Site icon NTV Telugu

Off The Record: కేంద్ర పార్టీ కోర్ట్లోకి రాజాసింగ్ వ్యవహారం

Rajasingh

Rajasingh

Off The Record: ఎమ్మెల్యే రాజాసింగ్‌ రాజీనామా వ్యవహారం సెంట్రల్‌ కోర్ట్‌లో పడిందా? ఇక ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కేంద్ర పెద్దలేనా? ఇప్పటికిప్పుడు రాజాసింగ్‌ రాజీనామాను ఆమోదించే అవకాశం ఉందా? ఒకవేళ ఆమోదిస్తే.. జరిగే పరిణామాలేంటి? ఆ విషయమై పార్టీ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది?

Read Also: Cheating Trade: ట్రేడింగ్ పేరుతో బోర్డు తిప్పేసిన అద్వికా ట్రేడింగ్ కంపెనీ.. లబోదిబోమంటున్న బాధితులు

బీజేపీకి రాజీనామా చేశారు ఆ పార్టీ ఎమ్మెల్యే రాజా సింగ్. మీకో దండం, మీ పార్టీకో దండం అంటూ.. రాష్ట్ర కార్యాలయంలో.. నేతల ముఖం మీదే చెప్పేసి వెళ్ళిపోయారాయన. అటు నాయకత్వం కూడా.. ఆయన క్రమశిక్షణారాహిత్యం పరాకాష్టకు చేరిందని ప్రకటించింది. ఎవరి భేషజాలు వారికి ఉంటే ఉండవచ్చుగానీ.. పార్టీ కన్నా ఎవ్వరూ ఎక్కువ కాదని క్లారిటీగా చెప్పేసింది స్టేట్‌ లీడర్షిప్‌. ముందు క్రమ శిక్షణను ఉల్లంఘించింది ఆయనే.. ఇప్పుడు రాజీనామా చేసింది కూడా ఆయనే అంటూ.. రాజీనామా వ్యవహారాన్ని కేంద్ర పార్టీ కోర్ట్‌లోకి వేసేసింది. దాంతో.. ఇక ఇప్పుడు రాజాసింగ్‌ రాజీనామా మీద నిర్ణయం తీసుకోవాల్సింది బీజేపీ కేంద్ర నాయకత్వమేనంటున్నారు. ఎమ్మెల్యే విషయంలో స్టేట్‌ నాయకులు పూర్తిగా విసిగిపోయినందునే.. డీల్ చేయడం ఇక మావల్ల కాదని చెప్పి.. వోవర్‌ టు ఢిల్లీ అన్నట్టు సమాచారం.

Read Also: Suryapet Horror: ఎటుపోతున్నాయి మానవ సంబంధాలు.. కన్న తండ్రినే దారికాచీ మరీ హత్య చేసిన కొడుకు..!

గతంలో కూడా ఒకసారి రాజాసింగ్‌ను కేంద్ర నాయకత్వమే పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది. తర్వాత చాలా రోజులకు దాన్ని ఎత్తేసి తిరిగి పార్టీలోకి తీలుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి గోషామహల్‌ టిక్కెట్‌ ఇవ్వడంతో పోటీ చేసి గెలిచారాయన. కానీ, కొంత కాలంగా ఆయన వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారట తెలంగాణ బీజేపీ నేతలు. తిరిగి పార్టీలోని తీసుకున్నాక.. 2023లో అసెంబ్లీ టికెట్ ఖరారు చేసే టైమ్‌లోనే… పార్టీ లైన్ తప్పకూడదని చెప్పండని అన్నారట ప్రధాని మోడీ. అయినా సరే, ఇప్పుడు ఇలా రచ్చ చేయడం సరికాదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోందట తెలంగాణ బీజేపీ వర్గాల్లో. ఒకవేళ ఇప్పుడు రాజాసింగ్‌ పార్టీకి చేసిన రాజీనామాను ఆమోదిస్తే.. ఆయన ఎమ్మెల్యే పదవి కూడా పోయే అవకాశం ఉంది. షెడ్యూల్ 10.. సెక్షన్ 2 A ప్రకారం.. చట్ట సభలకు ఏ పార్టీ నుంచి అయితే ఎన్నికవుతారో ఆ పార్టీకి రాజీనామా చేస్తే.. ఆటోమేటిక్‌గా అనర్హత రూల్ వర్తిస్తుంది.

Read Also: Off The Record: మంత్రి కొండా సురేఖకు ఓ ముఖ్య కార్యదర్శికి పడటం లేదా..?

ఆ రూల్‌ ప్రకారం చూసుకుంటే.. ఇప్పుడు బీజేపీ రాజాసింగ్‌ రాజీనామాను ఆమోదించి.. ఆ నిర్ణయాన్ని అసెంబ్లీ స్పీకర్‌కు తెలిపితే.. వేటు పడే అవకాశం ఉందని అంటున్నారు పార్టీ నేతలు. అయితే, ఎమ్మెల్యే ఆవేశపడ్డంత స్పీడ్‌గా కేంద్ర పార్టీ అడుగులు పడక పోవచ్చన్న అభిప్రాయం బలంగా ఉంది పార్టీ వర్గాల్లో. అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని ఆచితూచి నిర్ణయం ప్రకటించాల్సి ఉన్నందున కేంద్ర పార్టీ వెంటనే ఎస్‌ ఆర్‌ నో చెప్పకపోవచ్చని అంటున్నారు. తన రాజీనామాను ఆమోదించాల్సిందేనని రాజాసింగ్‌ గట్టిగా వత్తిడి చేస్తే తప్ప.. ఇప్పటికిప్పుడు ఉన్నఫళంగా ఓకే చెప్పే అవకాశం లేదన్నది కాషాయ దళం ఇన్నర్‌ సర్కిల్స్‌లో వినిపిస్తున్న మాట. మొత్తం మీద అయన రాజకీయ భవిష్యత్ కేంద్ర పెద్దల చేతిలోకి వెళ్ళిపోయింది.

Exit mobile version