Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record About Ysrcp Strategy For 2029 Jagan Rethinks Ticket Allocation After 2024 Election Defeat

Off The Record: 2029 కోసం జగన్ మాస్టర్ ప్లాన్..!

Published Date :March 17, 2026 , 9:30 pm
By Sudhakar Ravula
  • గత ఎన్నికల్లో కొందరు వైసీపీ సీనియర్స్‌ వారసులకు టిక్కెట్లు..
  • భూమన అభినయ్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, పేర్ని కిట్టు అందరికీ షాక్‌లే..
  • ఈసారి అనుభవం ఉన్నవాళ్ళనే బరిలో దించాలనుకుంటున్నారా?..
  • విషయం గ్రహించే సీనియర్స్‌ మళ్లీ యాక్టివ్‌ అయ్యారా?..
  • చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని మళ్ళీ చంద్రగిరికి పరిమితం చేస్తారా?..
  • ఈసారి చీపురుపల్లిలో కుమార్తెను పోటీచేయించాలనుకుంటున్న బొత్స..
  • కుమార్తెకు టిక్కెట్‌ అడగాలనుకుంటున్న కోలగట్ల..
  • వారసులను బరిలో దింపే యోచనలో ధర్మాన బ్రదర్స్‌..
  • కొడుకు కోసం మాజీ మంత్రి ఆదిమూలపు ప్రయత్నాలు..
  • ఆల్రెడీ తెర మీదికి వచ్చేసిన అంబటి, కాకాణి వారసురాళ్ళు..
  • తండ్రులే బరిలో ఉంటే బెటర్‌ అన్న స్థిరమైన అభిప్రాయంతో అధిష్టానం?..
Off The Record: 2029 కోసం జగన్ మాస్టర్ ప్లాన్..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Off The Record: 2024 ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న వైసీపీ ఈసారి ముందే అలర్ట్‌ అవుతున్నట్టు కనిపిస్తోంది. గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంటూ… విఫల ప్రయోగాలను ఇక పక్కన పెట్టాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. తమ వారసులకు రాజకీయ రాచబాట వేయాలని కలలుగంటున్న కొందరు వైసీపీ సీనియర్స్‌ గత ఎన్నికల్లో ఒక ఎక్స్‌పెరిమెంట్‌ చేశారు. పార్టీ అధిష్టానాన్ని ఒప్పించి తమ వార‌సులకు టికెట్లు ఇప్పించుకున్నారు. కానీ… ఫలితాలు మాత్రం పూర్తి రివర్స్‌లో వచ్చేసరికి ఈ విషయంలో హైకమాండ్‌ పునరాలోచిస్తోందట. తిరుపతిలో భూమన అభినయ్ రెడ్డి, చంద్రగిరిలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, మచిలీపట్నంలో పేర్ని కిట్టు, ఇలా బరిలో దిగిన వారసులందరికీ షాక్‌లు తగిలాయి. అందుకే… వచ్చే ఎన్నికల్లో అలాంటి ప్రయోగాలకు బ్రేక్ వేయాలన్న ఆలోచనలో ఉందట వైసీపీ హైకమాండ్. కీలక స్థానాల్లో… అనుభవం ఉన్న సీనియర్ నేతలనే బరిలోకి దించాలనుకుంటున్నట్టు సమాచారం. ఆ విషయాన్ని గ్రహించే కొంతమంది సీనియర్ లీడర్స్‌ మళ్లీ యాక్టివ్ అవుతున్నారన్న మాటలు వినిపిస్తున్నాయి పార్టీ వర్గాల నుంచి. తిరుపతిలో వైసీపీ కీల‌క నేత‌ భూమన కరుణాకరరెడ్డి గతానికి భిన్నంగా ఇటీవ‌ల యాక్టివిటీ పెంచారు. టీటీడీ స‌హా ప‌లు అంశాల‌పై ఎప్పటిక‌ప్పుడు స్పందిస్తున్నారాయన. దీంతో 2029 ఎన్నికల్లో ఆయనే బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారా అన్న చర్చ మొదలైంది రాజకీయ వర్గాల్లో.

ఇదే స‌మ‌యంలో మ‌రో కీల‌క‌ నాయకుడు పేర్ని నాని కూడా ఫుల్ స్వింగ్‌లోకి వ‌చ్చేశారు. ఎప్పటికప్పుడు పార్టీ వాయిస్ రెయిజ్ చేస్తూ తాను యాక్టివ్‌గా ఉన్న సంకేతాలిస్తున్నారు. తాను పోటీలో ఉండబోనని, ఈసారి కూడా కిట్టునే పోటీ చేస్తారని, తాను జగన్‌ ఆదేశాల ప్రకారం పనిచేసుకుంటూ వెళ్తానని నాని అంటున్నా… ఫైనల్‌గా ఏం జరుగుతుందో, జగన్‌ ఏమని ఆదేశిస్తారో చూడాలన్నది బందర్‌ వైసీపీ వాయిస్‌. ఇక గ‌త ఎన్నిక‌ల్లో ఒంగోలు ఎంపీగా పోటీ చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయ‌న కుమారుడు మోహిత్ రెడ్డి ఇద్దరూ ఓడిపోయారు. అయితే పార్టీ ఈసారి వాళ్ళిద్దరికీ టిక్కెట్స్‌ ఇస్తుందా లేక భాస్కర్‌రెడ్డినిని తిరిగి చంద్రగిరి రాజ‌కీయాల‌కు ప‌రిమితం చేస్తుందా అన్న చ‌ర్చ జ‌ర‌గుతోంది. అలాగే మాడుగుల నుంచి పోటీ చేసిన మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు కుమార్తె అనురాధ కూడా ఓడిపోవ‌టంతో అక్కడ సైచం క్వశ్చన్ మార్క్‌ ఉంది. ఈ చర్చ ఇలా జరుగుతుండగానే… మరికొందరు సీనియర్స్‌ వచ్చే ఎన్నికల్లో తమ వారసులతో పొలిటికల్‌ అరంగేట్రం చేయించాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో అందరికంటే ముందున్నారట బొత్స సత్యనారాయణ. ఈసారి తన కుమార్తెను చీపురుపల్లి నుంచి పోటీ చేయించాల‌న్న ప్లాన్‌లో ఆయన ఉన్నారట. అలాగే మాజీ ఉప సభాపతి కోలగట్ల వీరభద్రస్వామి తన కుమార్తెకి టికెట్ అడగాలని చూస్తున్నారు. శ్రీకాకుళంలో ధర్మాన సోదరులు తమ వార‌సుల‌ను బ‌రిలోకి దించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది..

