Missile Attack on LPG Tanker: హార్మూజ్ జలసంధిలో గ్యాస్ ట్యాంకర్‌పై క్షిపణి దాడి.. నౌకలో 24 మంది భారతీయులు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Missile Attack on LPG Tanker: హార్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఇక, హార్మూజ్ జలసంధిలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. 24 మంది భారతీయ నావికులు ఉన్న ఎల్పీజీ ట్యాంకర్‌పై క్షిపణి దాడి జరిగింది. ఈ విషయాన్ని కేంద్ర షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ వెల్లడించారు.. నవంబర్ 16వ తేదీన పనామా జెండాతో ప్రయాణిస్తున్న ‘తారా గ్యాస్’ అనే ఎల్పీజీ ట్యాంకర్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగినట్లు తెలిపారు. ఈ నౌకలో మొత్తం 25 మంది సిబ్బంది ఉండగా.. వారిలో 24 మంది భారతీయ నావికులు ఉన్నారు. అయితే, దాడి జరిగినప్పటికీ నౌకలోని భారతీయ పౌరులంతా సురక్షితంగా ఉన్నట్లు కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. వారి భద్రత, క్షేమాన్ని నిర్ధారించేందుకు సంబంధిత అధికారులు నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. నౌకను నిర్వహిస్తున్న యాజమాన్య సంస్థతో కూడా అధికారులు సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు.
మరోవైపు ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సముద్ర వాణిజ్య మార్గాల్లో హార్మూజ్ జలసంధి ఒకటి. ఈ మార్గం ద్వారా భారీ స్థాయిలో ముడి చమురు, సహజ వాయువు రవాణా జరుగుతుంది. అంతర్జాతీయ ఇంధన సరఫరాలకు ఈ జలసంధి ఎంతో కీలకం. ఇలాంటి ప్రాంతంలో నౌకలపై దాడులు జరగడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది. సముద్ర భద్రతతో పాటు ఇంధన సరఫరాలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉండటంతో ఈ పరిణామాలను ప్రపంచ దేశాలు నిశితంగా గమనిస్తున్నాయి. ముఖ్యంగా 24 మంది భారతీయ నావికులు ఉన్న నౌకపై దాడి జరగడంతో వారి భద్రతపై ఆందోళన నెలకొంది. అయితే, వారంతా క్షేమంగా ఉన్నారని కేంద్రం వెల్లడించడం ఊరటనిచ్చే అంశంగా మారింది. అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ నౌకా యాజమాన్య సంస్థతో సమన్వయం చేసుకుంటున్నారు.
Also Read
- Rahul Gandhi Reveals Dating Story: తన తల్లిదండ్రులు ప్రేమలో పడిన రెస్టారెంట్‌కే గర్ల్‌ఫ్రెండ్‌ను తీసుకెళ్లిన రాహుల్ గాంధీ.. ఆసక్తికర విషయాలు!
- Indian Employees Emergency Savings: జీతం వస్తేనే జీవనం.. భారత ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిపై సంచలన సర్వే..!
- PM Modi in Philippines: మనీలాలో వందేళ్ల చరిత్ర కలిగిన గురుద్వారాను సందర్శించిన మోడీ.. పునరాభివృద్ధి పనులకు శ్రీకారం
- Badrinath Highway Tragedy: బద్రీనాథ్ హైవేపై ఘోర ప్రమాదం.. లోయలో పడిన బస్సు.. ఆరుగురు మృతి!
⚠️ IMPORTANT UPDATE ⚠️
On Nov 16, Panama-flagged LPG tanker TARA GAS, carrying 24 Indian seafarers, was targeted in a missile attack in the Strait of Hormuz.
All 24 Indian nationals, along with the entire 25-member crew, are completely safe with no injuries.
We are continuously monitoring the situation and remain in close contact with the ship management company to ensure the ongoing security and wellbeing of our seafarers.
— Sarbananda Sonowal (@sarbanandsonwal) November 17, 2026
తాజావార్తలు
-
Missile Attack on LPG Tanker: హార్మూజ్ జలసంధిలో గ్యాస్ ట్యాంకర్‌పై క్షిపణి దాడి.. నౌకలో 24 మంది భారతీయులు..!
-
క్యాబ్ డ్రైవర్ ముసుగులో మిక్సింగ్ లిక్కర్ దందా.. ఇద్దరి అరెస్ట్.!
-
Mahindra XEV 9S: మహీంద్రా XEV 9S కు భారత్ NCAPలో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్.. 7 సీటర్ SUVలో సరికొత్త రికార్డు!
-
Sammakka Sagar Barrage: సమ్మక్క సాగర్ బ్యారేజీకి త్వరలోనే ఎన్ఓసీ.. సీఎం రేవంత్‌కు ఛత్తీస్‌గఢ్ సీఎం హామీ..!
-
IPL Retentions 2027: సన్‌రైజర్స్‌కు బిగ్ షాక్.. ఐపీఎల్ 2027కు ఇద్దరు స్టార్స్ దూరం.. ఇక అంతే సంగతులు!
ట్రెండింగ్
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్‌ఫోన్..!
-
IPL 2027 రిటెన్షన్లకు నేడే చివరి గడువు.. ఇప్పటి వరకు జరిగిన ట్రేడ్స్ లిస్ట్ ఇదిగో..