మంత్రి పదవి పోతుందని మినిస్టర్ ని పట్టించుకోని లేడీ ఐఏఎస్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొత్త కెబినెట్ కొలువు తీరాక ఏపీ సెక్రటేరియెట్‌లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఏ అధికారి ఎలా ఉంటారు? గతంలో ఎలా ఉండేవారు? ఇప్పుడెలా ఉంటున్నారనేది ఆ చర్చ సారాంశం. మాజీ మంత్రులు.. కొత్త మంత్రులు కలిస్తే మాత్రం కచ్చితంగా అధికారుల తీరు ప్రస్తావనకు వస్తోందట. ఈ క్రమంలో కొందరు ఐఏఎస్ అధికారుల తీరుపై ఆసక్తిగా చర్చ సాగుతున్నట్టు సమాచారం. అధికారుల తీరు వల్ల ఎదురైన ఇబ్బందులను.. కొత్త అమాత్యులతో పంచుకుంటూ.. ఆ ఆఫీసర్‌తో జాగ్రత్త.. ఈ అధికారిని కంట్రోల్‌లో పెట్టాలి అని అప్పగింతలు చేస్తున్నారట మాజీ మంత్రులు.
ఈ క్రమంలోనే ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఓ తాజా మాజీ మంత్రి పదవిలో ఉండగా.. ఓ అధికారిణి ప్రవర్తించిన తీరు.. ఆమె ఆ మాజీ మంత్రిని వెయిట్ చేయించిన ఉదంతంపై సచివాలయంలో కథలు కథలుగా చెప్పుకొంటున్నారు. కేబినెట్ ప్రక్షాళనపై చర్చ జరుగుతున్న సమయంలో ఫలానా వాళ్లు మంత్రి పదవుల్లో ఉండబోరనే అంచనాలతో ఆ అధికారిణి తన శాఖకు చెందిన మంత్రిని అస్సలు పట్టించుకోవడం మానేశారట. మినిస్టర్ ఏం చెప్పినా లైట్ తీసుకున్నారట. ఓ రోజు తన శాఖకు చెందిన అధికారులతో మంత్రి సమీక్ష చేస్తుంటే ఉద్యోగులంతా వచ్చారు కానీ.. ఆ శాఖకు ముఖ్యకార్యదర్శి హోదాలో ఉన్న ఆ లేడీ ఆఫీసర్ మాత్రం ఎంతసేపైనా రాలేదట. మంత్రిగారి పేషీ నుంచి ఆమెకు ఫోన్లు చేస్తూ.. చేస్తూ ఉంటే.. ఓ గంట గంటన్నర తర్వాత ఆ అధికారిణి కరుణించారట. సమీక్షకు వచ్చి ఐదు నిమిషాలు కూడా కూర్చొకుండానే.. నేను వస్తాను సార్.. మీరు మీటింగ్ కంటిన్యూ చేసుకోండని వెళ్లిపోవడంతో షాక్ తిన్నారట ఆ మంత్రి. పీకల్లోతు ఆరోపణల్లో కూరుకుపోయిన ఆ లేడీ ఆఫీసర్ ప్రస్తుతం శాఖ మారినా.. ఆమె వ్యవహరించిన తీరు మాత్రం నేటికీ హాట్ టాపిక్కే.