ప్రకాశం జిల్లాకు చెందిన మాజీమంత్రి ఆదిమూల‌పు సురేష్ కూడా త‌న వార‌సుడిని పోటీలో నిల‌పాల‌ని చూస్తున్నారు. మాజీమంత్రి జోగి ర‌మేష్ వార‌సులు పొలిటిక‌ల్‌గా యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నారు.. ఇదే స‌మ‌యంలో మాజీ మంత్రులు అంబ‌టి రాంబాబు, కాకాణి గోవ‌ర్డన్ రెడ్డిల కుమార్తెలు కూడా అనూహ్యంగా పొలిటిక‌ల్ ప్రెజన్స్‌లోకి వ‌చ్చేయ‌టంతో ఈసారి వాళ్ళు టికెట్ రేసులో ఉంటారన్న అంచనాలున్నాయి. కానీ… కీలక స్థానాల్లో ప్రయోగాల‌కు వెళ్లకుండా తండ్రులే బరిలో ఉంటే… మంచి రిజల్ట్స్ వస్తాయని వైసీపీ హైకమాండ్ స్థిరమైన అభిప్రాయంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే స‌మ‌యంలో మ‌రో ఆసక్తికరమైన వ్యూహం కూడా రాజకీయ వర్గాల్లో చర్చకు వస్తోంది. కొన్ని చోట్ల సీనియర్ నేతలను ఎంపీలుగా పోటీ చేయించి అక్కడి అసెంబ్లీ టికెట్లు వారసులకు ఇవ్వాలన్న ఫార్ములా కూడా పరిశీలనలో ఉందట. దానికి జగన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తారా లేదా అన్న విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ లేదు. సీనియర్ నేతలను తప్పించి యువ‌ ర‌క్తంతో ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని టీడీపీ స‌హా కూట‌మి పార్టీలు చూస్తూంటే…. వైసీపీ మాత్రం అందుకు భిన్నంగా సీనియర్ నేత‌ల‌తో యుద్ధం చేయాలని అనుకుంటోంది. ఈ పరిస్థితుల్లో ఫైనల్‌ ఏం జరుగుతుందో, జగన్‌ ఎవరికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తారో చూడాలంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh political news
  • Andhra Pradesh politics 2029
  • Jagan Mohan Reddy political plan
  • Political heirs in YSRCP
  • YS Jagan Mohan Reddy 2029 strategy

తాజావార్తలు

  • Kakatiya University: కాలేజీలో సీనియర్ల వేధింపులు.. దొంగతనం చేశావని చేసిన అవమానం.. చివరకు యువతి..

  • Chana Dal Payasam: అమ్మమ్మల నాటి ఆరోగ్య రహస్యం.. పంచదార లేకుండా సింపుల్‌గా చేసుకొనే హెల్దీ పాయసం

  • Tragedy : హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన.. ప్రేమోన్మాది దాడి.. యువతి మృతి..!

  • Saggubiyyam Payasam: పంచదార అక్కర్లేదు.. ఎండలకి చలవ చేసే ‘హెల్దీ’ పాయసం ఇలా సింపుల్‌గా చేసుకోండి!

  • HAWALA MONEY: కారంపొడి చల్లి.. కత్తులతో బెదిరించి.. రూ. కోటితో జంప్

ట్రెండింగ్‌

  • Pomegranate Benefits: ప్రతిరోజూ ఒక దానిమ్మ పండు.. మీ శరీరానికి కలిగే అద్భుత ప్రయోజనాలు

  • Swaasa : మీ దగ్గు విని వ్యాధిని చెప్పేస్తుంది.! ఈ కొత్త AI టెక్నాలజీ గురించి తెలుసా.?

  • Ugadi Special : ఉగాది నాడు మనం వేప, బెల్లం ఎందుకు తింటామో మీకు తెలుసా?

  • Health Tips : బెండకాయతో కలిపి వీటిని అస్సలు తినకండి.. ఆరోగ్యానికి ప్రమాదకరం..!

  • Summer Tips : 40°+ ఎండలో కూల్‌గా ఉండాలంటే.. ఈ సమ్మర్ సీక్రెట్స్ ట్రై చేయండి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions