Off The Record: టార్గెట్ గొట్టిపాటి..! బలరాంని అద్దంకికి మార్చే యోచనలో వైసీపీ..?
- 2009లో అద్దంకికి షిఫ్ట్ అయిన గొట్టిపాటి రవికుమార్..
- వరుసగా నాలుగుసార్లు మూడు పార్టీల తరపున గెలుపు..
- 2019కి ముందు వరకు అద్దంకి కేంద్రంగా కరణం రాజకీయం..
- 2019లో చీరాల నుంచి బలరాం గెలుపు, వైసీపీలోకి జంప్..
- 2024లో చీరాల నుంచి కరణం వెంకటేష్ పోటీ, ఓటమి..
- అద్దంకి నియోజకవర్గంలో ఇప్పటికీ బలరాం వర్గం..
- బలరాంని అద్దంకికి మార్చే యోచనలో వైసీపీ అధిష్టానం?..
- గొట్టిపాటికి బ్రేక్ వేయాలంటే కరణంతోనే సాధ్యమన్న లెక్కలు..
- బలరాం టీడీపీలోకి వెళ్తారన్న ప్రచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: బాపట్ల జిల్లా…. అద్దంకి నియోజకవర్గం అంటేనే వర్గ రాజకీయాలకు కేరాఫ్. ఒకప్పుడు ఇక్కడ కరణం బలరాం వర్సెస్ బాచిన చెంచు గరటయ్యగా రాజకీయాలు నడిచేవి. ఆ తర్వాత గొట్టిపాటి రవికుమార్ ఎంట్రీతో సీన్ మారిపోయింది. కొన్నాళ్ళు గొట్టిపాటి వర్సెస్ కరణం, మరి కొన్నాళ్ళు గొట్టిపాటి వర్సెస్ బాచిన కుటుంబాల పొలిటికల్ పోరు నడిచింది. రవికుమార్ నియోజకవర్గంలో పాతుకుపోవడంతో… ప్రత్యర్ధి ఎవరైనా గొట్టిపాటికి మరోవైపునే డీకొట్టాల్సిన పరిస్ధితి ఏర్పడిందన్నది లోకల్ టాక్. 2004లో రాజకీయ ఆరంగ్రేటం చేసిన గొట్టిపాటి రవికుమార్ ముందు మార్టూరు నుంచి పోటీ చేసినా… నియోజకవర్గాల పునర్విభజనతో 2009లో అద్దంకి నియోజకవర్గానికి షిఫ్ట్ అయ్యారు. దీంతో అప్పటి వరకూ కరణం.. బాచిన కుటుంబాల మధ్య ఉన్న వార్ కాస్తా గొట్టిపాటి వర్సెస్ అదర్స్ అన్నట్లుగా మారిపోయింది. 2009, 2014, 2019,2024ల్లో వరుసగా అద్దంకి నుంచి కాంగ్రెస్, వైసీపీ, టీడీపీల తరపున గెలు వస్తున్నారాయన. ప్రస్తుతం చంద్రబాబు కేబినెట్లో విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నారు రవికుమార్. ఇక 2019 ముందు వరకు అద్దంకి నుంచే బరిలో దిగుతున్న కరణం బలరాం కుటుంబం.. గొట్టిపాటి టీడీపీలో చేరటం, చీరాల టీడీపీ ఖాళీ కావటంతో తప్పనిసరి పరిస్దితుల్లో అటువైపు వెళ్ళాల్సి వచ్చింది.
Read Also: Ram Charan: లండన్‌లో రామ్‌చరణ్‌ను కలిసిన కామన్వెల్త్ బాక్సింగ్ ఛాంపియన్..
