Site icon NTV Telugu

Off The Record: నీలో మస్తు షేడ్స్ ఉన్నాయ్ బాస్..!!

Raja Singh

Raja Singh

Off The Record: గోషామహల్‌ ఎమ్మెల్యే రాజా సింగ్ బ్యాలెన్స్ కోల్పోతున్నారన్న అభిప్రాయం బలపడుతోంది తెలంగాణ పొలిటికల్‌ సర్కిల్స్‌లో. మనసు ఒక చోట మనిషి మరో చోట అన్నట్టు ఉంది అయన పరిస్థితి. ప్రస్తుతం ఆయన తనలో తాను స్ట్రగుల్ అవుతున్నారా అన్న డౌట్స్‌ కూడా వస్తున్నాయట పరిశీలకులకు. తానొకటి తలుస్తుంటే వెనకున్న శక్తులు మరోటి చేస్తున్నాయా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్ర పార్టీలో ఒకరిద్దరు నేతల మీద రాజా సింగ్‌కు ఉన్న కోపాన్ని ఎవరో అడ్వాంటేజ్ తీసుకుని ఎమ్మెల్యేనే బలి చేస్తున్నారన్న అనుమానాలు సైతం ఉన్నాయట పార్టీ సర్కిల్స్‌లో. పార్టీలో ఏం జరిగినా… ఆ విషయాన్ని క్షణాల్లో రాజాసింగ్‌కు చేరవేస్తూ… రెచ్చగొడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇటీవల మొదటి సారిగా రాజాసింగ్‌కు గట్టి కౌంటరే ఇచ్చింది. రాజీనామా చేసిన మీరు పార్టీని ఉద్దేశించి అవహేళనగా ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించింది. అదే ప్రశ్న ఇతరత్రా కొన్ని వర్గాల నుంచి కూడా వినిపిస్తోంది.

Read Also: USA: రష్యా నుంచి చమురు ఆపితేనే భారత్‌తో వాణిజ్య ఒప్పందం..

మీకో దండం… మీ పార్టీకో దండం అని చెప్పి రాజీనామా చేసిన రాజాసింగ్ ఇంకా… ఆ దండం పెట్టేసిన పార్టీ గురించి ఎందుకు మాట్లాడుకున్నారన్న ప్రశ్న గట్టిగానే వినిపిస్తోంది. ఆయన మాత్రం… తగ్గేదేలే అన్నట్టు పార్టీలో ఏం జరిగినా… నేను స్పందిస్తూనే ఉంటానని అంటున్నారు. ఇక్కడే… ఆయన ఎలాంటి మానసిక స్థితిలో ఉన్నారన్న చర్చ జరుగుతోంది బీజేపీ వర్గాల్లో. తాజాగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారుగానీ…. స్పష్టత లేకుండా మాట్లాడారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తానసలు పార్టీలో ఉన్నట్టా లేనట్టా అనే క్లారిటీ ఆయనకే లేనట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఒక వైపు నేను స్వతంత్రుడిని అంటూనే… అదే నోటితో నేను ఎప్పటికీ బీజేపీ మనిషినేనని చెబుతున్నారు. దీంతో వీటిలో ఏది కరెక్ట్‌? ఈ కలర్స్ ఏంది భయ్యా… అంటున్నారు చాలామంది. పిలిస్తే పార్టీలోకి వస్తా అంటున్నారు, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలంటున్నారు.

Read Also: Off The Record: జనసేన ఎమ్మెల్యేల్లో జోష్‌ తగ్గిందా..? మౌనం ఎందుకు..?

కానీ… వీళ్లతో కాదని నాయకత్వాన్ని నిందిస్తున్నారు. అలాగే… నేను నాలుగో సారి పోటీ చేస్తానో లేదో అని అంటూనే… పోటీ చేస్తే బీజేపీ కార్యకర్తలే గెలిపిస్తారంటూ ట్విస్ట్‌ ఇస్తారు. కొత్త కమిటీలో మంచి వాళ్ళు ఉన్నారని, ఏళ్ళుగా పార్టీ కోసం పని చేసిన వాళ్ళని అంటూనే… వీళ్ళ నాయకత్వంలో అధికారం వస్తే… నేను రాజకీయ సన్యాసం చేస్తానంటారు. దీంతో అసలింతకీ రాజాసింగ్‌ ఏం చెప్పదల్చుకున్నారన్నది ఎవరికీ అర్ధం కావడం లేదట. ఇంకొందరైతే…. ఇంకాస్త ఎటకారంగా… మస్త్‌ షేడ్స్‌ ఉన్నాయి బాసూ… నీలో అని కామెంట్‌ చేస్తున్నారట. మొత్తంగా ఇప్పుడున్న వాళ్ళతో అధికారంలోకి రావడం సాధ్యంకాదంటున్న రాజాసింగ్… మరి నాయకత్వాన్ని ఎవరికి ఇవ్వాలని మాత్రం చెప్పడం లేదు. అసలైనా… పార్టీలో లేని నీకెందుకయ్యా మా వ్యవహారాల గురించి అన్నది ఎక్కువ మంది కాషాయ నేతల క్వశ్చన్‌.

Exit mobile version