AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేవారికి గుడ్ న్యూస్.. పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Panchayat Elections: ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులకు ఏపీ హైకోర్టు కీలక ఊరటనిచ్చింది. సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసేందుకు నామినేషన్లు దాఖలు చేయాలనుకునే అభ్యర్థులకు పోలీసు భద్రత కల్పించాలని ఆదేశించింది. నామినేషన్ల ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా తగిన రక్షణ కల్పించాలని స్పష్టం చేసింది. సర్పంచ్, వార్డు సభ్యులుగా నామినేషన్లు దాఖలు చేసేందుకు సిద్ధమైన పలువురు అభ్యర్థులు తమకు భద్రత కల్పించాలని కోరుతూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. నామినేషన్లు వేసేందుకు పోలీసు భద్రత కోరినప్పటికీ అధికారులు స్పందించడం లేదని పిటిషనర్లు తమ పిటిషన్లలో ఆరోపించారు.
ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అభ్యర్థులు పోలీసు భద్రత కోరుతూ ఈ-మెయిల్, వాట్సాప్ ద్వారా సమర్పించిన వినతులను పరిగణనలోకి తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించింది. నామినేషన్లు దాఖలు చేసేందుకు పిటిషనర్లకు తగిన పోలీసు భద్రత కల్పించాలని స్పష్టం చేసింది. దీంతో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే సమయంలో భద్రత కల్పించే విషయంలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చినట్లయింది. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే జరిగిన మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో నామినేషన్లు కూడా వేయనీయకుండా అడ్డుకున్న ఘటనలు వెలుగు చూడగా.. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులకు ఊరట దక్కినట్టు అయ్యింది..
Also Read
- Cyclone Akvan: దూసుకొస్తున్న అక్వాన్ తుఫాన్.. తీరం దాటేది ఇక్కడే..! అత్యంత భారీ వర్షాలు..
- Cyclone Akwan: దూసుకొస్తున్న అక్వాన్ తుఫాన్.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
- ZP Chairman Elections: జెడ్పీ చైర్మన్ పదవులపై ఉత్కంఠ.. టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య ఇంకా రాని క్లారిటీ..!
- CM Chandrababu Delhi Tour: మరోసారి ఏపీ సీఎం హస్తిన బాట.. కేంద్ర మంత్రులతో కీలక సమావేశాలు
తాజావార్తలు
-
Ganja Racket Busted: కూరగాయల వ్యాపారం మాటున గలీజు దందా.. భారీగా గంజాయి, నగదు స్వాధీనం..!
-
AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేవారికి గుడ్ న్యూస్.. పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు
-
SRH-IPL 2027: హెడ్‌కు గుడ్‌బై.. మరో 8 మంది అవుట్.. ఎస్ఆర్హెచ్ రిటెన్షన్, రిలీజ్, పర్స్ డీటెయిల్స్ ఇవే!
-
Trump Assassination Plot: ట్రంప్ హత్యకు కుట్ర.. పాకిస్థానీ వ్యక్తికి అమెరికాలో 27 ఏళ్ల జైలు శిక్ష!
-
MS Dhoni Drone Show: రెండు కళ్లు చాలవుగా చూడడానికి.. ధోనీ రెటైమెంట్తో ప్రత్యేక డ్రోన్ షో నిర్వహించిన సీఎస్కే..!
ట్రెండింగ్
-
IPL 2027 Retentions: ధోనీ ఔట్.. ట్రావిస్ హెడ్, స్టార్క్‌కు షాక్.. 10 జట్ల రిటెన్షన్, రిలీజ్, పర్స్ డీటెయిల్స్ ఇవే!
-
200MP కెమెరా, AMOLED సెకండరీ డిస్ప్లే, 6,000mAh బ్యాటరీతో Xiaomi 18 Pro లాంచ్..!
-
200MP+200MP కెమెరాలు, IP66+IP68+IP69 రేటింగ్స్, 7,050mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ Xiaomi 18 Pro Max లాంచ్..!
-
MS Dhoni IPL Retirement: నా ఆలోచన తప్పు అని ఫాన్స్ నిరూపించారు.. ఎంఎస్ ధోనీ ఎమోషనల్ పోస్ట్!
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!