Also Read
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
- OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
- OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్‌గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
- OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్‌కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
కేబినెట్‌లో చోటు పదిల పర్చుకున్న ఓ మంత్రికి అధికారుల నుంచి ఎదురైన ముచ్చట ఇంకో లెవల్లో ఉందట. ఆ మంత్రి అప్పుడూ ఇప్పుడూ ఒకే శాఖ చూస్తున్నారు. కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా ఆ మంత్రి రాజీనామా చేయడానికి నాలుగు రోజుల ముందు నుంచే ఆ శాఖకు చెందిన స్పెషల్ సీఎస్ హోదాలో ఉన్న ఆఫీసర్ టచ్‌లో లేకుండా పోయారట. ఇక కమిషనర్ స్థాయి అధికారి అయితే.. ఆ నాయకుడు మంత్రిగా మళ్లీ వచ్చినా కనీసం ఫోన్ చేయలేదట. అప్పుడూ ఇప్పుడూ ఆ ఆఫీసర్‌తో తలపోట్లు తప్పడం లేదని సదరు అమాత్యులు వారు వాపోతున్నారట. ఇటీవలే ఆ అధికారి వచ్చి మంత్రిని కలిసిన సందర్భంలో ఆసక్తికర సంభాషణ జరిగిందట. ఏం సార్.. ఇక నేను రానని అనుకున్నారా? అని ఆఫీసర్‌ను ఉద్దేశించి ప్రశ్నించారట మినిస్టర్. మంత్రిగా ఉండబోనని.. హ్యాపీగా ఫీలయ్యారా అని వెంటనే మరో ప్రశ్న సంధించారట. దాంతో ఆ అధికారి బిత్తరపోయినట్టు సమాచారం. ప్రస్తుతం మాట వినని అధికారుల భరతం పట్టాలనే ఆలోచనలో ఉన్నారట మంత్రిగారు.
ఇక మంత్రిగా ఉన్నప్పుడు ఒక నాయకుడు తన శాఖకు చెందిన అధికారులపై ఈగ వాలనిచ్చేవారు కాదు. అంతటి చక్కటి ఆఫీసర్ నా జీవితంలో చూడలేదని చెప్పేవారు. అధికారులన్నాక.. వారి ఇబ్బందులు వారికి ఉంటాయి.. లీడర్లుగా వారితో నెమ్మదిగా చెప్పించుకుని చేయాలే కానీ.. పెత్తనం చేస్తామంటే ఎలా అంటూ అప్పట్లో ఎన్నో హితోక్తులు వల్లె వేసేవారట. అయితే మంత్రివర్గం ప్రక్షాళన ఖాయమని తెలిశాక.. ఆ అమాత్యునికి అధికారులు చుక్కలు చూపించారట. దాంతో ఆఫీసర్లు ఇంత ఘోరంగా ఉంటారా అని వాపోవడం ఆ మాజీ మంత్రి వంతు అయ్యింది. ఈ క్రమంలో కొందరు సీనియర్ మంత్రులు, మాజీ మంత్రుల నుంచి కేబినెట్‌లో కొత్తగా చోటు దక్కించుకున్న అమాత్యులు కొంత సమాచారం తీసుకుంటున్నారట. అధికారులను ఏ విధంగా కంట్రోల్‌లో పెట్టాలో మెళుకువలు నేర్పమని కోరుతున్నారట. దాంతో వారికి తోచిందేదో చెబుతూనే.. అధికారులను కంట్రోల్‌లో పెట్టడం చాలా కష్టం సుమీ అంటూ నిట్టూరుస్తున్నారట మాజీ మంత్రులు.
తాజావార్తలు
-
Preity Mukhundhan: ఫైట్స్‌తో పవన్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్న హీరోయిన్
-
Supreme Court: E20 పెట్రోల్‌పై సుప్రీంకోర్టులో కీలక విచారణ.. సంచలన విషయాన్ని బయటపెట్టిన కేంద్రం!
-
Andhra Pradesh Ranks No.1: మహిళా పారిశ్రామికవేత్తలకు అండగా ఏపీ.. దేశంలోనే అగ్రస్థానం
-
Ginger Benefits: నెలరోజులు రోజూ అల్లం తింటే.. మీ శరీరంలో జరిగే మార్పులు ఇవే!
-
Vaibhav Sooryavanshi: ఇంగ్లండ్ బౌలర్లకు ఏమీ తెలియదు.. తొలి టీ20లోనే వైభవ్‌ను ఆడించాలి!
ట్రెండింగ్
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్‌లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!