Gravel Mafia: నేతల్ని కలిపిన కంకర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నవ్వి పోవుదురుగాక నాకేంటి అనే చందాన ఉంది ఆ ఇద్దరు నేతల తీరు. చీకటి ఒప్పందం చేసుకుని కంకర కోసం కొండలు మాయం చేస్తున్నారట. ప్రభుత్వానికి రాయల్టీ ఎగ్గొట్టి సొంత ఖజానా నింపుకొంటున్నారట. వారెవరో.. ఏంటో.. లెట్స్ వాచ్..!
ప్రశ్నించేవాళ్లు లేరు.. నేతలదే రాజ్యం
Also Read
కడప జిల్లా జమ్మలమడుగులో అక్రమ మైనింగ్ యధేచ్చగా జరుగుతోంది. దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్టు.. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య ఒప్పందం కుదిరిందట. దానిని ప్రశ్నించేవారే లేకపోవడంతో వాళ్లదే రాజ్యం. మధ్యలో ప్రభుత్వానికి చెందాల్సిన రాయల్టీని ఎగ్గొట్టేస్తున్నారు.
కంకర మిషన్ ఏర్పాటు చేసుకుని బండరాళ్లను కరిగించిన మాజీ మంత్రి?
జమ్మలమడుగుతోపాటు.. కర్నూలు జిల్లాలోని కోవెలకుంట్ల నియోజకవర్గాల్లో భూగర్భమంతా రాతిమయం కావడంతో గాలేరు-నగరి ప్రధాన కాలువ తవ్వినప్పుడు పెద్ద పెద్ద బండరాల్లు బయటపడ్డాయి. గుట్టలు గుట్టలుగా పోగుపడ్డ ఆ బండరాళ్లను సొమ్ము చేసుకున్నారు ఒక నాయకుడు. గత ప్రభుత్వ హయాంలో అప్పట్లో జిల్లాకు చెందిన మంత్రి కంకర మిషన్ ఏర్పాటు చేసుకుని బండరాళ్లను కంకరగా మార్చుకుని అమ్మేసుకున్నారు. మారు మూల ప్రాంతం కావడంతో కరెంటు పెద్దగా ఉండదు. దాంతో మిషన్లకు జనరేటర్లను పెట్టుకుని కంకర క్రష్ చేసి సొమ్ము చేసుకున్నారు.
అధికార మార్పిడి జరిగి మాజీ మంత్రి క్రషర్కు మూత
అప్పట్లో ఆ మాజీ మంత్రి పార్టీ అధికారంలో ఉన్నన్నాళ్లూ గాలేరు-నగరి కాలువ పొడవునా తవ్వకంలో పోగుపడ్డ బండరాళ్లు క్రషింగ్ చేసేశారు. ప్రభుత్వ రికార్డుల్లో చూపించేందుకు మైలవరం మండలంలోని ఓ గ్రామ పరిధిలో కొంత కొండను మైనింగ్‌కు లీజుకు తీసుకున్నారట. ఆ విధంగా లెక్క సరిచేసినట్టు చెబుతారు. ఈలోగా రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగింది. ఆ మాజీ మంత్రి ఓడి.. అధికారానికి దూరం అయ్యారు. అధికారపార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆ మాజీ మంత్రి ఆటలు సాగనివ్వలేదు. దీంతో ఆ మాజీ మంత్రి క్రషర్ మూతపడింది. ఈ బ్యాక్‌డ్రాప్‌లో కొన్నాళ్లు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో రాజకీయ విమర్శలు చేసుకున్నారు. కానీ.. కంకర కాసులు వారిని కలిపేశాయి.
మాజీ మంత్రి.. ఎమ్మెల్యే మధ్య రహస్య ఒప్పందం..?
లక్షలు పోసి కొన్న మిషనరీ ఖాళీగా ఉండటంతో ఎమ్మెల్యేకి మాజీ మంత్రి ఓ ప్రతిపాదన చేశారు. ఆ ప్రతిపాదన నచ్చడంతో ఏడాది క్రితం ఒప్పందం జరిగిందట. అంతే తిట్టిపోసుకున్నవాళ్లు కాస్తా చేతులు కలిపారు. మాజీ మంత్రికి చెందిన క్రషర్ ఎమ్మెల్యే లీజుకు తీసుకునేందుకు అడ్వాన్స్‌గా 50 లక్షలు, నెలకు అద్దె 12 లక్షలుగా సెట్ చేసుకున్నారట. దీనిపై ప్రతిపక్షం మాట్లాడకూడదనే షరతు పెట్టుకున్నారట. డీల్ ఓకే కావడంతో క్రషర్ ఎమ్మెల్యే చేతికి వెళ్లింది. అక్రమ తవ్వకాలతో మైలవరం మండలంలోని GNSS కాలువ రాళ్లు కరిగిపోతున్నాయి. గతంలో మాజీ మంత్రి చేసిన దానికంటే వేగంగా క్రషర్ ట్వంటీ ఫోర్ సెవన్ పనిచేస్తోందట. ఈ మొత్తం ఎపిసోడ్లో ట్విస్ట్ ఏంటంటే.. శత్రువులుగా చూసుకున్న నాయకుల నోళ్లకు తాళాలు పడ్డాయి.. ప్రభుత్వానికి చేరాల్సిన రాయల్టీ ఎగ్గొట్టేశారు.
తాజావార్తలు
-
Allu Arjun: అల్లు ఆర్మీకి షాకింగ్ న్యూస్! బన్నీతో సినిమా ఉంటుందా? ఉండదా? సందీప్ బ్రదర్ కామెంట్స్ వైరల్!
-
Cheque Book New Rules 2026: చెక్‌బుక్ కొత్త రూల్స్.. మీ చెక్‌పై ఈ సెక్యూరిటీ కోడ్ ఉందా? చెక్ చేసుకోండి!
-
Super EL Nino: ముంచుకొస్తున్న సూపర్ ఎల్‌నినో ముప్పు.. 100 ఏళ్ల రికార్డ్ బద్దలవుతోందా?
-
Hyderabad: బిల్డింగ్ కుప్పకూలడానికి అసలు కారణం ఇదే.. గచ్చిబౌలి ఘటనలో సంచలన నిజాలు
-
Toxic: టాక్సిక్ సెన్సార్ కట్స్.. నిజంగా షాకింగే!
ట్రెండింగ్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!