Also Read
2019లో చీరాల ఎమ్మెల్యేగా గెలిచిన కరణం బలరాం…. ఆ తర్వాత ఫ్యాన్ గూటికి చేరారు. ఇక 2024లో చీరాల నుంచే వైసీపీ తరపున ఆయన కుమారుడు కరణం వెంకటేష్ పోటీ చేసి ఓడిపోయారు. మరోవైపు గత ఎన్నికల్లో అనేక ప్రయోగాలు చేసి భారీ ఓటమిని మూటగట్టుకున్న వైసీపీ ఇప్పడిప్పుడే తప్పుల్ని సవరించుకుంటోంది. ఓడిన నియోజకవర్గాలపై కేస్ స్టడీ చేసి అక్కడ సమర్ద నాయకత్వాన్ని సిద్దం చేసే పనిలో ఉందట. ఆ క్రమంలోనే… అద్దంకికి మళ్ళీ కరణం బలరాం కుటుంబాన్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. నియోజకవర్గంలో ఇప్పటికీ బలరాంకంటూ ఓ వర్గం ఉంది. ఆయన ఎక్కడున్నా వాళ్ళతో రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటారట. గతంలో ఇక్కడ ఆయన కుమారుడు వెంకటేష్‌కు కూడా అన్నీ తామై నడిపించిందట ఆ వర్గం. ఇక అద్దంకిలో సమర్థవంతమైన నాయకత్వాన్ని బరిలో దించాలని చూస్తున్న వైసీపీ తిరిగి బలరాంకు బాధ్యతలు ఇస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. గొట్టిపాటి రవికుమార్ దూకుడుకు బ్రేక్ వేయడం ఒక్క కరణం వల్లే తప్ప ఇతరులకు వీలుకాదని వైసీపీ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం. అటు 2024 ఎన్నికల్లో అద్దంకి నుంచి వైసీపీ అభ్యర్దిగా పోటీ చేసిన పాణెం హనిమిరెడ్డి కూడా ఓడిన నాటి నుంచి నియోజకవర్గంలో యాక్టివ్‌గా లేరు. దీంతో ఆయన వైపు నుంచి అభ్యంతరాలు ఉండక పోవచ్చని అనుకుంటున్నారు.
Read Also: KTR: కాంగ్రెస్ ప్రభుత్వంపై వరుస పోరాటాలకు సిద్ధం కావాలి..
దీంతో అద్దంకిని సెట్ చేయాలంటే కరణం కుటుంబానికి బాధ్యతలు అప్పగించటం ఒక్కటే మార్గమని జగన్ ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. అదే జరిగితే గొట్టిపాటి దూకుడుకు కొంత కళ్లెం వేయవచ్చన్నది జగన్ లెక్కగా చెప్పుకుంటున్నారు. కానీ.. ఇక్కడే ఇంకో ట్విస్ట్ ఉంది. కరణం బలరాం తిరిగి టీడీపీలోకి వెళ్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారాన్ని ఆయన ఖండించనూ లేదు, అలాగని వెళ్తానని చెప్పడం లేదు. దీంతో అసలు బలరాం మనసులో ఏముందోన్నది తెలియాల్సి ఉందంటున్నారు పరిశీలకులు. ఎలాగైనా తన కుమారుడు వెంకటేష్‌కు ఓ మంచి పొలిటికల్ ఫ్లాట్ ఫాంని సిద్దం చేయాలన్నది బలరాం ఆలోచన అట. ఆ పరంగా చూసుకుంటే… ఆయన అద్దంకి వైపు మొగ్గు చూపవచ్చన్న విశ్లేషణలు పెరుగుతున్నాయి. మరోవైపు కరణం వెంకటేష్‌కు రాజకీయాలు కొత్త కాకున్నా… పోటీ చేసిన రెండు సార్లు ఓడటంతో ఈసారి గెలవక పోతే రాజకీయంగా కనుమరుగవుతానన్న భయం ఉందట. అందుకే… ఆచితూచి అడుగులు వేయాలనుకుంటున్నట్టు సమాచారం. త్వరలో అద్దంకి వైసీపీ బాధ్యతల్ని కరణం వెంకటేష్‌కు అప్పగిస్తారన్న ప్రచారంలో నిజమెంత? బలరాం ఆలోచన ఏంటి? కరణం వారి పాలిటిక్స్ ఏ టర్న్ తీసుకుంటాయన్నది తేలాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.
తాజావార్తలు
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!