Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Nizamabad Bjp Politics Has Reached To Top Level

తారా స్థాయికి చేరిన నిజామాబాద్ బీజేపీ వర్గపోరు

Published Date :April 20, 2022 , 11:50 am
By Premchand Chowdary
తారా స్థాయికి చేరిన నిజామాబాద్ బీజేపీ వర్గపోరు
  • Follow Us :
  • google news
  • dailyhunt

నిజామాబాద్ కమలంలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. రెండు, మూడు వర్గాలుగా నాయకులు.. కార్యకర్తలు విడిపోయారు. ఎప్పటి నుంచో ఉన్న అంతర్గత విభేదాలు ముదురుపాకాన పడుతున్నాయి కూడా. ఇందుకు హనుమాన్ శోభాయాత్రలో జరిగిన గొడవలే తీవ్రతను తెలియజేస్తున్నాయి.

బీజేపీలో గొడవలు సమసి అంతా గాడిన పడుతున్నారని అనుకుంటున్న తరుణంలో ముఖ్య నాయకులే రోడ్డెక్కి చొక్కాలు పట్టుకుంటున్నారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో పార్టీకి కాస్త పట్టుందని భావిస్తున్న అర్బన్‌లో పరిస్థితులు చేయి దాటిపోతున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్‌ ఎన్నికల సమయంలో పార్టీ నాయకులంతా కలిసి పనిచేశారు. ఆ ఐక్యత మూణ్ణాళ్ల ముచ్చటే అయింది. విభేదాలను పరిష్కరించాల్సిన నాయకులే వాటికి ఆజ్యం పోస్తున్నట్టు తాజాగా తెలియడంతో ఒక్కసారిగా బీజేపీలో కలకలం రేగుతోంది.

ఈ గొడవలకు కారణం అర్బన్‌ సీటును ఆశించే నాయకులు ఎక్కువ కావడమే. మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధనపాల్‌ సూర్యనారాయణ గుప్త, జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీ నర్సయ్యలు టికెట్‌ ఆశిస్తున్నారు. వీరిలో బస్వా లక్ష్మీనర్సయ్య కాస్త తటస్థంగా ఉన్నా.. ధనపాల్‌, యండల మధ్య తీవ్ర పోటీ ఉంది. హనుమాన్‌ శోభాయాత్రలో ఇద్దరూ తోసుకోవడం ఉద్రికత్తకు దారితీసింది.
ఘర్షణపై బీజేపీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారట ధనపాల్‌. ఈ ఫిర్యాదు వెనక బీజేపీ ఎంపీ ఒకరు ఉన్నారట. ఆయన ప్రోద్బలంతోనే యెండలపై కంప్లయింట్‌ చేసినట్టు సమాచారం. యెండలకు ఆ ఎంపీకి ఎప్పటి నుంచో పడటం లేదు. తాజా ఘర్షణను అనుకూలంగా మలుచుకుని పైచెయ్యి సాధించే పనిలో పడ్డారట ఆ ఎంపీ. ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు సర్దిచెప్పాల్సిన ఎంపీనే ఈ విధంగా అగ్నికి ఆజ్యం పోయడం చర్చగా మారింది. ఈ ఎపిసోడ్‌లో ఎంపీ పాత్రను బీజేపీ సీనియర్లు తప్పుపట్టినట్టు తెలుస్తోంది.

బీజేపీ సిద్ధాతంతాలకు కట్టుబడి పనిచేస్తున్న వాళ్లకు పార్టీలో గౌరవం దక్కడం లేదనే ఆవేదన ఉందట. ఇటీవల కాలంలో కాషాయ కండువా కప్పుకొన్నవాళ్లకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం ఓల్డ్‌ బీజేపీ శ్రేణులకు రుచించడం లేదట. ఇలాంటి సమయంలో వర్గపోరును.. అసంతృప్తిని పక్కన పెట్టాల్సిన పార్టీ ఎంపీ.. అందుకు భిన్నంగా వెళ్లడం కాషాయ శిబిరంలో కలకలం రేపుతోంది. ఇదే వైఖరి కొనసాగితే బీజేపీ బలంగా ఉందని అనుకున్నచోటే పార్టీని బొంద పెట్టేస్తారేమోనని కేడర్‌ ఆందోళన చెందుతోందట.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • bjp politics
  • Nizamabad BJP
  • Nizamabad BJP Politics
  • telangana

తాజావార్తలు

  • Kerala Elections 2026: కేరళలో భారీగా పోలింగ్ నమోదు.. ఇది దేనికి సంకేతం..!

  • Chain Snatching: చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న రిటైర్డ్ ఆర్మీ అధికారి.. అరెస్ట్ చేసిన రైల్వే పోలీసులు

  • Melania Trump: “నా పరువు తీస్తున్నారు”.. ఎప్‌స్టీన్‌తో సంబంధాలపై ట్రంప్ భార్య సంచలన ప్రకటన..

  • MonaLisa: మహాకుంభమేళ ‘వైరల్ గర్ల్’ మోనాలిసా ప్రేమ పెళ్లిలో కీలక మలుపు.. భర్త ఫర్మాన్ ఖాన్‌పై పోక్సో కేసు

  • Gold Price Trends: బంగారం ధరల విషయంలో ఏం జరుగుతోంది? చైనా, మరో చిన్న దేశం సైలెంట్‌ గేమ్‌..!

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions