Off The Record: ఐదేళ్ల పాటు ఆ ఎమ్మెల్సీ ఆడిందే ఆట.. పాడిందే పాట.. ఇప్పుడు ఆయన ఆచూకీ లేదు..
- వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కుప్పం టీడీపీకి ఇబ్బందులు..
- అంతకంటే దారుణమైన స్థితిలో ప్రస్తుతం కుప్పం వైసీపీ..
- ప్రస్తుతం కుప్పం వైసీపీకి నాయకుడెవరు?..
- నాడు పెత్తనం చేసిన ఎమ్మెల్సీ భరత్ కోసం కేడర్ వెదుకులాట..
- ఇప్పుడే కదా.. అండ కావాల్సింది అంటున్న కార్యకర్తలు..
- కుప్పం మీద వైసీపీ దృష్టిపెట్టిన క్రమంలో భరత్‌కు ఎమ్మెల్సీ..
- గెలిపిస్తే భరత్‌ను మంత్రిని చేస్తానంటూ నాడు జగన్ ప్రకటన..
- 2024 ఫలితాల తర్వాత అడ్రస్‌లేని కుప్పం వైసీపీ నేతలు..
- కేరాఫ్ బెంగళూర్ అన్నట్టుగా కీలక నేతలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: కుప్పం పాలిటిక్స్ అంటే.. కేరాఫ్ సీఎం చంద్రబాబు నాయుడు. నిర్మొహమాటంగా మాట్లాడుకోవాలంటే… ఆయన అడ్డా అది.1989 నుంచి మొదలుపెట్టి ఇప్పటి దాకా ఓటమి ఎరగని నేతగా అక్కడ కొనసాగుతున్నారాయన. అలాంటి చోట 2019 ఎన్నికల తర్వాత పెద్ద జర్క్ వచ్చింది. ఇక కుప్పంలో టీడీపీ పని అయిపోయిందన్న ప్రచారాన్ని పెద్ద ఎత్తున జనంలోకి తీసుకేళ్ళే ప్రయత్నం చేసింది వైసీపీ. కట్ చేస్తే… ఇప్పుడు అదే పార్టీ అదే గడ్డ మీద క్లిష్టపరిస్థితుల్లో ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కుప్పం నుంచే 2024లో మళ్ళీ గెలిచి చంద్రబాబు సీఎం సీట్లో కూర్చుంటే…. నియోజకవర్గంలో వైసీపీకి నాయకుడు లేని పరిస్థితి దాపురించిందని చెప్పుకుంటున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జ్‌గా పెత్తనం చెలాయించిన ఎమ్మెల్సీ భరత్ ఏమైపోయారంటూ పార్టీ కేడర్ కాగడాలు పెట్టి వెదుకుతోందట. గడిచిన ఏడాదిన్నరలో ఆయన రెండు మూడు సార్లు తప్ప నియోజకవర్గం ముఖం చూడకపోవడం, అధికారం ఉన్నప్పుడు మా అంతటి వాళ్ళు లేరన్నట్టు బిల్డప్‌లు ఇచ్చిన కొందరు స్థానిక నాయకులు కూడా సైలెంట్‌గా సైడైపోవడంతో…. ఏం చేయాలో అర్ధంగాక దిక్కులు చూస్తోందట కేడర్.
సిసలైన నాయకులంటే… ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కదా అండగా నిలబడాలి. మరి వీళ్ళంతా ఇప్పుడిలా ముఖం చాటేస్తే… మన సంగతేంటంటూ తమలో తాము ఫీలవుతున్నారట కుప్పం వైసీపీ కార్యకర్తలు. అధికారంలో ఉన్నప్పుడు కుప్పం విషయంలో చాలా పెద్ద స్కెచ్చే వేసింది వైసీపీ అధిష్టానం. అప్పటి స్థానిక ఎన్నికల్లో తిరుగులేని ఆధిపత్యం సాధించడంతో… ఈసారి కుప్పంలో చంద్రబాబు ఓడిపోతారని గట్టిగా ప్రచారం చేశారు వైసీపీ నాయకులు. నాటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప కూడా కుప్పం మీదే గట్టిగా దృష్టి పెట్టారు. అదే టైంలో నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్‌గా ఉన్న భరత్‌కు అనూహ్యంగా ఎమ్మెల్సీ దక్కింది. తర్వాత ఆయన్ని చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిని చేశారు. నాటి సీఎం జగన్ కుప్పం పర్యటనకు వచ్చిన ప్రతిసారీ…. ఈసారి భరత్‌ను గెలిపిస్తే మంత్రిని చేస్తానంటూ స్వయంగా చెప్పేవారు. వై నాట్ 175 నినాదాన్ని కూడా కుప్పం నుంచే మొదలెట్టారు జగన్. ఎన్నికలకు ముందు హంద్రీనీవా నీటిని విడుదల చేయడం, 65 కోట్ల నిధులతో పనులు ప్రారంభించడం లాంటి కార్యక్రమాలతో కుప్పంలో ఏదో జరిగిపోతోందంటూ ఒక రకమైన వాతావరణాన్ని సృష్టించింది వైసీపీ. దీనిద్వారా….. చంద్రబాబు డిఫెన్స్‌లోపడి సొంత నియోజకవర్గం మీదే ఎక్కువగా దృష్టి పెడతారని, తాము మిగిలిన చోట్ల బాగా లాభపడవచ్చని అప్పట్లో వైసీపీ వ్యూహంగా చెప్పుకున్నారు.
Also Read
- OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
- Off The Record: అధికారం కోసం తప్ప పార్టీ కోసం ఎవరూ పని చేయట్లేదా..? ఆ ఉమ్మడి జిల్లా జనసేన కమిటీ మొత్తం రద్దు..
- Off The Record: రొటీన్‌కు భిన్నంగా ఆ మౌనవ్రతం ఎందుకు?.. కోలగట్ల వైఖరిపై వైసీపీలో చర్చ
ఒకటైంలో… చంద్రబాబు నియోజకవర్గంలోకి ఎంటర్ అవకుండా… అడ్డుకునే ప్రయత్నం చేయడం, ఆ సందర్భంగా గొడవలు అవడంతో అక్కడ అసలేం జరుగుతోందన్న టెన్షన్ అప్పట్లో ఉండేది. కట్ చేస్తే…. గత ఎన్నికల్లో ఆ పాచికలేవీ పారలేదు. ఇక్కడ వైసీపీ ఎత్తులన్నీ చిత్తవగా….. ఫలితాల తర్వాత టీడీపీ నాయకులు దూకుడు పెంచడంతో…. కుప్పం వైసీపీ నాయకులు చాలామంది అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. కొందరు సైకిలెక్కితే… ఇంకొందరు చెల్లాచెదురయ్యారు. కీలకమైన నియోజకవర్గ నాయకులు,
మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరులంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారట. కుప్పం వైసీపీలో కీలక నేతలైన విద్యాసాగర్, సెంథిల్ కూమార్ లాంటి వాళ్ళు కేరాఫ్ బెంగళూర్ అని చెప్పుకుంటున్నారు. అప్పట్లో మాటకు ముందు కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామని సవాల్ చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిధున్ రెడ్డి సైతం ఇప్పుడు అటువైపు వెళ్ళడం లేదట. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ కేడర్‌కు అండగా ఉండాల్సిన నియోజకవర్గ ఇన్ఛార్జ్, ఎమ్మెల్సీ భరత్ మాత్రం నాకేం సంబంధం లేదనట్టు హైదరాబాద్, బెంగుళూరు ట్రిప్స్‌తో టైంపాస్ చేస్తున్నారన్నది స్థానిక కార్యకర్తల ఆవేదన. మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి నిరసనగా ఇటీవల నిర్వహించిన సంతకాల సేకరణను సైతం ఆయన పట్టించుకోకపోవడంతో కార్యకర్తలే మమ అనిపించినట్టు తెలిసింది.
సార్…. రాకపోతే పోయారు…. కనీసం మా మీద పెడుతున్న కేసుల గురించి అయినా పట్టించుకోవాలి కదా? మా బాధలు చెప్పుకోవడానికి ఫోన్లు కూడా తీయకపోతే ఎలాగంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది కేడర్. అప్పుడేమో… మీకెందుకు నేనున్నానని భరోసా ఇచ్చి రెచ్చగొట్టి… తీరా ఇప్పుడు కేసులు పడుతుంటే కనీసం మాటవరసకి కూడా నేనున్నానని చెప్పకుండా గాలికి వదిలేశారన్నది కుప్పం వైసీపీ కేడర్ ఆవేదన. ఒకవేళ పొరపాటున ఫోన్ ఎత్తినా… చూసుకోండి ఇంకా టైం ఉంది కదా… మళ్లీ మాట్లాడదాం అంటూ సైలెంట్ గా తప్పించుకుంటున్నారట ఎమ్మెల్సీ భరత్. పరిస్థితి ఇలానే ఉంటే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫలితాలు కూడా ఇంతే ఉంటాయంటూ రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు కార్యకర్తలు. సీఎం నియోజకవర్గం విషయంలో వైసీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.
తాజావార్తలు
-
APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీ ఆడటం చాలా కష్టం.. నాకు నమ్మకం లేదు’.. సంచలన వ్యాఖ్యలు..
-
PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
-
Gurnoor Brar: 17 ఏళ్ల వయసులో క్రికెట్ ప్రారంభం.. 9 ఏళ్ల కష్టానికి టీమిండియా పిలుపు..
-
Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!