తూర్పు గోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పేరు చెబితేనే నియోజకవర్గంలో చాలామంది హడలిపోతున్నారట. అలాగని ఆయనేమన్నా... అసాంఘిక శక్తుల్ని ఉక్కుపాదంతో అణిచివేస్తున్నారా.. అవినీతిపరుల భరతం పడుతున్నారా అంటే.... అబ్బే.. అలాంటిదేం లేదు. అసలు ఎమ్మెల్యే అనుచరుల తీరే తేడాగా ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయట లోకల్‌గా. టీడీపీ, బీజేపీతో పొత్తు ఉన్నా... అది రాజకీయం వరకేగానీ... మిగతా వ్యవహారాల్లో మన రూటే సపరేటు అంటున్నారట ఈ జనసేన శాసనసభ్యుడి అనుచరులు.