NTV Telugu Site icon

Off The Record: చంద్రబాబులో పూర్తి స్థాయి మార్పు.. ఉబ్బితబ్బిబయిపోతున్న తమ్ముళ్లు.. ఇంతకీ ఏంటా మార్పు.?

Babu

Babu

Off The Record: అధికారంలోకి వచ్చిన ప్రతి సందర్భంలోనూ… నేను మారిపోయానని చెబుతుంటారు చంద్రబాబు. కానీ…. ఆ మార్పు ఎంతవరకన్న విషయమై టీడీపీ వర్గాల్లోనే భిన్నాభిప్రాయాలు ఉండేవి. ప్రస్తుతం నాలుగోసారి సీఎం అయిన సందర్భంలోనూ అదే మాట చెప్పారాయన. అయితే… ఈసారి మాత్రం భిన్నాభిప్రాయాలకు తావు లేకుండా…సార్‌ నిజ్జంగా మారారని అంటున్నాయట పార్టీ శ్రేణులు. గతంలో సమయపాలన పాటిస్తానని చెప్పినా.. అది అంతగా కన్పించేది కాదు.. పార్టీకి.. ప్రభుత్వానికి సరైన సమయం కేటాయిస్తానని చెప్పినా.. దాన్ని అమలు చేసేవారు కాదు. వాస్తవానికి చంద్రబాబు మీదున్న అతి పెద్ద కంప్లైంట్ కూడా అదే. అధికారంలోకి వస్తే.. ఆయనకు ప్రజలు, పరిపాలనే తప్ప.. పార్టీ, కార్యకర్తలు కనిపించరంటూ నిష్టూరమాడుతుంటారు చాలా మంది టీడీపీ లీడర్స్‌. కానీ… ఈసారి మాత్రం అలా కాకుండా… చాలా మార్పులు కనిపిస్తున్నాయట. ముందుగా సమయ పాలనతోనే దాన్ని అంచనా వేయవచ్చంటున్నారు విమర్శకులు.

Read Also: US flight: ప్రయాణికురాలికి చేదు అనుభవం.. థ్యాంక్యూ సార్ అన్నందుకు సిబ్బంది ఝలక్

గతంలో చంద్రబాబు సీఎం అంటే రివ్యూలు.. ఎడతెరిపిలేని టెలీ కాన్ఫరెన్సులు.. వీడియో కాన్ఫరెన్సులు అన్నట్టుగా ఉండేది. ఉన్నతాధికారులు కూడా తమ ఆఫీసుల్లో పని చేసుకోవడం కంటే.. సీఎంతో రివ్యూల్లోనే ఎక్కువగా కాలం గడిపే పరిస్థితి ఉండేది. కానీ ఈసారి అలాంటి వాటిని బంద్‌ చేసేశారు బాబు. ఓ అరగంట అటు ఇటుగా షెడ్యూల్‌ ప్రకారం పని కానిచ్చేస్తున్నారు. రోజూ వారీ షెడ్యూల్ నుంచి అవుట్ డోర్ విజిట్ వరకు అంతా టైం అంటే టైం ప్రకామే జరుగుతోంది. పార్టీ కార్యాలయానికి వెళ్లినా, సెక్రటేరియేట్‌కు వెళ్లినా అంతా ఆన్‌ షెడ్యూల్‌. ఇక గతంలో రాత్రి వరకు సచివాలయంలో రివ్యూలు చేసే సీఎం…. ఈ సారి అందుకు భిన్నంగా సాయంత్రం 5 లేదా 6 గంటల తరవాత సచివాలయంలో ఉండకుండా షెడ్యూల్ ఫిక్స్‌ చేసుకుంటున్నారట. అన్నిటికీ మించి ఇక్కడ ఇంట్రస్టింగ్‌ ట్విస్ట్‌ ఏంటంటే….తాను ఆరు దాటాక ఎలాంటి రివ్యూలు పెట్టుకోవడం లేదు సరికదా….. మీరు కూడా త్వరగా పని ముగించుకుని.. ఆరు తర్వాత ఇళ్లకు వెళ్లిపోండని మంత్రులకు కూడా సూచించారట సీఎం. ఆయన నోటి నుంచి ఈ మాటలు విన్న మంత్రులు నమ్మలేనట్టుగా ముఖాలు పెట్టి అమ్మో… మా సార్‌లో ఇంత మార్పా..? అని సంబరపడ్డారన్నది సెక్రెటేరియెట్ వర్గాల సమాచారం. రివ్యూల్లో కూడా సుదీర్ఘ ఉపన్యాసాలకు తాను స్వస్తి పలకడమే కాకుండా.. అధికారులను కూడా కమ్‌ టు ది పాయింట్‌ అంటున్నట్టు తెలిసింది.

Read Also: HIV-positive: “నిత్య పెళ్లికూతురి”కి హెచ్ఐవీ పాజిటివ్.. అధికారుల ఉరుకులు పరుగులు..

2014 ఎన్నికల్లో గెలిచాక విశాఖ ఆంధ్ర యూనివర్శిటీలో తొలి కెబినెట్‌ భేటీ పెట్టారు. ఆ రోజు సుమారు తొమ్మిది గంటల పాటు జరిగింది సమావేశం. కానీ.. 2024 గెలుపు తర్వాత జరిగిన తొలి కెబినెట్‌ భేటీ మూడు గంటల్లోనే ముగిసింది. దీంతో చంద్రబాబులో మార్పు చాలా కొట్టొచ్చినట్టు కన్పిస్తోందనే చర్చ ఇంటా బయటా జరుగుతోంది. ఈ పరిణామంతో…మంత్రులే కాకుండా ఉన్నతాధికారులు.. ఉద్యోగులు కూడా చాలా హ్యాపీగా ఉన్నట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో చేయడానికి పనే ఉండేది కాదు.. కానీ..చంద్రబాబు వచ్చాక వర్క్‌ లోడ్‌ విపరీతంగా పెరిగిపోతుందని భయపడ్డామని.. కానీ.. ఇప్పుడు ఓవైపు చేతి నిండా పని ఉంటున్నా.. సమయపాలన పాటిస్తుండడంతో వర్క్‌ శాటిశ్‌ఫాక్షన్‌ ఉందంటున్నారట ఉద్యోగులు. అలాగే… గతంలో అడ్మినిస్ట్రేషన్‌ ఒరియేంటేషన్‌తో పని చేసిన చంద్రబాబు.. ఇప్పుడు పొలిటికల్‌ ఒరియేంటేషన్‌తో పాలన సాగిస్తున్నారని అంటున్నారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌లంటే విపరీతమైన గౌరవంతో పాటు అవసరానికి మించి ఉన్నతాధికారులను నెత్తికి ఎక్కించుకునే తీరును నాలుగోసారి సీఎం అయ్యాక పూర్తిగా మార్చేసుకున్నారట చంద్రబాబు.

Read Also: Ponnam Prabhakar: జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్పై దాడిని ఖండించిన మంత్రి..

గత ఐదేళ్లల్లో అడ్డగోలుగా వ్యవహరించిన అధికారుల విషయంలో కఠినంగా ఉంటూనే.. రూల్‌ ప్రకారం పని చేసిన వారికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారన్న చర్చ జరుగుతోంది ఆఫీసర్స్‌ మధ్య. శ్రీలక్ష్మి, ప్రవీణ్‌ ప్రకాష్‌, పీఎస్సార్‌ ఆంజనేయులు, కొల్లి రఘురామిరెడ్డి వంటి వారి విషయంలో కఠినంగానే వ్యవహరించారు బాబు. తన ఛాంబర్‌ నుంచి కూడా బయటకు పంపేశారు. అసలు ఈ తరహా సీన్లు ఆయన దగ్గర ఉంటాయని తాము ఊహించ లేకపోయామన్నది పరిపాలనా వర్గాల్లో నడుస్తున్న టాక్‌. నిఖార్సుగా పని చేసిన అధికారులను భుజం మీద చేయి వేసి మరీ అప్యాయంగా పలకరిస్తున్నారట ఏపీ సీఎం. తాజాగా జరిగిన బదిలీలే ఈ విషయాన్ని చెబుతున్నాయని అంటున్నారు. ఇక పార్టీకి సమయం కేటాయించే విషయంలోనూ టీడీపీ అధినేత ఇంతే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రతి శనివారం పార్టీ కార్యాలయానికి వచ్చేలా ప్రణాళిక ఫిక్స్‌ చేసుకుంటున్నారట. గతంలో చంద్రబాబు కాన్వాయి బయలు దేరిందంటే.. గమ్యస్థానాన్ని చేరేంత వరకు ఆగేది కాదు. కానీ ఇప్పుడు రోడ్‌ పక్కన ఎవరైనా వినతి పత్రాలతో కన్పిస్తే చాలు.. కాన్వాయిని ఆపించేస్తున్నారాయన. వారితో మాట్లాడి.. విజ్ఞాపనలు తీసుకుని ఆ తర్వాతే ముందుకు కదులుతున్నారట. చంద్రబాబులో వచ్చిన ఈ మార్పు చూసి.. తమ నాయకుడు ఈ విధానాన్ని.. ఇదే స్టైల్‌ను కొనసాగిస్తే.. ప్రభుత్వానికి.. పార్టీకి తిరుగు ఉండదంటూ ఆల్‌ హ్యాపీస్‌ అంటోంది టీడీపీ కేడర్‌.

Show comments