లేదని వాపోతున్నారట స్థానిక బీఆర్‌ఎస్‌ నాయకులు. ఇది పార్టీకి నష్టం చేస్తుందని టెన్షన్‌ పడుతున్నారట. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మీద పైచేయి సాధించాలంటే… వేరే మార్గాలున్నాయని, ఇలా గ్రామ స్థాయిలో సిల్లీగా గొడవలు పెట్టుకుంటే నష్టమే తప్ప ఏం ఉపయోగం అంటున్నారట పార్టీ నేతలు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BRS
  • cm kcr
  • off the record
  • Rohith Reddy
  • telangana

తాజావార్తలు

  • Bro 2 Update: పవన్ కళ్యాణ్ ‘బ్రో 2’పై సముద్రఖని క్లారిటీ.. ఇంతకీ ఏమ్మన్నాడంటే?

  • Petrol and Diesel Prices Drop: గుడ్‌న్యూస్‌ చెప్పిన కేంద్రం.. పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకం భారీగా తగ్గింపు

  • Virat Kohli New Tattoo: ఐపీఎల్‌కు ముందు విరాట్ కోహ్లీ కొత్త టాటూ.. దాని అర్థం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

  • Anantapur Crime: సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ సమయంలో పోలీసులపై నిందితుల దాడి.. ఆత్మరక్షణ కోసం కాల్పులు..

  • RCB Name Change: ఆర్‌సీబీ పేరు మార్చే ఆలోచనలో కొత్త యాజమాన్యం.. నయా నేమ్ ఏంటో తెలుసా?

ట్రెండింగ్‌

  • Food Storage Tips : ఫ్రిడ్జ్‌లో మాంసం నిల్వ ఎంతకాలం సేఫ్.?పాడైన మాంసాన్ని గుర్తించే సింపుల్ టిప్స్.!

  • Soft Uttapam Tips : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ ‘ఉతప్పం’.. హోటల్ రుచి రావాలంటే ఈ చిన్న చిట్కాలు పాటించండి.!

  • JIO Offers: జియో నుండి భారీ ఆఫర్.. 3 నెలల రీచార్జ్‌కు 1 నెల ఫ్రీ..!

  • CSK Opening Pair 2026: సీఎస్‌కే ఓపెనింగ్ కాంబో ఫిక్స్.. ఆయుష్‌ మాత్రే అవుట్!

  • Ananya Birla-RCB: ఆర్‌సీబీతో లింక్ లేకపోయినా ట్రెండ్ అవుతోన్న అనన్య బిర్లా.. కారణం శుభ్‌మన్ గిల్‌!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions