Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record About Telangana Cabinet Expansion Is The Date Fixed

Off The Record: తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్?

Published Date :March 18, 2026 , 10:43 pm
By Sudhakar Ravula
  • మళ్ళీ తెర మీదికి తెలంగాణ కేబినెట్‌ విస్తరణ చర్చలు..
  • అసెంబ్లీ సమావేశాల తర్వాత విస్తరణకు గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చిందా?..
  • ఈ నెలాఖరు, లేదా ఏప్రిల్‌ ఫస్ట్‌ వీక్‌లో విస్తరణ ఖాయమా?..
  • రెండు రోజుల్లో ప్రభుత్వ విప్‌ పోస్టుల భర్తీ..
  • రంగారెడ్డి నుంచి కేబినెట్‌ రేస్‌లో ఉన్న ముగ్గురు నేతలు..
  • స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌, మల్‌రెడ్డి రంగారెడ్డి, పరిగి రామ్మోహన్‌రెడ్డి..
  • ఆశలు పెట్టుకున్న దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్‌..
  • సీరియస్‌గా వర్కౌట్‌ చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి..
  • రేస్‌లో సుదర్శన్‌రెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావు..
  • కీలకమైన మంత్రుల పోర్ట్‌ఫోలియోలు మారతాయా?..
  • సీనియర్ మంత్రులకు కూడా మినహాయింపు ఉండబోదా?..
Off The Record: తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Off The Record: తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పుడు ఎవర్ని కదిలించినా ఒకటే టాపిక్‌. అదే…. కేబినెట్ విస్తరణ గురించి. సీఎం రేవంత్‌ రెడ్డి, PCC చీఫ్ మహేష్ గౌడ్ ఒకేసారి ఢిల్లీ వెళ్ళడం, అంతకు ముందు రోజే కో ఆర్డినేషన్ కమిటీ ప్రకటన రావడం, అటు పీసీసీ చీఫ్ గా జగ్గారెడ్డి ఉంటే 100 సీట్లు వస్తాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కామెంట్‌ చేయడం… ఇలా ఒకదాని వెంట ఒకటిగా వరుస పరిణామాలు జరుగుతున్నాయి. వీటన్నిటిని కలిపి చూస్తున్నవాళ్ళు మాత్రం ఏదో జరగబోతోంది, అది కేబినెట్ విస్తరణే అయి ఉంటుందని మాట్లాడుకుంటున్నారు. వాస్తవానికి…అంతకు ముందు పార్టీ సీనియర్ నేతలు, మంత్రులను ఢిల్లీ పిలిచి ఏర్పాటు చేసిన సమావేశంలోనే…కేబినెట్‌ విస్తరణ గురించి చర్చించినట్టు తెలిసింది. అప్పుడే పార్టీ పెద్దల దగ్గర ఈ ప్రస్తావన తీసుకొచ్చారట సీఎం రేవంత్‌. మార్పులు చేర్పుల గురించి అప్పుడే మాట్లాడుకున్నారట. అసెంబ్లీ సమావేశాల తర్వాత కేబినెట్‌ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు ప్రచారం జరిగింది. అది మనసులో ఉండగానే… ఇప్పుడు వరుసగా అన్ని అంశాలు కలిసి రావడంతో ఇక మంత్రివర్గంలో మార్పులు చేర్పులు తధ్యమని మాట్లాడుకుంటున్నాయి పార్టీ వర్గాలు.

ప్రభుత్వ చీఫ్‌విప్‌తో పాటు కేబినెట్ విస్తరణ ప్రక్రియ మొత్తం…. ఈ నెలాఖరు.. లేదంటే ఏప్రిల్ మొదటి వారంలో ఉంటుందని గట్టిగా నమ్ముతున్నారు కాంగ్రెస్‌ నాయకులు. ఐతే.. రెండు రోజుల్లో ప్రభుత్వ విప్ పోస్టులు భర్తీ కాబోతున్నాయి. నకిరేకల్ MLA వేముల వీరేశం, మహబూబ్‌నగర్‌ శాసనసభ్యుడు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, పెద్దపల్లి MLA విజయ రమణా రావుకు విప్ పదవులు ఇచ్చే అవకాశం ఉంది. ఇక కేబినెట్‌ విస్తరణ ఈక్వేషన్‌కు అనుగుణంగా చీఫ్ విప్ పదవి ఉండవచ్చంటున్నారు. రేవంత్‌ కెబినెట్‌లో ప్రస్తుతం 15 మంది మంత్రులు ఉన్నారు. మరో ఇద్దరికి అవకాశం ఉంటుంది. ఆ ఇద్దరితో పాటు… ఇప్పుడున్న మంత్రుల శాఖలను మార్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మంత్రివర్గంలో కూడికలు, తీసివేతలపై ఇప్పటికే చర్చ జరుగుతోంది. ఎవరిని తొలగిస్తారు… ఎవరిని కొత్తగా తీసుకుంటారన్న విషయంలో ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి. మంత్రి పదవి ఆశిస్తున్నవాళ్ళలో రంగారెడ్డి జిల్లా నుంచే ఎక్కువగా ఉన్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్‌ కుమార్‌తో పాటు.. మల్ రెడ్డి రంగారెడ్డి.. పరిగి రామ్మోహన్ రెడ్డి ఆశలు పెట్టుకున్నారు. ఇక లంబాడా సామాజిక వర్గం నుంచి దేవరకొండ MLA బాలు నాయక్ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇక అదే జిల్లాకు చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేబినెట్‌లో చోటు కోసం సీరియస్‌గా వర్కవుట్ చేస్తున్నారు. నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, మంచిర్యాల ప్రేమ్ సాగర్ రావు కూడా ఆశతో ఉన్నారు. ఇక శాఖల మార్పుల్లో భాగంగా కీలకమైన మంత్రుల పోర్ట్‌ఫోలియోలు కూడా మారవచ్చని అంటున్నారు. సీనియర్‌ మినిస్టర్స్‌ శాఖలు సైతం మారతాయన్న చర్చ కూడా గట్టిగానే ఉంది. సీఎం రేవంత్ మనసులో ఏముంది..? అధిష్టానం ఆయనకు ఏం చెప్పిందన్నది చూడాలి..!?

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Cabinet Reshuffle
  • Chief Whip Telangana
  • Congress leaders
  • Mahesh Goud
  • ministerial changes

తాజావార్తలు

  • Off The Record: తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్?

  • Deve Gowda: కాంగ్రెస్‌తో అందుకే విడాకులు.. ఖర్గే పంచ్‌లపై దేవెగౌడ కౌంటర్

  • Hyderabad: ఇలా చేస్తుంటే సిలిండర్ల కొరత ఎందుకు రాదు? భారీ దందా!

  • FASTag E-notice: హైవేలపై ఫాస్టాగ్‌ ఉపయోగించకపోతే రెట్టింపు ఫైన్.. కొత్త విధానం తెచ్చిన సర్కార్..

  • Aarohi Tomar: దంగల్ స్టోరీ రిపీట్.. రెజ్లింగ్‌లో మెరుస్తున్న సహారాన్‌పూర్ చిన్నారి

ట్రెండింగ్‌

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • IPL Fastest Ball: ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ డెలివరీలు.. టాప్-5లో మనోళ్లు ఇద్దరు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions