Off The Record: తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీద హాటు ఘాటు చర్చలు నడుస్తున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చనిపోవడంతో ఇక్కడ బైపోల్ తప్పలేదు. వచ్చే రెండు మూడు నెలల్లో ఎన్నిక జరిగే అవకాశం ఉంది. అందుకోసం అన్ని పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. సిట్టింగ్ సీటుగా బీఆర్‌ఎస్‌కు, రాష్ట్రంలో అధికారంలో ఉన్నందున కాంగ్రెస్‌కు ఇది ప్రతిష్టాత్మకంగా మారింది. ఎలాగైనా జూబ్లీహిల్స్‌ను తిరిగి దక్కించుకోవాలన్న ప్లాన్‌తో… ముందే ఇన్ఛార్జ్‌లను నియమించి పక్కాగా వ్యవహరిస్తోంది గులాబీ పార్టీ. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్… ఈ నియోజకవర్గం మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి రెగ్యులర్‌గా సమీక్షిస్తున్నారట. సరిగ్గా… ఇదే టైంలో ఫార్ములా ఈ రేసు మరోసారి తెర మీదికి రావడం చర్చనీయాంశం అయింది. ఆ రూపంలో… కాంగ్రెస్ పార్టీ కేటీఆర్‌కు చెక్ పెట్టబోతోందా అని మాట్లాడుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. అటు బీఆర్‌ఎస్‌లో కూడా ఇదే తరహా చర్చ జరుగుతోందట. ఇప్పుడున్న పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం గెలుపు బీఆర్ఎస్‌కు అత్యంత అవసరం.. అందుకే కేటీఆర్ డైరెక్ట్ గా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారన్నది పార్టీ మాట.
Read Also: Minister Nara Lokesh: జగన్ వ్యాఖ్యలకు మంత్రి లోకేష్ కౌంటర్..
ఇలాంటి సమయంలో తమను డిస్టర్బ్ చేయడానికే కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి ఫార్ములా ఈ కేసును తెర మీదకి తెచ్చిందని అంటున్నారు బీఆర్‌ఎస్ నాయకులు. ఈ కేసు పేరుతో కేటీఆర్‌ని తీవ్రస్థాయిలో ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారట గులాబీ లీడర్స్. గతంలో విచారణల పేరుతో వరుసగా కేటీఆర్‌ని పిలిచారని, అదే ప్రక్రియ మరోసారి జరుగుతుందేమోనని అనుమానిస్తున్నారు పార్టీ నాయకులు. రాబోయే ఒకటి రెండు నెలల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి… ఆ టైంకి కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా కట్టడి చేసే ప్లాన్ ఉందన్నది వాళ్ళ అభిప్రాయంగా తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని చెబుతున్నారు బీఆర్ఎస్ లీడర్స్. జూబ్లీహిల్స్‌ను గెలవడం ద్వారా… తమ వాదన కరెక్టేనని చెప్పాలన్నది వాళ్ళ ఆలోచన.
Read Also: TG News: రైతులకు గుడ్‌న్యూస్.. సాదాబైనామాలపై నోటిఫికేషన్ విడుదల
అయితే…వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రచారం చేయకుండా, దీనిమీద దృష్టి సారించలేకపోతే… నెగటివ్ రిజల్ట్ వచ్చే ప్రమాదం ఉందని కూడా లెక్కలేసుకుంటున్నారు కారు పార్టీ లీడర్స్. అందుకే… ఒకవేళ కేటీఆర్ స్వేచ్ఛగా ప్రచారం చేయలేని పరిస్థితి వస్తే… ప్రత్యామ్నాయం ఏంటో… ఇప్పటినుంచే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే డివిజన్ల వారీగా ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను ఇన్చార్జిలుగా నియమించింది పార్టీ. ప్రస్తుతానికి వారం వారం సమీక్షిస్తున్నా… ముందు ముందు ప్రతిరోజు సమీక్షిస్తానని ప్రకటించారు కేటీఆర్. ఒకవేళ ఫార్ములా ఈ కేసులో ఆయన బిజీ అయి డైలీ సమీక్షలు చేయలేని పక్షంలో లీడర్స్ డీలా పడకుండా జాగ్రత్తలు తీసుకోబోతున్నారట. మొత్తం మీద జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు, ఫార్ములా ఈ కేసుకు ముడిపెట్టి బీఆర్‌ఎస్ వర్గాల్లో హాట్ హాట్‌గా చర్చలు జరుగుతున్నాయి.
