గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ బ్యాలెన్స్ కోల్పోతున్నారన్న అభిప్రాయం బలపడుతోంది తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో. మనసు ఒక చోట మనిషి మరో చోట అన్నట్టు ఉంది అయన పరిస్థితి. ప్రస్తుతం ఆయన తనలో తాను స్ట్రగుల్ అవుతున్నారా అన్న డౌట్స్ కూడా వస్తున్నాయట పరిశీలకులకు. తానొకటి తలుస్తుంటే వెనకున్న శక్తులు మరోటి చేస్తున్నాయా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.