Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record About Tdp Leaders Go Door To Door Will Jana Sena And Bjp Work Together

Off The Record: ఇంటింటికి టీడీపీ నేతలు.. జనసేన, బీజేపీ కలిసి నడుస్తాయా..!?

Published Date :July 1, 2025 , 9:55 pm
By Sudhakar Ravula
  • ఇంటింటికి ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతల ప్రోగ్రాం..
  • దూకుడుగా వెళ్ళాలని టీడీపీ నేతల నిర్ణయం..
  • జనసేన, బీజేపీ కలిసి నడుస్తాయా అన్న డౌట్స్‌..
  • మిగతా రెండు పార్టీలు ఎందుకు యాక్టివ్‌గా లేవన్న ప్రశ్నలు..
  • కలిసి వెళితేనే బాగుంటుందన్న అభిప్రాయాలు..
  • ఇంటింటికీ టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలనే అన్నారన్న డౌట్స్‌..
Off The Record: ఇంటింటికి టీడీపీ నేతలు.. జనసేన, బీజేపీ కలిసి నడుస్తాయా..!?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Off The Record: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా… ఇంటింటికి ప్రజా ప్రతినిధులు, పార్టీల నేతలు వెళ్ళి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించాలని నిర్ణయించారు.దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ సమావేశం నిర్వహించింది. తమ ఏడాది ఘనతను జనంలోకి దూకుడుగా తీసుకువెళ్ళాలని డిసైడయ్యారు టీడీపీ లీడర్స్‌. మామూలుగా అయితే, కూటమి భాగస్వాములుగా… జనసేన, బీజేపీ కూడా కలిసి ఇంటింటికి నడవాలి. కానీ, ఇప్పుడా విషయంలో అనుమానపు చూపులు మొదలయ్యాయట. ఈ కార్యక్రమంలో.. జనసేన, బీజేపీ యాక్టివ్‌గా పాల్గొంటాయా? లేదా అన్న చర్చ జరుగుతోంది రాజకీయవర్గాల్లో. గత ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి పోటీ చేసి… అత్యంత సమన్వయంతో పనిచేసి అధికారంలోకి వచ్చాయి. ఇప్పుడు కూడా ఏదో తేడా జరిగిపోయిందని కాదుగానీ… అంటూ సణుగుతున్నారట కొందరు పొలిటికల్‌ పరిశీలకులు.

Read Also: Off The Record: వార్ లో జూనియర్ కొండా!

ప్రస్తుత వాతావరణాన్ని చూస్తుంటే…. ఆ విషయంలో తెలుగుదేశం నాయకులే ముందున్నారని, మిగతా ఇద్దరు ఎందుకు యాక్టివ్‌గా లేరన్నది వాళ్ళ క్వశ్చన్‌. అటు ఇంటింటికి కార్యక్రమంపై జనసేన, బీజేపీలో చర్చ నడుస్తోందట. మూడు పార్టీల నాయకులు కలిసే వెళ్లాలా..లేక టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రమే వెళ్తారా అన్నది అందులో మెయిన్‌ పాయింట్‌గా చెబుతున్నారు. అదే సమయంలో…. ఇంత భారీ కార్యక్రమం జరుగుతున్నప్పుడు ప్రభుత్వంలో భాగస్వాములుగా… అంతా కలిసి వెళితేనే మంచిదన్న అభిప్రాయం మిగతా భాగస్వాముల్లో ఉన్నట్టు తెలుస్తోంది. టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రమే వెళ్తారని ఎక్కడా చెప్పలేదని, కూటమి మొత్తం ప్రజల దగ్గరికి వెళుతోందన్న అభిప్రాయం ఉందని మాట్లాడుకుంటున్నారు పలువురు నాయకులు. ఈ క్రమంలోనే…జనసేన బీజేపీ కూడా కలిసి వెళితేనే నిండుదనం ఉంటుందని, బయటికి కూడా తప్పుడు సంకేతాలు వెళ్ళకుండా ఉంటాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది అన్ని వర్గాల్లో. ఇక్కడే ఇంకో టెక్నికల్‌ పాయింట్‌ని లేవనెత్తుతున్నారు కొందరు.

Read Also: War 2: ఫ్యాన్సీ రేటుకు వార్ 2 తెలుగు స్టేట్స్ రైట్స్ దక్కించుకున్న నాగవంశీ

టిడిపి విస్తృత స్థాయి సమావేశంలో ఇంటింటికి టిడిపి నేతలు లేకుంటే ఎమ్మెల్యేలు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారని, దాన్ని బట్టి చూస్తే… మిగతా రెండు పార్టీలు వెళ్తాయా లేదా అన్నది వాళ్ళ డౌట్‌. ఎవరు ఔనన్నా, కాదన్నా, ఏపీ వరకు కూటమిలో పెద్దన్న పాత్రలో ఉంది టీడీపీ. జనసేన, బీజేపీ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. బహుశా అందుకే ముందు టీడీపీ అభిప్రాయం చెప్పి ఉండవచ్చన్నది ఇంకో వెర్షన్‌. ఇక జనసేన, టీడీపీ మధ్య క్షేత్ర స్థాయిలో అక్కడక్కడా విభేదాలు ఉన్నా.. వాటిది బంధం మీద ప్రభావం చూపే స్థాయి కాదని, అందుకే పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. కలిసే వెళ్దామన్నది జనసేన, బీజేపీ అభిప్రాయంగా తెలుస్తోంది. మంచైనా, చెడైనా, తమ ఎమ్మెల్యేలు కూడా జనంలోకి వెళ్తే బాగుంటుందన్నది ఆ రెండు పార్టీల పెద్దలు అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో…. టీడీపీ మిగతా రెండు భాగస్వామ్య పార్టీలను కలుపుకుని వెళ్తుందా? లేక సోలో సాంగ్‌ పాడుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • bjp
  • cm chandrababu
  • jana sena
  • off the record

తాజావార్తలు

  • PBKS vs GT : గుజరాత్‌పై పంజాబ్ కింగ్స్ ఘనవిజయం.. అరంగేట్రంలోనే అదరగొట్టిన కూపర్ కానోలీ.!

  • Oracle Layoffs Hit India: ఒరాకిల్‌లో భారీ లేఆఫ్స్‌.. భారత్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లకు బిగ్‌ షాక్..

  • CM Revanth Reddy : మానవత్వానికి పట్టాభిషేకం.. ట్యాంక్ బండ్ శివ కుటుంబానికి సీఎం భారీ భరోసా.!

  • Off The Record: వివాదాస్పదంగా బెందాళం అశోక్ తీరు.. గిరిజనులనుద్దేశించి నోటి దురద మాటలు..

  • Chery Fulwin T9L: చెరీ ఫుల్‌విన్ T9L హైబ్రిడ్ SUV లాంచ్.. 2000KM రేంజ్‌తో గేమ్ చేంజర్!

ట్రెండింగ్‌

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • పచ్చిమిర్చి కోశాక చేతులు మండుతున్నాయా? ఈ ఇంటి చిట్కాలతో తక్షణ ఉపశమనం.!

  • 13000mAh భారీ బ్యాటరీ, 13.2 అంగుళాల 4K డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో ‘vivo Pad6 Pro’ విడుదల!

  • Lava సంచలనం.. రూ. 7,999లకే 50MP కెమెరా, IP54 రేటింగ్ తో ‘Bold N2 Pro’ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions