Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record About Bjp Leader Saidi Reddy Is Silent In Huzurnagar

Off The Record: హుజుర్‌నగర్‌ బీజేపీలో నిశబ్ద తాండవం

Published Date :October 8, 2025 , 9:00 pm
By Sudhakar Ravula
  • హుజూర్‌నగర్‌ బీజేపీలో నిశ్శబ్ద తాండవం..
  • ఇన్ఛార్జ్‌ శానంపూడి సైదిరెడ్డి రాజకీయ నిర్లిప్తత..
  • 2023 ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌ నుంచి బీజేపీలోకి..
  • బీజేపీ నల్గొండ ఎంపీ అభ్యర్థిగా పోటీ, ఓటమి..
  • ఓడిపోయాక టచ్ మీ నాట్‌ అన్నట్టుగా సైదిరెడ్డి..
  • స్థానిక ఎన్నికల వేళ ఇదేం వైఖరి అంటూ గుర్రుగా కేడర్..
  • తలలు పట్టుకుంటున్న గతంలో సైదిరెడ్డిని సపోర్ట్‌ చేసిన నేతలు..
  • వలస నేతలకు పెత్తనం ఇస్తే ఇలాగే ఉంటుందంటున్న కేడర్‌.. సైదిరెడ్డి సమీప బంధువులంతా బీఆర్‌ఎస్‌లోనే..
Off The Record: హుజుర్‌నగర్‌ బీజేపీలో నిశబ్ద తాండవం
  • Follow Us :
  • google news
  • dailyhunt

Off The Record: హుజూర్‌నగర్ బీజేపీలో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. నేతల మౌనాన్ని జీర్ణించుకోలేకపోతున్నారట ద్వితీయశ్రేణి నాయకులు. మరీ ముఖ్యంగా నల్లగొండ పార్లమెంట్ అభ్యర్ధిగా బరిలోకి దిగి ఓడిపోయిన… హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపుడి సైదిరెడ్డి పట్టీ పట్టనట్టుగా ఉండటం చూసి ఏం చేయాలో పాలుపోవడం లేదట కేడర్‌కు. 2019లో హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసి గెలిచారు సైదిరెడ్డి.. 2023 లోకూడా బీఆర్ఎస్ నుండి హుజూర్ నగర్ అభ్యర్దిగా బరిలోకి దిగి కాంగ్రెస్‌ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల్లో… కారు దిగి కాషాయ కండువా కప్పుకున్నారాయన. రాగానే… నల్గొండ ఎంపీ టిక్కెట్‌ ఇచ్చింది బీజేపీ. కానీ గెలుపు దక్కలేదు. వరుస ఓటముల తర్వాత ఇటు తాను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన హుజూర్ నగర్ నియోజకవర్గంతోపాటు అటు ఎంపీగా ఎన్నికల బరిలోకి దిగిన నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గంతో కూడా అంటీ ముట్టనట్లే ఉంటున్నారాయన. మాజీ ఎమ్మెల్యే రాకతో ఇటు హూజూర్ నగర్, అటు నల్లగొండలో పార్టీ బలపడుతుందనుకున్న కమలం నేతలకు తీవ్ర నిరాశే మిగిలిందని అంటున్నారు. పార్టీ బలోపేతానికిగానీ, క్యాడర్‌లో జోష్‌ నింపేందుకుగానీ.. ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకపోవడం, ఒకవేళ చేసినా మమ అనిపించడంపై క్యాడర్ గుర్రుగా ఉందట.

స్థానిక ఎన్నికల హడావిడిలోనూ ఆయన చొరవ తీసుకోకపోవడంపై అసంతృప్తి పెరుగుతున్నట్టు తెలుస్తోంది. శానంపూడి సైదిరెడ్డి ఎప్పుడు సై అంటాడోనని వేచి చూస్తున్న క్యాడర్ కు ఆ జాడలేవీ కనిపించకపోగా… టోటల్ సైలెన్స్ కావడంతో… ఏమయ్యా బాలూ…. నీవల్ల ఉపయోగం అన్న సినిమా డైలాగ్‌ని గుర్తు చేసుకుంటున్నారట కార్యకర్తలు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆయన్ని పార్టీలోకి తీసుకువచ్చేందుకు పైరవీలు చేసిన వారు, వచ్చాక రెడ్ కార్పెట్ పరిచిన నేతలంతా తాజా పరిణామాలతో తలలు పట్టుకుంటుండగా….అప్పట్లో వలస నేతలకు ప్రాధాన్యం ఇవ్వొద్దని గట్టిగా వాదించిన నేతలు మాత్రం… అయ్యిందా.. మీకు బాగా అయ్యిందా? తిక్క కుదిరిందా? అంటూ చురకలంటిస్తున్నారట. ఇంకొందరైతే… ఓ అడుగు ముందుకేసి హ… ఇలాంటివి ఎన్నిచూశాం అని ఓపెన్‌గానే కామెంట్స్‌ చేస్తున్నారట. వలస నేతలకు నల్లగొండ పార్లమెంట్, అసెంబ్లీ స్దానాలు కేరాఫ్‌ అయిపోయాయని, ఫలితంగా పార్టీ దెబ్బతింటోందని కాషాయం పార్టీ నేతలు కొంచెం కటువుగానే విమర్శిస్తున్నారు. ఎన్నికల సమయంలో చివరి క్షణం దాకా… పార్టీ పాత వాళ్ళకు టిక్కెట్‌ ఆశలు పెట్టి.. చివర్లో వలస నేతలను తెచ్చి నెత్తిన పెట్టుకుంటే ఇలాగే ఉంటుందని ఫైర్ అవుతున్నారు కరుడుగట్టిన కాషాయం నేతలు… శానంపూడి వెంట కారు పార్టీ నేతలు ఎవరూ కాషాయ పార్టీలోకి రాకపోవడం, ఆయన సమీప బంధువులంతా బీఆర్ఎస్ లోనే ఉండటం కూడా బీజేపీ నేతల అనుమానాలకు మరో కారణంగా తెలుస్తోంది. ఇక సూర్యాపేట జిల్లా బీజేపీ పార్టీ మాజీ అధ్యక్షుడు బొబ్బా భాగ్యరెడ్డి, తాజా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి హూజూర్ నగర్ నియొజకవర్గానికి చెందిన వారే కావడం, ఈ ఇద్దరు నేతలతో సైదిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏర్పడ్డ వైరం కారణంగా అనువుగానీ చోట అధికులమనరాదన్న సూక్తిని పాటిస్తున్నట్టు చెబుతున్నారు మాజీ ఎమ్మెల్యే అనుచరులు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • huzurnagar
  • off the record
  • Saidi Reddy
  • telangana

తాజావార్తలు

  • Sanju Samson: ఆయన్ను కలిశా, సెంచరీ చేశా.. ప్రతి మ్యాచ్‌కు ముందు కలిస్తే బాగుండు!

  • Story Board: మమత మరోసారి సీఎం అవుతారా..? బీజేపీ గెలుపు ఉట్టి కొడుతుందా?

  • Asha Bhosle: లెజెండరీ సింగర్ ఆశా భోస్లేకు గుండెపోటు.. బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో 92 ఏళ్ల సింగర్!

  • Ayush Mhatre ‘రిటైర్డ్ ఔట్’.. CSK వ్యూహం వెనుక అసలు కారణం ఇదే..!

  • Telangana : MPTC, ZPTC ఎన్నికల షెడ్యూల్ ఇంకెప్పుడు.?

ట్రెండింగ్‌

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions